Free SMS And Earn Part Time Money







12/24/10

"రగడ" రగడచేస్తుందేమో story చూడండి


నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్లభరణి, రఘుబాబు, దేవ్‌గిల్‌, సత్యప్రకాష్‌,న ప్రదీప్‌రావత్‌, సుప్రీత్‌, శ్రీలలిత, సన, మాస్టర్‌ భరత్‌ తదితరులు. కెమెరా: సర్వేష్‌మురారి, సంగీతం: థమన్‌, ఆర్ట్‌: ప్రకాష్‌, నిర్మాత: డి. శివప్రసాద్‌రెడ్డి, దర్శకత్వం: వీరూ పోట్ల.

పాయింట్‌: పెంచిన తల్లికి జరిగిన అన్యాయానికి కొడుకు తీర్చుకునే ప్రతీకారం.

వీరు పోట్ల అనగానే రచయితగా పరిచయం. ఆ తర్వాత దర్శకుడు అయి 'బిందాస్‌' తీసి సక్సెస్‌ చేశాడు. దాంతో స్వతహాగా నాగార్జున ఫ్యాన్‌ కావడంతో ఆ కోణంలో ఆలోచించి రగడ చిత్రాన్ని రూపొందించారు. పూర్తి మాస్‌ మసాలా ఉన్న ఈ చిత్రం వినోదాత్మకంగా సాగింది.

తను చేసిన ఓ హత్యను చూసిన అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు దేవుడు (తనికెళ్ళభరణి). సడెన్‌గా పెద్దన్న (కోటశ్రీనివాసరావు) పంపాడని సుప్రీత్‌ వచ్చి భరణిని చంపేస్తాడు. మొదటి షాట్‌తోనే ఈ చిత్రం ఏ తరహానో దర్శకుడు చెప్పేశాడు. రౌడీరాజ్యంలో హీరో ఎలా డీల్‌చేశాడనేది కథ.

సత్య (నాగార్జున) కడప నుంచి సిటీకి వస్తాడు. సిటీలో ఎక్కడ గొడవలు జరిగినా దానిలో ఇన్‌వాల్వ్‌ అయి వారి భరతం పడతాడు. నచ్చితే చెరకు గడ, నచ్చకపోతే రగడ.. అనే ఫిలాసఫీతో ఉంటాడు. జీకె (దేవగిల్‌)కు ప్రదీప్‌రావత్‌ గ్యాంగ్‌కు సిటీలో వైరం. ఓ సందర్భంలో జీకెను కాపాడతాడు సత్య. దాంతో తమ గ్యాంగ్‌లో కలుపుకుంటాడు. అందుకు కోట్లరూపాయలు ఇస్తాననడంతో తనకు కావాల్సింది డబ్బే అని ఆ గ్యాంగ్‌లో చేరతాడు.

ఆ గ్యాంగ్‌లో షిండే శిరీష(అనుష్క)కు దగ్గరవుతాడు. అలా చేరి ప్రదీప్ రావత్‌ గ్యాంగ్‌లో ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. దీంతో విషయం అర్థంగాక సత్య బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకుంటాడు. తనను ఆదరించిన తల్లిని చంపినందుకు ప్రతీకారంగా సత్య ఇవన్నీ చేస్తున్నాడని గ్రహిస్తాడు ప్రదీప్‌రావత్‌. ఆతర్వాత సత్యపై ఎలా దాడి జరిపాడు? దాన్ని కడప ఉరఫ్‌ సత్య ఎలా డీల్‌ చేసి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేది కథ.

కథ ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది. మొదటి భాగం చాలా జోవియల్‌గా ఉంటుంది. రెండోభాగంలో కథ కాస్త సీరియస్‌గా ఉన్నా అదీ సరదాగా సాగుతుంది. పక్కామాస్‌ మసాలాతో తీసిన చిత్రమిది. పొగరు, గుండె ధైర్యంగల వ్యక్తిగా నాగ్ బాగానే చేశాడు. ఫాన్స్‌కు నచ్చేవిధంగా హావభావాలు, రాయలసీమ యాసను దర్శకడు వీరుపోట్ల చక్కగా మలిచాడు. సంభాషణలు పొందికగా రాశాడు. అనుష్క వయ్యారాలు ఒలకపోస్తూ మాస్‌ను ఆకట్టుకుంది.

ఆమె స్నేహితురాలిగా వచ్చే విధానం అష్టలక్ష్మి(ప్రియమణి) సన్నివేశం బాగుంది. వీరిద్దరు ఫ్రెండ్స్‌ అనే విషయం చివర్లో సత్య బయటపెట్టడం ట్విస్ట్‌. ఇలాంటివి రెండు, మూడు ఉండటంతో సెకండాఫ్‌లో కథ రక్తికడుతుంది. బ్రాహ్మాణ యువతిగా ప్రియమణి చేసిన పద్ధతి సరదాగా ఉంది. ఆమెకు తల్లిదండ్రులుగా ధర్మవరపు, సన, సోదరునిగా మాటకు 'నారాయణ' అంటూ సంబోధించే మాస్టర్‌ భరత్‌ సన్నివేశాలు హాస్యాన్ని పండిస్తాయి.

ఎమోషనల్‌ పాత్రల్లో ప్రదీప్‌రావత్‌, దేవ్‌గిల్‌, కోట శ్రీనిసరావు పాత్రలకు న్యాయం చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలు బాగున్నాయి. 'మీసమున్న మన్మథుడా..' పాటలో ఛార్మి అలరిస్తుంది. ఒకరకంగా డాన్స్‌ను ఇరగదీసింది. కాకపోతే సాహిత్యంలో స్పష్టత లోపించింది. మిగిలిన పాటలు బాగున్నాయి. 'రగడ రగడ... అనే టైటిల్‌ సాంగ్‌ సీరియస్‌ క్లైమాక్స్‌లో రొటీన్‌ పాటలా ఉన్నా అభిమానులకోసం తీసినట్లుంది. బ్రహ్మానందం పాత్ర పాత ధోరణిలో ఉన్నా కొత్తగా ఉంటుంది. అనుష్కను డాలింగ్‌ అంటూ లైనువేసే క్రమం మాస్‌ను ఆకట్టుకుటుంది. మిగిలిన పాత్రలు కధలో వచ్చి పోతుంటాయి.

సర్వేష్‌ మురారి తన కెమెరా నైపుణ్యంతో నాగ్‌ను గ్లామర్‌గా చూపాడు. సంగీతపరంగా థమన్‌ బాగానే చేసినా యాక్షన్‌లో నేపథ్య సంగీతం 'పోకిరి'ని తలపిస్తుంది. చార్మినార్‌ సెట్‌వేసి ఆర్ట్‌ప్రకాష్‌ వేసిన పాట పర్వాలేదు. ఇలా అందరి కృషితో మాస్‌మసాలాతో నాగ్‌ ముందుకు వచ్చాడు. ఇండస్ట్రీ బంద్‌ జరుగుతున్న తరుణంలో సినిమాలు రిలీజ్‌లు పెద్దగా లేకపోవడంతో "రగడ" రగడచేస్తుందేమో చూడాలి.
Powered by web analytics software.