Free SMS And Earn Part Time Money







1/19/11

దీక్ష సెథ్ లో ఎవరికి కనపడంది బ్రహ్మనందానికి ముందే కనపడింది


వేదం చిత్రంలో అల్లు అర్జున్ తో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ ని అందరు ఇప్పుడు టాలీవుడ్ కత్రినా అంటున్నారు. వేదం తర్వాత రవితేజతో మిరపకాయ్, గోపీచంద్ తో వాంటెడ్ చిత్రాలు చేస్తున్న ఈ భామ పర్సనాలిటీ అందర్నీ అలరిస్తుంది. ముఖ్యంగా ఈ భామకు హైట్ చాలా ప్లస్ అనడంలో ఎటువంటి ఆచ్చర్యం లేదు. ఇటీవల జరిగిన వాంటెడ్ ఆడియో వేడుకలో హాట్ హాట్ గా వచ్చిన ఈ భామ అందరి దృష్టిని అలరించింది. ఈ వేడుకలోనే బ్రహ్మానందం దీక్షాసేథ్ పై మనసు పారేసుకొని టాలీవుడ్ కత్రినా కైఫ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ తర్వాత అందరూ ఆలోచిస్తే నిజంగానే ఈ ముద్దుగుమ్మ లో అలాంటి పోలికలు కనిపించాయట.

వరల్డ్ కప్ దాటికి మార్చి లోపే సినిమాల దాడులు

రాబోయే మూడు వారాల్లో దాదాపు ఎనిమిది వరకూ తెలుగు చిత్రాలు భాక్సాఫీస్ ని పలకరించనున్నారు. అందరూ మార్చిలో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ ఎఫెక్టు తమ చిత్రంపై పడకూడదని భావించి రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటివరకూ రెడీ అయిన చిత్రాల లిస్టు...

జనవరి 21, 2011న అలా మొదలైంది (నాని హీరో,నందినీ రెడ్డి డైరక్టర్)
జనవరి 26, 2011న వాంటెడ్ (గోపీచంద్,బి.వి.యస్ రవి దర్శకత్వం)
జనవరి 28, 2011న జై బోలో తెలంగాణ(కొత్త వాళ్ళతో ఎన్.శంకర్ దర్శకత్వం)
ఫిబ్రవరి 4, 2011న కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పలరాజు (సునీల్, రామ్ గోపాల్ వర్మ)
ఫిబ్రవరి 4, 2011న వస్తాడు నా రాజు (మంచు విష్ణు వర్ధన్, హేమంత్ మధుకర్ డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న గగనం (నాగార్జు హీరో, రాధా మోహన్ డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న కుదిరితే కాఫీ కప్పు(వరుణ్ సందేశ్ హీరో, రమణ సెల్వా డైరక్టర్)
ఫిబ్రవరి 11, 2011న అహనా పెళ్ళంట (అల్లరి నరేష్, వీరభద్ర చౌదరి డైరక్టర్)

మార్చి లోపల ఇవి కాకుండా మరో 12 చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

రాకేష్ రోషన్...అనగనగా ఓ ధీరుడు చిత్రం చూసాడని వినపడిందంతా అబద్దమని తేలింది


మంచు లక్ష్మీ ప్రసన్న ని రాకేష్ రోషన్ తన క్రిష్ చిత్రం సీక్వెల్ లో తీసుకుంటున్నట్లు అన్ని చోట్లా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడది రూమర్ అని తేలిపోయింది. హృతిక్ రోషన్ సరసన చేయటానకి ఆమెను సంప్రదించాడని, రాకేష్ రోషన్...అనగనగా ఓ ధీరుడు చిత్రం చూసాడని వినపడిందంతా అబద్దమని తేలింది. అదెలా అంటే ఈ విషయాన్ని ఓ లీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళకున్న ముంబై పరిచయాలతో రాకేష్ రోషన్ ని సంప్రదించి అడిగారు. దానికి రాకేష్ రోషన్ ఆమె గురించి వినడం ఇదే తొలిసారి అన్నారు ఆశ్చర్యపోతూ. ఆమెను నేను ఎప్పుడూ కలవలేదు. వినలేదు..ఇదే మొదటిసారి ఆమె పేరు వినటం అన్నారు.ఇంతకీ లక్ష్మీ ప్రసన్న ఎవరు..సర్లేగాని నా సినిమాలో ప్రియాంక చోప్రాని తీసుకుందామనుకుంటున్నాను. అది కూడా చర్చలు దశలో ఉంది అని తేల్చేసారు. దాంతో తన క్రేజ్ పెంచుకోవటానికి లక్ష్మి ఈ రూమర్ క్రియోట్ చేసుకుందా అనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదీ మ్యాటర్.

golkonda review






అల్లు అర్జున్ పై అపనిందను తుడిపిన దీక్షా సేథ్


అల్లు అర్జున్ పై కామెంట్స్ చాలానే వున్నాయి. వారితో సినిమా చేసిన నూతన కదానాయికలకు ఆ తర్వాత సరైన అవకాశాలు రావనేది ఆ కామెంట్ సారాంశం. అల్లు అర్జున్ కైతే వరస బెట్టి గంగోత్రి తో పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో పరిచయమైన అనురాధా మెహతా, బన్ని తో పరిచయమైన గౌరీ ముంజాల్, వరుడు తో పరిచయమైన భాను శ్రీ మెహ్రల కెరీర్ లే ఇందుకు నిదర్శనాలు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ పై వున్న ఆ అపనిందను అర్జున్ తో ‘వేదం’ చిత్రంలో రోమాన్స్ చేసిన దీక్షాసేథ్ తొలిగించారు. ఎందుకంటె వేదం చిత్రంతో పరిచయమైన దీక్షాసేథ్ తర్వాత రవితేజ ‘మిరపకాయ్’ సినిమాతో చాన్స్ కొట్టేసి సినిమా సక్సెస్ తో మంచి మార్కులే కొట్టేస్తోంది. తర్వాత గోపీచంద్ సరసన నటిస్తోన్న సంగతి విదితమే. ఇలా వరుస విజయాలతో ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర కధానాయికగా ఎదుగుతున్నారు. చేతి నిండా సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా భాసిల్లుతున్నారు.

రీమేక్ లు తెచ్చి హీరోల డేట్స్ పట్టే నిర్మాత


మళయాళంలో సూపర్ హిట్టై రీసెంట్ గా తమిళంలోనూ కావలన్ టైటిల్ తో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం బాడీగార్డ్. ఈ చిత్రం రీమేక్ ని వెంకటేష్ తో చేస్తారని చాలా కాలంగా వినపడుతోంది.అయితే తాజాగా బాలకృష్ణ ఈ రీమేక్ లోకి వస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.రీమేక్ లు తెచ్చి హీరోల డేట్స్ పట్టే నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం వేట మొదలెట్టారని, అదీ బాలకృష్ణ కోసమేనని అంటున్నారు. గతంలో తమళంలో విక్రమ్ చేసిన చిత్రాన్ని తెలుగులో బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ టైటిల్ తో తీసి హిట్టు కొట్టిన విషయాన్ని గుర్తు చేసి మరీ బాలయ్యను ఈ రీమేక్ కు ఒప్పించాడని సమాచారం. అయితే ఇప్పటికే ఈ రీమేక్ రైట్స్ తెలుగులో ఒకరు తీసుకున్నారని, వారి వద్ద నుండి బెల్లంకొండ సురేష్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.ఈ చిత్రం 'మై లవ్‌ స్టోరీ' అనే పేరుతో హిందీలో ఈ సినిమా రీమేక్‌ అవుతుంది.

భాను విత్తనం పెరిగి బాలీవుడ్ దాక పోయింది ఈ చెట్టు


మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ సంబంధాలు టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపుతున్నాయి. భాను కిరణ్‌తో నిర్మాతలు సి. కళ్యాణ్, శింగనమల రమేష్, గణేష్ సంబంధాలపై టాలీవుడ్ అట్టుడుకుతోంది. టాలీవుడ్‌లో భాను కిరణ్ వేళ్లు ఎంత వరకు చొచ్చుకుపోయి ఉన్నాయనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్మాతలతో కలిసి భాను కిరణ్ భూదందాలు నడిపిన వైనం కూడా బయటపడుతోంది. ఈ స్థితిలో రక్తచరిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో భాను కిరణ్ సంబంధాలపై పోలీసులు దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రక్తచరిత్ర సినిమాకు కోట్ల రూపాయలు వర్మకు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. వర్మ ఖాతాలో పడిన డబ్బులు సూరి భాను కిరణ్ ద్వారా వేశాడా, భాను స్వయంగా వేశాడా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రక్త చరిత్ర సినిమాకు ముందు నుంచే భాను కిరణ్‌ తో వర్మకు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. వర్మ ద్వారా భాను కిరణ్ బాలీవుడ్‌లో కూడా పెట్టుబడులు పెట్టాడా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు ఓ టీవీ చానెల్‌లో వార్త వచ్చింది. వర్మను పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో విచారించే అవకాశం ఉందని అంటున్నారు.

మహేష్ దూకుడు కధ


మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న దూకుడు చిత్రం కధ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒకటి గత కొద్ది రోజులుగా వినపడుతోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం...మహేష్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. అతను చేతుల్లోంచి నుంచి ఓ మాఫియా లీడర్ (ప్రకాష్ రాజ్)పొలిటికల్ పవర్ ఉపయోగించుకుని తప్పించుకుని పారిపోతాడు. అతన్ని పట్టుకుని తిరిగి పది రోజుల్లోగా సరెండర్ చేయకపోతే మహేష్ వి, అతని టీమ్ వి ఉద్యోగాలు పోతాయని అతని సుపీయర్ ఆఫీసర్ (నాజర్)హెచ్చరిస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ ని పట్టుకోవాలని బయిలుదేరతాడు. ఈ లోగా ప్రకాష్ రాజ్..టర్కీలో తేలతాడు. ప్రకాష్ రాజ్ ని పట్టుకునే క్రమంలో టర్కీకి వెళ్ళిన అతనికి సమంత పరిచయమై..ప్రేమలో పడతాడు. ఆమె నాజర్ కూతురని తర్వాత తెలుస్తుంది. మరి కొంత సమయం గడిచాక అస్సలు ప్రకాష్ రాజ్ తప్పించుకుపోవటానికి డిపార్టమెంట్ లోనే ఉండి సహాయం చేసింది నాజరే నని అర్దమవుతుంది. దాంతో నాజరే విలన్ అని అర్దం చేసుకున్న మహేష్ ఎలా ప్రూవ్ చేసాడు అన్నది మిగతా కథ అంటున్నారు. ఇక ఈ చిత్రం ట్రీట్ మెంట్ ఎక్కువ భాగం కామిడీతో రన్ అవుతుంది. అలాగే ఈ కథ నిజమవ్వటానికి ఎంత అవకాశముందో కాకపోవటానికి అంతే అవకాసం ఉంది. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

తమిళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి 75లక్షలు


ఓ ప్రక్క రెమ్యునేషన్స్ తగ్గించాలని మొత్తుకుంటున్న నిర్మాతల మండలి రీసెంట్ గా తమిళ నటుడు ప్రభుకి తెలుగులో ఇస్తున్న రెమ్యునేషన్ విని షాక్ అయింది.ఓ క్యారెక్టర్ ఆర్టిస్టులో తెలుగులో చేస్తున్న ప్రభుకి సినిమాకు డబ్బై ఐదు లక్షలు చెల్లింస్తున్నారు. అంతేగాక ఆయనకు స్టార్ హోటల్ లో హీరోతో సమానంగా రూమ్స్ ఇవ్వాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తారట.తమిళంలో హీరోగా వెలుగు వెలిగి క్యారెక్టర్స్ ఆర్టిస్టుగా పడిపోయిన ప్రభుకి అక్కడ పెద్దగా సినిమాలు లేకపోవటంతో ఆయన దృష్టి అంతా తెలుగుపై పెడుతున్నారు. తమిళం నుంచి వస్తున్న దర్శకులు తమ సినిమాల్లో ఆయనకు ప్రత్యేకమైన పాత్రలు క్రియోట్ చేసి తమ అభిమానం చాటుకోవటమే కాక ఆయన రెమ్యునేషన్ ను కూడా పెంచి గౌరవిస్తున్నారు. అయితే ఆయన తమ సినిమాలో ఉన్నాడని ఏ తెలుగు వాడు కూడా ఒక్క టిక్కట్టూ ప్రత్యేకంగా కొనరు. ఆయన రీసెంట్ గా డార్లింగ్, ఆరెంజ్ చిత్రాల్లో నటించారు. అదీ సంగతి.

క్యాజువల్ సెక్స్ లేకపోతే ఆడియన్స్ ధియేటర్లకు ఎలా????Natalie portmen


ప్రస్తుతం హాలీవుడ్ మొత్తం ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు నటించినటువంటి నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమా గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం ఈసినిమాలో ఆస్టన్ కుచర్, నటాలీ పోర్ట్ మెన్‌లు ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారం ఒలకించారని సమాచారం. ఈ సందర్బంలో ఆస్టన్ కుచర్ మాట్లాడుతూ సాధారణంగా సినిమాలలో నిజంతమైన సెక్స్ ఉండడం అనేది సహాజం. నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో నటాలీ పోర్ట్ మెన్ నేను చేసింది అలాంటి సెక్స్ మాత్రమే. అంతేకాకుండా నిజజీవితంలో యంగ్ పీపుల్ రిలేషన్ షిప్స్ కోసం ఎలా పరితపించిపోతారో ముఖ్యంగా ఈసినిమాలో చూపించడం జరిగందన్నారు. అలాంటి సన్నివేశాలు లేకుండా సినిమా తీయకపోతే ఈసినిమాకి అస్సలు అర్దం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఈసినిమాలో మేము చేసినటువంటి సెక్సీ సీన్లు కూడా చాలా నిజజీవితంలో ఒక భార్య భర్తలు ఎలా ప్రవర్తస్తారో అలానే ఉన్నాయి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టేవిధంగా ఉండవు అని అన్నారు.

అబద్దాల నీతూ "ప్యాంటి లెస్ గా ఫంక్షన్ కి "

మరి ఇవెంటో
కొన్నాళ్ళు బికిని అది సినిమా తెర పై ఫ్యాషన్ అయింది బాలీవుడ్ తారలకి మరి ఇప్పుడు బహిర్గతంగా ఫంక్షన్ లకి ప్యాంటి లెస్ గా రావటం ఫ్యాషన్ అయింది అలా ఈ కోవకి మరొక హిరోయిన్ చేరిందంటు వార్తాలు వచ్చయ్ కాని అవన్ని నిజం కాదంటు ఇవన్ని సిగ్గు కి సంభంధించిన వార్తలంటు ఇలాంటి వార్తలు ప్రచురించేటప్పుడు జాగ్రత్త వహించాలని తన పై వచ్చిన వార్తలు సున్నితంగా తిరస్కరించింది నీతూచంద్ర ఎంత సున్నితంగా వార్తలు ఖండించిందో నీతూ అంతే సున్నితంగా మిడియా వారు బాలీవుడ్ హిరోయిన్స్ కి ఒక సలహ విసిరారు ఫంక్షన్ లకి వచ్చేటప్పుడు పూర్తి దుస్తులతో రమ్మని ఈ ప్యాంటిల గుస గుసలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో బాగుందికదా అని కొనసాగిస్తారో వేచి చూడండి చీ చీ........!

అజయ్ దేవ్ గన్ షాజహాన్ పదా ంసీ ని పొగిడితే ఈ అమ్మడు చరణ్ పొగుడుతోంది దీని వెనక పరమార్ధం









genelia latest photo shoot

తాప్సి తమన్నా కి తలనొప్పా????


మోహన్ బాబు బ్రాండ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సి ఇప్పుడు తమిళ నాట అడుగుపెట్టి తమన్నా కి హడలు పుట్టిస్తోంది ఇప్పటిదాక అందరూ హిర్పయిన్లని ఏదొవిధంగా నెట్టు కొచ్చి నెంబర్ వన్ అని అనిపించుకుంటున్న తమన్నా తాప్సి దెబ్బకి బెంబేలెత్తుతోంది ఎక్కువ ఎక్స్ పోజింగ్ ఇవ్వకుండా ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన ఈ అమ్మడు తాప్సి చేసే చేష్టలకు అది కూడ కాని వాల్సి వచ్చేలాఉంది ఎందుకంటే ఈ అమ్మడు[తాప్సి] అటుశౄంగరానికి , ఎక్స్ పోజింగ్ కి ,lip lock లకి రెడి అని డైరక్టర్స్ ని కుర్ర కాని ఊపేస్తోంది మరి ఈ అందం కొన్నళ్ళో మరి ఇంకె-----
Powered by web analytics software.