Free SMS And Earn Part Time Money







7/5/09

తాన సభలలో రాజకీయ రసాభస



రాష్ట్ర రాజకీయాలు అమెరికా తెలుగువారిలో కూడా చిచ్చును పెట్టాయి. ఈ రాజకీయ అంతర్గత కలహాలు బయటపడి సజావుగా సాగుతున్నతానా మహా సభలను రసాభాసగా మార్చాయి. ఈ పుణ్యం కట్టుకున్నది కూడా ఇక్కడి నుంచి సభలకు ప్రముఖులుగా, చుట్టపు చూపుగా వెళ్ళిన మన రాజకీయ నాయకులే కావడం విశేషం. ఇక్కడ నోటి మాటలతో విమర్శలు చేసుకోడానికి అలవాటైపోయిన ఈ నాయకుల వల్ల తానా సభలో తెలుగువారుఐక్యతను ఒక్కసారిగా మరచిపోయి గ్రూపులుగా ఏర్పడి కాలర్లు పట్టుకోడానికి కూడా సన్నద్ధమైపోయారు. గత మూడు రోజులుగా తానా సభలకు వచ్చిన తెలుగువారి మధ్య రాజకీయ అహంకారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చిన్న చిన్ని కీచులాటలు జరుగుతున్నా సర్దకుపోతూ, తానా సంబరాల్లో సరదాగానే గడిపారు. కాని చివరి రోజున నిర్వహించిన పొలిటికల్ ఫోరం మాత్రం ఈ పొగలను సెగలుగా మార్చేసింది. చివరకు మంత్రి గల్లా అరుణ కుమారి జోక్యం చేసుకుని సున్నితమైన భాషలో కఠన వాస్తవాలు చెబుతూ మందలించేంత వరకూ తానా సభకు వచ్చిన తెలుగువారు చల్లారలేదు.

జగపతి నీ మతి

Jagapati Babu

త్రిష చాలా అందమైన అమ్మాయనీ, ఏదో ఒక రోజు ఆమెతో నటించాలని కోరుకుంటున్నాననీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు తన మనసులో మాట వెల్లడించారు. ఇక జగపతిబాబు ఇంత ఓపెన్ గా త్రిషతో నటించాలనే కోరికను బయటపెట్టడం ఇండస్ట్రీలో చర్చ గా మారింది. సాధారణంగా హీరోయిన్స్ తమకు ఎవరితో చేయాలనీ ఉందో చెప్పటం ఆనవాయతి. ఇప్పుడు జగపతి రూట్ మార్చి ఇలా తన మనసులో కోరికను చెప్పటంతో మిగతా హీరో లు ఇదే దారిలో వెళ్ళే అవకాసం ఉంది అంటున్నారు. అయిన ఇప్పటికే హీరో లలో చాల మంది తమ నిర్మాతలకు, దర్శకులకు ఈ తరహా డిమాండ్లు చేస్తున్నసంగతి తెలిసిందే


లత మంగేష్కర్"గానకోకిల"


ఎన్నో పాటలతో అభిమానులందరిని అలరించి గానకోకిలగా పేరుగాంచిన లత మంగేష్కర్ మరోసారి అభిమనులని అలరించనుంది తి.తి.దే వారు నిర్వహించనున్న అన్నమాచార్య
ప్రాజెక్ట్లో లత మంగేష్కర్తో ఏడు పాటలు పాడిస్తున్నారు ఈ "సంకీర్తన సప్తాహ్" లో లత
మంగేష్కర్ సంస్కృతంలో పాడనున్నారు గురుపౌర్ణమిరోజు రికార్డింగ్ ప్రారంభించ నున్నారు
మరొసారి సంగీతప్రియులు లత మంగేష్కర్ మధురమైన పాటలు వినబోతునారు మీరందరు
తి.తి.దే వారికి అభినందించండి ఎందుకంటే మధురమైన సంగీతాన్ని అందించిన
అన్నమాచార్య కీర్తనలు మళ్ళి మళ్ళి వినిపించే విధంగా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు
అందులో పాల్గొంటున్న లత మంగేష్కర్,బాలసుబ్రమణ్యం వంటి గాయకు ధన్యులు సంకీర్తన
సప్తాహ్ అద్భుతమైన విజయం సాధిస్తుంది ఇందులో సందేహం లేదు సి.డిలు,క్యాసెట్లు
కొని మధురమైన సంగీతాన్ని ఆనందించండి


నిర్మాతల కొత్త ట్రెండ్


ట్రెండ్‌లో యూత్ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుండటంతో ఆ తరహా చిత్రాల నిర్మాణానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ కోవలో రూపొందుతున్న చిత్రం 'తేజం'. ఇందులో ఎనిమిది మంది కొత్త హీరోలు నటించారు. సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్.కె.ఎన్.గోపి దర్శకత్వంలో ఎస్.రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. యూత్ చిత్రమైనప్పటికీ, చక్కటి కథాబలంతో దీనిని రూపొందించామని నిర్మాత రాజశేఖర్ వెల్లడించారు. ఇటీవల మైత్రీ సంస్థ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. గణ సంగీతం ప్రతిఒక్కరినీ అలరింపజేస్తుందని అన్నారు. ఆడియో హిట్ కావడం చిత్ర విజయానికి ముందస్తు సంకేతమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. సామాజిక స్పృహతో తీసిన చిత్రమిదని, ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
దర్శకుడు రాజ్.కె.ఎన్.గోపి మాట్లాడుతూ, 'కథను నమ్ముకునే ఈ సినిమాను చేశాం. ఇంకా చెప్పాలంటే కథే హీరో. నిర్మాత ఇచ్చిన సహకారమే చిత్రం బాగా వచ్చేందుకు దోహదం చేసింది. హీరోలు కొత్తవారైనా తమ పాత్రలకు పూర్తి న్యాయంచేకూర్చారు. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో సర్ధార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, ఆర్.జె.రాజు, గౌతమ్, జయవర్దన్ ప్రధాన పాత్రలు పోషించగా, మోనీషా కథానాయికగా నటించింది. ఇతర పాత్రలను బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, కిషోర్‌దాస్ తదితరులు పోషించారు.





: తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు

Powered by web analytics software.