"శంఖం" హీరో గోపిచంద్ ఆడియో కేసెట్‌ను విడుదలచేయగా, రాజశేఖర్ దంపతులు సీడీని విడుదల చేశారు.
ముందుగా మగధీర దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. ఆడియో మార్కెట్ పడిపోయిన తరుణంలో పూరి ఆడియో సంస్థను స్థాపించడం అతని గట్స్‌ను తెలియజేస్తోందన్నారు. రఘుకంచె సంగీతదర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని, సాయిరాంశంకర్ నటించిన 143 తనకు చాలా ఇష్టమని రాజమౌళి చెప్పుకొచ్చారు. "143" చిత్రంలో మ్యూజిక్ బాగుందని.., ఇందులోని "లేచిపోదామా.." అనే సాంగ్ ఇప్పటికీ తన కారులో ఉందని చెప్పారు.
"కిక్" హీరో రవితేజ మాట్లాడుతూ.. సాంగ్స్ బాగున్నాయని, సాయిరాంశంకర్, రఘుకంచె, పూరిజగన్నాథ్‌లకు ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ.. బంపర్ ఆఫర్ కథ తనకెంతో నచ్చిందన్నారు. "పెళ్లెందుకు రమణమ్మ.." అనే పాట ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. పాటల ప్రోమోస్ చూస్తుంటే.. కొత్త దర్శకుడు చేసినట్లుగా లేదన్నారు. పూరిజగన్నాథ్ తీసినట్లు ఉంది. ఆడియో సంస్థ స్థాపించిన పూరీ ఆ మార్కెట్లో నిజమైన రిజల్ట్ ఇస్తారని, అది ఇండస్ట్రీ మనిషికే సాధ్యమని రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ.. మా గాయకుడు రఘుకంచె సంగీతదర్శకుడు కావడం ఆనందంగా ఉందన్నారు. రాజశేఖర్ చెప్పినట్లు.. నిజమైన ఆడియో రిజల్స్ పూరీనే ఇవ్వగలరని చక్రి తెలిపారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. తన తమ్ముడితో '143' తీశాను. మంచి సినిమా తీశాననే పేరు వచ్చింది. అయితే డబ్బురాలేదు. టీవీల్లోనే బాగా ఆడిం