Free SMS And Earn Part Time Money







11/16/10

Hurry Potter last part Trailer


అరుంధతిగా ఐశ్వర్య రాయ్:దాంతో విలన్ ఎవరు నిర్మాతలకు ఎంపిక మిగిలింది


"అరుంధతి" చిత్రం త్వరలో హిందిలోకి (త్రీడీ ఫార్మెట్ లో) రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రంలో పాత్రల ఎంపిక జరుగుతోంది. అరుంధతిగా ఐశ్వర్య రాయ్ దాదాపు ఖరారు అయినట్లేనని తెలుస్తోంది. దాంతో విలన్ గా బొమ్మాళి అంటూ అరూస్తూ భయపెట్టేది ఎవరన్నది నిర్మాతలకు ఎంపిక మిగిలింది. రకరకాలుగా ఆలోచించిన తర్వాత సోనూసూద్ నే హిందికి కూడా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమితాబ్ ని తీసుకోవాలనుకున్నారు కానీ ఆయన తాను చేయలేనని, సోనూసూదే కరెక్టు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడుగా ధూమ్ దర్శకుడు సంజయ్ గద్వీని ఎంపిక చేసారు. ఈ చిత్రం రైట్స్ కోసం బోనీకపూర్ చివరి వరకూ పోటీపడ్డారు. ఇక ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే జెమినీ వారు ఈ చిత్రాన్ని హిందీలో బారీగా ప్లాన్ చేస్తున్నారు. త్రీడిలో అయితే మరింత Hurrer గా మారి నేషనల్ వైడ్ గా మంచి పేరు, డబ్బు తెస్తుందని ఆశించి కొన్నామని చెప్తున్నారు.

మామ అల్లుడితో ప్రియమణి


పెళ్ళయిన కొత్తలో చిత్రంతో ఒకటయిన జగపతి బాబు, ప్రియమణి ల ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రియమణి ప్రధానపాత్రలో చేస్తున్న తాజా చిత్రం క్షేత్రంలో జగపతి బాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడు. ఇంతకుముందు సాధ్యం తో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేసిన ప్రియమణి మరో సారి తన చుట్టూ తిరిగే కథని ఓకే చేసింది. ఇక ఈ చిత్రంలో కిక్ తో పరిచయమైన శ్యామ్ కీలకమైన పాత్రలో కనపించనున్నాడు. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకుని సెట్స్ మీదకు వెళుతుంది. ఇక ప్రియమణి ప్రస్తుతం "నాగార్జున సరసన రగడ, సుమంత్ సరసన రిమ్ జిమ్" అనే చిత్రంలో చేస్తోంది. ఆమె నటించిన రామ్ గోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్ర డిసెంబర్ 3న విడుదల కానుంది.

నాభీ నృత్యాన్ని ప్రదర్శించినందుకు గాను సదరు చిత్ర నిర్మాత ఇలియానాకు రూ. 30 లక్షలు పారితోషికంగా ఇచ్చాడట.


ఇలియానా అంటే దక్షిణాది సినీ పరిశ్రమలో రాను రాను క్రేజ్ పెరుగుతూ పోతోంది. దీనికి కారణం ఇలియానా సినిమా అంటే కుర్రకారు ఎగబడి చూడటమేనన్నది వేరే చెప్పనక్కర లేదు. టాలీవుడ్‌లో తన హవా సాగిస్తున్న ఈ బక్క నడుము చిన్నది ఇప్పుడు శాండల్‌వుడ్‌లోనూ కాలు పెట్టింది. హీరోయిన్‌గా కాదు.. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్‌గా. అయితే ఆ పాటలో పాల్గొన్నందుకు ఇలియానాకు భారీగానే పారితోషికం ముట్టిందని టాలీవుడ్ సినీవర్గాలు చెపుతున్నాయి. అత్యంత సెక్సీగా ఐటమ్‌సాంగ్‌లో తన నాభీ నృత్యాన్ని ప్రదర్శించినందుకు గాను సదరు చిత్ర నిర్మాత ఇలియానాకు రూ. 30 లక్షలు పారితోషికంగా ఇచ్చాడట. కాగా ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణకు కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే పట్టిందట. కనుక ఇలియానా రెమ్యునరేషన్ రోజుకు రూ. 10 లక్షలన్నమాట.
Powered by web analytics software.