12/6/10
వెంకటేష్ ఏ హిరొయిన్ తో వెళ్ళాలో మిరే చెప్పాలి
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన నాగవల్లి చిత్రం ఆడియో హిట్ అయిన సందర్భంగా డబుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకుంది. సోమవారం హైదరాబాదులోని సినీమ్యాక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథి కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా వెంకటేష్ షీల్డు అందుకున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, బి. గోపాల్ చేతుల మీదుగా కమిలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్, అనుష్క, రిచా తదితరులు అందుకున్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. ఎవరూ ప్రధాన హీరోయినో అర్థం కాదు. అనుష్క కలిసుందాం రా అని పాట పాడుతుంది. కమిలినీ ప్రేమించుకుందాం అంటూ ఆడుతుంది. శ్రద్దాదాస్ పెళ్లిచేసుకుందాం రా అని ఆట పట్టిస్తుంది. రిచా మాత్రం లేచిపోదాం రా అంటుంది. ఇంతమంది ఎందుకున్నారు.. అనేది సినిమాలో చూడొచ్చు. పాటలు కథకు తగినట్లుగానే ఉన్నాయి. ప్రతి ఫ్రేమూ అందంగా కన్పిస్తుంది. నిండుగా హీరోయిన్లు కనబడతారు. నిర్మాతకు మంచి లాభాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.
పి.వాసు మాట్లాడుతూ, పరుచూరి బ్రదర్స్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తమిళంలో వాలి అనే రచయిత ఉన్నాడు. ఆయనలా రచయితలు సహకరించారు. గురుకిరణ్ చక్కని సంగీతాన్ని అందించారు. చంద్రబోస్ సాహిత్యం చక్కగా ఇచ్చారు. రీరికార్డింగ్ హైలెట్‌గా ఉంటుంది. 16న సినిమా విడుదలవుతుంది. ఐదుగురు హీరోయిన్లు పోటీపడి నటించారు. వారికి వారి క్యారెక్టర్లు తెలీదు. సెట్‌లోకి వచ్చాక చెప్పినప్పుడు వాటికి అనుగుణంగా చక్కగా నటించారన్నారు.
అనుష్క మాట్లాడుతూ... గురుకిరణ్ మంచి సంగీతాన్ని అందించారు. పైరసీలను ప్రోత్సహించకండి. ఈ సినిమాను పి.వాసు బాగా తీశారు. మంచి అనుభూతి పొందాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వెంకటేష్‌గారి గెటప్స్ చూసి ఆశ్చర్యపోయాను. చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు అన్నారు.
త్రివిక్రమ్ వండర్ ఫుల్ టెక్నీషియన్:Mahesh
నటుడిగా ఇంతకు ముందెన్నడూ చేయని సబ్జెక్ట్ ‘ఖలేజా’..నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం ‘ఖలేజా’ అంటూ ‘ఖలేజా’ సినిమా గురించి ఇంకా ఇంకా ఓ రేంజ్ లో చెబుతున్నాడు హీరో మహేష్ బాబు. బాక్సాఫీస్ వద్ద ‘ఖలేజా’ బెడిసి కొట్టిందన్న విషయాన్ని ఎట్టకేలకు అంగీకరించిన మహేష్, ఫెయిల్యూర్ కి సవాలక్ష కారణాలుంటాయనీ, ‘ఖలేజా’ విషయంలో చేసిన అటెంప్ట్ మాత్రం చాలా గొప్పదని చెప్పుకొచ్చాడు. వెరైటీ కథల్ని తాను ఇష్టపడ్తుంటాననీ, రొటీన్ గా వచ్చే పాత్రలు తనకు అస్సలు ఇష్టం ఉండదనీ, ‘దూకుడు’ సినిమాలోనూ కొత్త మహేష్ ని చూస్తారని మహేష్ అంటున్నాడు.
అభిమానుల ప్రోత్సాహంతోనే కొత్త తరహా సినిమాలు చేయగలుగుతున్నానన్న మహేష్, ‘ఖలేజా’ సినిమా విషయంలో అభిమానులెవరూ హర్ట్ కాలేదన్నాడు. త్రివిక్రమ్ వండర్ ఫుల్ టెక్నీషియన్ అనీ, అతనితో మరో సినిమా ఖచ్చితంగా వుంటుందని మహేష్ వెల్లడించాడు. కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకొస్తేనే వెరైటీ సినిమాలొస్తాయని, అలాంటి వెరైటీ సినిమాలకోసం తానెప్పుడూ ముందుంటానని మహేష్ స్పష్టం చేశాడు.
నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు:భాస్కర్
నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు. నిర్మాత అనేవాడు ఇండస్ట్రీకి ప్రాణం. అటువంటి నిర్మాతను వైరస్‌లా పట్టిపీడిస్తూ పిప్పి చేస్తున్నారు కొందరు దర్శకులు. మన శరీరంలో వైరస్ ఎలా రోగాన్ని తెచ్చి చివరికి చంపేస్తుందో అలాగే చేతకాని దర్శకుడు నిర్మాతను పిండిచేసి ఆ తర్వాత వారూ చచ్చిపోతారు. ఇదంతా కడుపు మండి అంటున్నానని ఆదివారం రాత్రి రవితేజ మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో చెప్పారు.
అప్పటివరకూ సరదాగా సాగుతున్న ఫంక్షన్ కాస్తా ఒక్కసారిగా మిరపకాయ్ అంత ఘాటెక్కింది. దర్శకులు గురించి మాట్లాడుతూ... ఎన్ని రోజులు సినిమా తీస్తామో తెలియని దర్శకులున్నారు. కొత్త నిర్మాత వస్తే పురుగుల్లా దోచేస్తున్నారు. ఇది అందరినీ ఉద్దేశించినది కాదు. రాంగోపాల్ వర్మను చూడండి. ఆయన అమితాబ్ వంటి గొప్ప ఆర్టిస్టును పెట్టుకుని పరిమిత టైమ్‌లో సినిమా తీశారు. ఏం... ఆయనకంటే.. మీరు పోటుగాళ్లా.. అంటూ ప్రశ్నించారు.
ఒకప్పుడు 2సి కెమేపాతో అడవిరాముడు తీశారు. అప్పటి నుంచి టెక్నాలజీ పెరిగినా మేకింగ్‌లో రోజులు మాత్రం ఎక్కువ సాగుతున్నాయి. ఎందుకని...? దర్శకులు చేతకానివారు కాబట్టి. నిర్మాత నమ్మి డబ్బు పెడితే దోచేస్తారా..? అలాగే ఆర్టిస్టులు కూడా రేటు తగ్గించుకోవాలి. రాంగోపాల్ వర్మలా సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీని బాగు చేయండి అన్నారు.
దీంతో అదంతా ఆరెంజ్ దర్శకుడు భాస్కర్ గురించేనని అక్కడివారందరికీ అర్థమైంది. అర్థంపర్థం లేని కథతో 30 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్‌తో తీసినా ఆరెంజ్ "ఢాం"మని పేలిపోయింది. దీంతో నాగబాబు సందర్భం దొరికినపుడల్లా భాస్కర్‌పై మండిపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినాయక్.. ఒక్కసారి తనను తాను బేరీజు వేసుకుని తన సినిమాలు కూడా ఎన్ని రోజులు తీశానో అనే డౌట్ వస్తుందనీ, ఇక నుంచి నిర్మాత చెప్పినట్లే తీస్తానని అన్నారు.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |