Free SMS And Earn Part Time Money







11/17/10

"నాగవల్లి" సినిమా కధ బయటపడిపోయింది:అనుష్క నాగవల్లి కాదు మరి ఎవరు




ఫ్యామిలి హీరో వెంకటేష్ నటిస్తున్న "నాగవల్లి" సినిమా కధ బయటపడిపోయింది ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అవటానికి సిద్దమవుతోంది ఈ సినిమా లో వెంకటేష్ డెబల్ రోల్ చేస్తున్నాడు ఒకటి మ్యెజిషియన్ గా "రామచంద్ర ఆచార్య" రెండు సైకాలజిస్ట్ గా Dr.విజయ్

అనుష్క:సరస్వతి ,

పూనం కౌర్:నీత ,

కమలిని:గౌరి

విమల రామన్ మెయిన్ రోల్ నాగవల్లి


కధలోకి వెళితే మైసూర్ లోని ఒక కుటుంబం పెయింటింగ్ ని చూసి డిస్టర్బ్ అవుతారు అ పెయింటింగ్ పేరు నాగవల్లి కుటుంబ సభ్యులయిన స్వాతి , గౌరి , నీత
నాగవల్లి వల్ల సైకలాజికల్ గా బాగ బాధపడుతు ఉంటారు . ఫ్యామిలి మెంబర్స్ అంతా ఒక నిర్ణయం తీసుకుని సైకాలజిస్ట్ రామచంద్ర ఆచార్య [Venkatesh] ని కలవటానికి డిసైడ్ అవుతారు ఈ ప్రొబ్లం సాల్వ్ చేయటానికి వచ్చిన వెంకటేష్ నాగవల్లి ఎవరు కనుక్కొంటాడు. అ ప్రొసెస్ లో 125సంవత్సరాల క్రితం కి వెళ్ళవల్సి వస్తుంది అప్పటి రాజు[విజయేంద్ర బహుద్దుర్[Venkatesh] నాగవల్లి] కి మద్య ఎం జరిగిందో తెలుసుకుని ఏ0 చేస్తాడన్నది మిగిలిన కధ


cinimavinodam.blogspot.com

"కందిరిగా" ఇప్పుడు హైదరబాద్ ఓల్డ్ సిటిలో


దేవదాసు రాం హీరొగా షూటింగ్ జరుపుకుంటున్న "కందిరిగా" ఇప్పుడు హైదరబాద్ ఓల్డ్ సిటిలో షూటింగ్ జరుకుంటోంది ఈ షూటింగ్ వాతవరణంలో ఓల్డ్ సిటి అంతా కలర్ఫుల్ గా మారింది బక్రిద్ సందర్బం గా రాం అక్కడి ముస్లిం సోదరులతో కలిసి బక్రిద్ జరుపుకున్నాడు దీని గురించి తన ట్విట్టర్ లో ఓల్డ్ సిటి షూటింగ్ సూపర్ ఎక్స్పిరియన్స్ అని. బిర్యాని, కుర్బాని యమ్మి గా ఉన్నాయని ట్విట్ చేశాడు.

ఈ సినిమా దర్శకుడు "తొలి పరిచం:సంతోష్ శ్రినివాస్


హిరోయిన్స్:హంసిక , స్వాతి

నెగిటివ్ రోల్:[విలన్]సోను సూద్



ఈ సినిమా కామెడి ఎంటర్ టైనర్ గా రాబోతుందని రాం చెబుతున్నాడు.....!




రాం తరవాత కొత్త హిరోయిన్ ప్రియ ఆనంద్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వం లో "రామ రామ క్రిష్ణ క్రిష్ణ"లో నటిస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు రాం కిది దిల్ రాజు తో రెండవ చిత్రం ఇంతకముందు హరేరామ హరేక్రిష్ణ తో హిట్ కొట్టిన ఇ పేర్ మళ్ళి తెరముందుకు రాబోతుంది

వరుణ్ సందేశ్ రాబోయే సినిమా "కుదిరితే కప్పు కాఫీ"ఈ సినిమా రిలీజ్ జనవరికి వాయిదా పడింది.


వరుణ్ సందేశ్ రాబోయే సినిమా "కుదిరితే కప్పు కాఫీ"ఈ సినిమా రిలీజ్ జనవరికి వాయిదా పడింది.మొదట ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నా డిసెంబర్ లో పెద్ద హీరోల చిత్రాలు ఉండటంతో నిర్మాతా జనవరిలో రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు. డిసెంబర్లో"వెంకటేష్ నాగవల్లి" "నాగర్జున రగడ" "రవి తేజ మిరపకాయ" ఉండటంతో నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా దర్శకుడు: "తొలి పరిచం అవుతున్న రామ శెల్వ ప్రొడ్యుసర్స్:మహి & శివ

జూనియర్ ఎన్టీఆర్, తమన్నా జంటగా భారీ చిత్రం ప్రారంభం


ఈ ఏడాది "అదుర్స్", "బృందావనం" వంటి సూపర్ హిట్ చిత్రాలతో సంచలనం సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కిక్ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో డార్లింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఛత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2, షూటింగ్ నవంబర్ 17 ఉదయం 9.30 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టగా, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ స్విచ్ ఆన్ చేయగా, దేవుని పటాలపై ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్‌కి సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో ఓ భారీ చిత్రం తీయాలన్న కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. ఎన్టీఆర్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ అయింది. డిసెంబరులో షూటింగ్ ప్రారంభించి జనవరి 8 నుండి ఏకధాటిగా షెడ్యూల్ చేస్తాం. మా బ్యానర్‌కి ఇది ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది అన్నారు.
దర్శకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... నవంబర్ 16కి తారక్ హీరో అయి పదేళ్లు పూర్తయింది. నవంబర్ 17న ఈ చిత్రంతో మరో దశాబ్దానికి నటుడిగా ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఇంతకుముందు ఎన్టీఆర్ చేసిన చిత్రాలన్నీ ఒక ఎత్తు ఈ చిత్రం మరో ఎత్తు. ఇందులో కొత్త ఎన్టీఆర్‌ను చూస్తారు.


Heroine:తమన్నా


characters:ఎన్టీఆర్, తమన్నా, కిక్ శ్యామ్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు
Story: వక్కంతం వంశీ,

Producer: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్,

screen-ply Direction: సురేందర్ రెడ్డి.

Raktacharitra సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా.


రక్త చరిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైయస్సార్ ను మించిన నాయకుడు దేశంలోనే లేడని వైయస్ జగన్ వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో వర్మ కామెంట్స్ వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైయస్సార్ ఎవరంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. రక్త చరిత్ర -2లో వైయస్ పాత్ర ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయనెవరంటూ వర్మ వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు తీవ్రంగా మండిపడ్డారు. వర్మకు చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య ఎవరో కూడా తెలిసి ఉండకపోవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప నాయకులు తెలియనప్పుడు వర్మతో ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు. రక్తచరిత్ర -1లో స్వర్గీయ ఎన్టీ రామారావు పాత్రపై తీవ్ర వివాదం చెలరేగింది. అదే సమయంలో రెండో భాగంలో ఎవరెవరి పాత్రలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు సంబంధించిన అంశాన్ని వర్మ ఎలా చూపిస్తాడనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు కుట్ర జరుగుతోందని, ఆయనకు భద్రత కల్పించాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో శాసనసభలో అడిగారు. దీనిపై తీవ్ర వివాదం కూడా చెలరేగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే పరిటాల రవి హత్య జరిగింది. మద్దెలచెర్వు సూరిని వైయస్సార్ ప్రోత్సహించారని, అందులో భాగంగానే పరిటాల రవి హత్య జరిగిందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల వైయస్సార్ పాత్ర ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుందనేది మీడియా ప్రతి రోజూ ఏదో రూపంలో స్పెక్యులేట్ చేస్తూ ఉన్నది. రక్తచరిత్ర-1లో శుభలేక సుధాకర్ పోషించిన పాత్ర ఎవరిదనేది కూడా ఆసక్తిగా మారింది. సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా అనేదానిపై కూడా చర్చ సాగుతూనే ఉన్నది. వైయస్సార్ కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర కూడా రక్తచరిత్ర-2లో ఉంటుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఊహాగానాల నేపథ్యంలో వర్మ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ వాయిదాపై కూడా పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొదటి భాగంలోని పాత్రల వల్ల వచ్చిన వివాదాలు రాకుండా చూసుకోవడానికి సినిమాను రీషూట్ చేస్తున్నారా, రీఎడిటింగ్ చేస్తున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదాల నుంచి బయటపడడానికి అది కల్పిత కథ అని వర్మ చెప్పుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఏమైనా, రక్తచరిత్ర -2 కూడా రాజకీయవర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తుందా అనేది వర్మ ఎంత కాలం సస్పెన్స్ గా ఉంచుతారనేది చూడాలి

హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు:jayasudha


సినిమా హీరోయిన్లు అంతా రాఘవేంద్రరావుకు డార్లింగ్ లేనని నటి, ఎంఎల్ఏ జయసుధ కితాబిచ్చింది. మంగళవారం రాత్రి ఓ ఆడియో కార్యక్రమానికి ఆమె హాజరైంది. వేదికపై రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. అయితే ఆయన మౌనమునిలా మాట్లాడలేదు.

"సెట్‌లో కూడా అలానే ఉంటారు. తీసే సన్నివేశం కెమెరామెన్‌తోపాటు నటీనటులకు చెపుతారు. ఆయనలో పట్టుదల, కసి ఉన్నా... వాటిని చిత్రానికే వాడుతారు. హీరోయిన్లకు ఆయనంటే ఒకరకమైన అభిప్రాయముంటుంది" అని చెప్పింది జయసుధ.

నాగవల్లి చిత్రం ఆడియో విడుదల Down load here


విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన నాగవల్లి చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాదులో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలుత మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు, నాగవల్లి పాటలు సూపర్ గా వచ్చాయన్నారు. మొత్తం ఐదుగురు హీరోయిన్లున్నారనీ, వారిలో చంద్రముఖి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పారు. అనంతరం దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ... ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. ఈ చిత్రంలో అన్ని రసాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఇంతకు ముందు చంద్రముఖిగా జ్యోతిక నటించిందనీ, ఇప్పుడు ఆ పాత్రలో మరో హీరోయిన్ కనిపించబోతుందన్నారు. వీరిలో ఎవరు బాగా నటించారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందనీ, దాని ప్రకారమే వాళ్లను చూపించామని చెప్పారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ... నాగవల్లికి ఇంకా ఏడు సీక్వెల్స్ వస్తాయని చెప్పారు. నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కొత్త వెంకీని చూస్తారని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ డి. రామానాయుడు, బ్రహ్మానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Download
Powered by web analytics software.