Free SMS And Earn Part Time Money







12/28/10

నో వన్ కిల్ జెస్సికా





అనువాద చిత్రాల హిట్లు ఫట్లు





గౌతం మంచి డైరెక్టర్



నేను లండన్ యువతిని కాను ఇక్కడమ్మయినే



ఆరెంజ్ తో నా క్రేజ్ తగ్గదు




క్రేజ్ తగ్గిన సినిమాలు తగ్గని హిరోయిన్




అవకాశన్ని వదులుకున్న అనుష్క




బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయం:sameera reddy




జూ ఎన్టీఆర్ మాజీ ప్రియురాలు, హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల పాట్నాలో గోర పరాభవం ఎదుర్కొన్నారు. భోజ్ పురి నటుడు రవికిషన్ తో కలిసి ఇటీవల సమీరా రెడ్డి ఒక బహిరంగ వేడుకలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారు. ఇంతలో అక్కడున్న జనం మధ్య తోపులాట జరగి, ఆ రగడ కాస్తా పెరగడంతో బీహార్ వాసులు తమ తడాకా చూపించారు. వెంటనే స్టేజీ మీదకు రాళ్ల వర్షం కురిపించి, అక్కడున్న ఫర్నీచర్ ను ద్వంసం చేశారు.

ఊహించని ఈ సంఘటనతో బిత్తరపోయిన సమీరా రెడ్డి వెంటనే కుర్చీ వెనుక నక్కి, రాళ్ల దెబ్బలు తగలకుండా తనని తాను కాపాడుకునేందుకు ఆ కుర్చీనే అడ్డు పెట్టుకుని వేదిక దిగింది. అక్కడ్నుంచి నిర్వాహకుల సాయంతో తన కారు వరకు క్షేమంగా చేరుకుని, పరిస్థితి చక్కబడే వరకు కారులోనే ఉండి, తర్వాత గమ్య స్థానానికి బయల్థేరింది. తన జీవితంలోనే ఈ సంఘటన మరచిపోలేనిదని, ఇకపై బహిరంగ వేడుకలకి వెళ్లాలంటేనే భయంగా ఉందని సమీరారెడ్డి అంటోంది.

సెక్స్ సినిమాలఅలాంటి మాటలన్నీ తనే మాట్లాడుతూ ఉంటానని మొదటిసారి ఇలా శృతి హాసన్ చెప్పేసరికే ఖంగుతిన్నానని యూనిట్ లోని సభ్యులతో చెప్పాడంట :ఇమ్రాన్ హాష్మి


పద్మశ్రీ డాక్టర్ కమల్ హాసన్ కూతురుగా అరంగేట్రం చేసినటువంటి శృతి హాసన్ నటించినటువంటి మొదటి సినిమాలో బికిని వేసుకోని తన అందాలను ఆరబోసింది. తెలుగులో ప్రస్తుతం చేస్తున్నటువంటి అనగనగా ఓ ధీరుడు సినిమాలోను శృతి హాసన్ తన నాభి అందాలను, నడుము ఒంపుసోంపులను బ్రహ్మండంగా ప్రదర్శిస్తుంది. ఈసినిమాతో పాటు హిందీలో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హాష్మితో దిల్ తో బచ్చా హై జీ అనే మరో సినిమాల నటిస్తుంది.

ఐతే ఈసినిమాలో శృతి హాసన్ ప్రదర్శించే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందంట. దీనికి కారణం అమ్మాయిలు మాట్లాడకూడని భాషలో మాట్లాడుతూ చెప్పకూడని సంగతులు కూడా బాయ్ ప్రెండ్ అయినటువంటి ఇమ్రాన్ హాష్మితో చెప్పెస్తూ ఉంటుందంట. ఈ చిత్రంలో ఒక సీన్ లో ఇమ్రాన్ హాష్మితో తాను సెక్స్ సినిమాలు చూస్తానని చెబుతుందని సమాచారం. ఈసీన్ వినగానే మన హీరో షాక్ తిని, సాదారణంగా నాసినిమాల్లో అలాంటి మాటలన్నీ తనే మాట్లాడుతూ ఉంటానని మొదటిసారి ఇలా శృతి హాసన్ చెప్పేసరికే ఖంగుతిన్నానని యూనిట్ లోని సభ్యులతో చెప్పాడంట. ఇలాంటి మాటలు మాట్లాడి కమల్ హాసన్ కుఎలాంటి పేరు తెస్తుందో కానీ, ఆయనకున్న పేరు మాత్రం పోగోట్టుకుండా ఉంటే చాలు అంటూ అభిమానులు నెత్తి నోరు భాదుకుంటున్నారు.

ఇంద్ర'సినిమాకి 'శక్తి'. చిత్రానికి కాస్తపోలిక


వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా,నలక నడుము గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న చిత్రం 'శక్తి'. ఈ చిత్రానికి గతంలో బి.గోపాల్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా నటించిన'ఇంద్ర'సినిమాకి పోస్టర్ లో కాస్తపోలిక కనిపిస్తుంది. దాంట్లో చిరంజీవి వెనక్కి వంగి ఆకాశంవైపు చూస్తూ రెండుచేతులూ విశాలంగా చాచి ఉంటాడు.

'శక్తి'పోస్టర్ ని మీరు గనక గమనిస్తే యన్ టి ఆర్ కూడా అలాగే వెనక్కి వంగి చేతులు చాచి ఆకాశం వైపే చూస్తూంటాడు. ఈ పోలిక కథా పరంగా ఎంత ఉంటుందో కానీ, ఒక్క పోస్టర్ పరంగానే ఉంది. రికార్డులన్నీ బద్దలు కొడుతుందని ఈ చిత్రం మీద యంగ్ టైగర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.ఈ సినిమా క్రికెట్ ప్రపంచ కప్ ముగిశాక మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఈ చిత్రాల్లో ఏది హిట్టవుతుంది, ఎవరు సంక్రాతి హీరో అవుతారన్నది చూడాలి.



2011 సంక్రాంతికి విడుదల అవుతున్న చిత్రాల్లో ముఖ్యమైనవి...బాలకృష్ణ ‘పరమవీర చక్ర’, రవితేజ ‘మిరపకాయ్’, రామ్ ‌గోపాల వర్మ, సునీల్ కాంబినేషన్‌ లో వస్తున్న ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు’, రానా ‘నేను నారాక్షసి’, గోపీచంద్ ‘వాంటెడ్’, వాల్ట్‌ డిస్నీ తొలిసారిగా తెలుగులో సమర్పిస్తున్న ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు రానున్నాయి. వీటిల్లో దాసరి, బాలకృష్ణ కాంబినేషన్ లో రెడీ అవుతున్న ‘పరమవీర చక్ర’ చిత్రం అంతటా మంచి క్రేజ్ తెచ్చుకుని మంచి మార్కెట్ అవుతోంది. సింహా వంటి ఘన విజయం సాధించిన చిత్రం అనంతరం విడుదల అవుతున్న చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది.

ఇక రవితేజ..డాన్ శీను తర్వాత విడుదల అవుతున్న ‘మిరపకాయ్’ పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఉండనుంది. గతంలో రవితేజకు షాక్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినీ పరిశ్రమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న కామిడీ చిత్రం ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు’ ఇప్పటికే అన్ని వర్గాల్లో మంచి ఆసక్తిని రేపింది. ఆ తర్వాత ‘నేను నా రాక్షసి’, గోపీచంద్ ‘వాంటెడ్’ చిత్రాలు మాస్ కి బాగా పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక పిల్లా, పెద్ద తేడా లేకుండా అందరనీ ఒకే ఒక్క ప్రోమోతో ఆకట్టుకున్న ‘అనగనగా ఓ ధీరుడు’ కి మార్కెట్ లో మంచి అంఛనాలే ఉన్నాయి. ఈ చిత్రాల్లో ఏది హిట్టవుతుంది, ఎవరు సంక్రాతి హీరో అవుతారన్నది చూడాలి.

ట్రాన్స్ పోర్టర్ ఫోర్ 2010 కి సూపర్ హిట్ కానుంది :వి.సురేష్



నాతో ఐష్ కి పోలికా:స్నేహ ఉల్లాల్ స్నెహలో ఉన్న చరిష్మ ఐష్ కేది: సల్మాన్



నిర్మాతలకు మ్యాగ్జిమం కోపరేషన్ ఇస్తాను :కాజల్



దబాంగ్ --త్రీ ఇడియట్స్ ను దాటేనా???



మళ్ళీ కలిశారు షాహిద్ ప్రియాంకా



నా పాత్ర నేను చూడను నిడివి చూడను :ప్రియమణి




Powered by web analytics software.