12/26/10
అనాధనే కానీ అమాయకుడ్ని కాను...నా పేరు
వెన్నెల, ప్రస్తానం చిత్రాల దర్శకుడు దేవకట్టా తన తదుపరి చిత్రం ఆటోనగర్ సూర్య ని రూపొందించటానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం డైలాగ్ టీజర్ ని నెట్ లో విడుదల చేసారు. అందులో ... " చూడు బాబాయ్...కొట్టుకు చావటానికి మన మధ్య ప్యాక్షన్ గొడవలు లేవు...భూమి మీద పుట్టిన ప్రతీ మనిషికీ ఒక హక్కుంది. ఎదగడం..తెలిసిన పనిచేసుకుంటూ కెపాసిటీకి తగ్గట్లు ఎదగడం..కానీ ఆ హక్కుని కబ్జా చేసి ఎదగడమే నీ లాంటి లోఫర్లు హక్కు అనుకుంటారు. హిస్టరీలో జరిగిన ప్రతీ పోరాటానికి, విప్లవానికి, యుద్దానికి ఇదే కారణం.
అవును నేను అనాధనే కానీ అమాయకుడ్ని కాను...నా పేరు సూర్య...ఆటోనగర్ సూర్య. బాంచెత్ ...నేను ముట్టుకుంటే రిపేర్ చేయలేని వస్తువు లేదు.." అంటూ ఈ టీజర్ బేస్ వాయిస్ తో సాగుతుంది. ఇక ఈ చిత్రం గురించి చెబుతూ...ఎవరూ లేని ఓ వ్యక్తి అందరివాడుగా మారటమే అంటున్నారు. అలాగే ఈ చిత్రం ట్రేడ్ యూనియన్స్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తయి...నటీనటులు, సాంకేతిక గణం ఎంపిక జరుగుతోంది అన్నారు. బెస్టాఫ్ లక్ దేవకట్టా.
అటువంటి చిత్రాన్ని వెంకటేష్ టేకప్ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగుసలు
మనిషికి భయమనేది ఈ బాడీని గురించే.. ఇది ఏమయిపోతుందోనని దాన్ని మనసులో ఎక్కించుకుంటే నిజంగా భయపడిపోతాడు. మైండ్‌ను చాలా కూల్‌గా ఉంచుకోవాలి. ఈ బాడీకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇదంతా ఓ డ్రామాగా తీసుకోవాలి... అంటూ విక్టరీ వెంకటేష్ సూక్తులు వల్లించారు. 'నాగవల్లి' చిత్రం చేశాక... వెంకటేష్‌కు ఏదో అవుతుందనే నెగెటివ్‌టాక్ ఇండస్ట్రీలో వచ్చింది. కన్నడలో ఆప్తరక్షక చేశాక విష్ణువర్ధన్ కాలధర్మం చెందారు. దాంతో ఈ చిత్రాన్ని రజనీ చేసేందుకు వెనుకంజ వేసినట్టు ప్రచారం జరిగింది.
అటువంటి చిత్రాన్ని వెంకటేష్ టేకప్ చేశాడంటే ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఇవన్నీ తనదాకా వచ్చాయని విక్టరీ వెంకటేష్ తన మనసులోని మాటను శనివారం ఆవిష్కరించారు. సినిమా విడుదలయ్యాక మహారాష్ట్ర వెళ్ళి వచ్చారు. అక్కడ ఆత్యాధ్మికలోకంలో గడిపాననీ, మళ్ళీ త్వరలో వెళ్ళనున్నానని చెప్పారు. రజనీకాంత్ కూడా అలా వెళతారు. మీకు కలుస్తారా? అని అడిగితే... మేం కాంటాక్ట్‌లో ఉంటామని బదులిచ్చారు.
రజనీకాంత్‌గారు ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారంటూ... ఏదైనా జీవితంలో కొత్త ప్రయోగం చేయాలి. లేదంటే మనకు గుర్తింపు ఉండదని వెంకీ సెలవిచ్చారు. రాజు గెటప్‌కు 4 గంటలు మేకప్ వేసుకున్నాను. ఆ కాస్ట్యూమ్స్ వేసుకొన్నాక ప్రకృతి కార్యాలను అణచుకొన్నాను. యూరిన్‌కు కూడా వెళ్ళడానికి వీలులేని విధంగా కష్టపడాల్సివచ్చిందని అన్నారు
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |