Free SMS And Earn Part Time Money







7/7/09

మగధీర స్టొరీ లైన్ అంటూ ఓ కథ ప్రచారం లోకి వచ్చింది




మగధీర స్టొరీ లైన్ అంటూ ఓ కథ ప్రచారం లోకి వచ్చింది. వారు చెప్పే దాని ప్రకారం కాలభైరవ గా రామ్ చరణ్ కనపడతారు. అతని ప్రేయసి ఓ రాకుమార్తె. ఐతే కాలభైరవను ఎలాగైనా అంతం చేసి అతని ప్రేమను భగ్నం చేసేందుకు అంతఃపురంలోనే కుట్రలు జరుగుతుంటాయి. కాలభైరవ సవతి సోదరుడే (శ్రీహరి) ఇందుకు సూత్రధారి. ఆ కుట్రకు గురై తమ ప్రేమను పండించుకోలేక పోయిన కాలభైరవ, అతని ప్రియురాలు మరో జన్మ ఎత్తుతారు. కాలభైరవ ఒక స్టంట్ మన్ గా, ప్రిన్స్ ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ తిరిగి కలుస్తారు. ఆ కాలంలో ఈ ఇద్దరి ప్రేమ జంటను విడిదీసిన సవతి సోదరుడే ఈ జన్మలో వారిద్దరినీ కలుపుతాడు. కాలభైరవగా-స్టంట్ మన్ గా రామ్ చరణ్, ప్రిన్స్ గా-ఫ్యాషన్ డిజైనర్ గా కాజల్, ఆ ఇద్దర్నీ విడదీసి మళ్లీ కలిపే పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసాడు. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదే.అలాగే చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని "బంగారు కోడి పెట్ట" పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసారు. అంతేగాక "చిరంజీవి" సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ హార్స్ రైడింగ్ ,కాజల్ యాక్షన్,స్రీహరి నటన హైలెట్ సూపర్ హైలెట్ చిరంజీవి బంగారు కోడి పెట్ట లో ఒక స్టెప్ వేయడం ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.

ప్రభుదేవ-లారెన్స్ పోటాపోటీ"డ్యాన్స్ లో కాదుమరి"



కొరియాగ్రాఫర్లుగా ఇద్దరూ స్వయంప్రతిభను చాటుకున్నవారు. అగ్రహీరోలందరికీ నృత్యరీతులు సమకూర్చిన వారు. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ తమ కెరీర్ ను ఒకే రూట్ లో కొనసాగిస్తూ వచ్చారు. వీరిలో ఒకరు ప్రభుదేవా అయితే, మరొకరు లారెన్స్. ప్రభుదేవా నటుడిగా మారి కొన్ని హిట్లు కూడా సొంతం చేసుకుంటే, లారెన్స్ సైతం ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి 'స్టైల్' చిత్రంలో నటించారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో ప్రభుదేవా తొలిసారి దర్శకుడిగా మారితే, నాగార్జున 'మాస్' చిత్రంతో లారెన్స్ దర్శకపగ్గాలు చేపట్టారు. అనూహ్యంగా ఇదే ఏడాది ప్రభుదేవా, లారెన్స్ లు సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా కూడా మారపోబోతున్నారు. నిర్మాతలుగా ఈ ఇద్దరి తొలి చిత్రాలు తెలుగులోనే ప్లానింగ్ జరుగుతుండటం విశేషం. ప్రభుదేవా తొలిసారి దర్శకత్వం వహించిన హీరో సిద్దార్ధనే తన నిర్మాణ సంస్థ తొలి హీరోగా కూడా ఎంచుకున్నారు. సిద్దార్ధ సైతం ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో తాను పనిచేసిన దర్శకులందరిలోనూ ప్రభుదేవాకే ఎక్కువ మార్కులు కట్టబెట్టి ఆయనపై తనకున్న అభిమానం కూడా చాటుకున్నాడు. ప్రస్తుతం హిందీలో సల్మాన్ తో 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా ఈ ఏడాది చివర్లోనే సిద్దార్ధతో తన సొంత బ్యానర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నారు. లారెన్స్ సైతం ఇప్పుడు తమిళంలో నటుడుగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాణ సంస్థ ఏర్పాటు కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి తననెంతో అభిమానించే యువసామ్రాట్ నాగార్జునతోనే తన సొంత బ్యానర్ తొలి చిత్రం తీయాలనే పట్టుదలతో లారెన్స్ ఉన్నారు. నాగార్జునను ఒప్పించే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అదే జరిగితే నాగార్జున ప్రస్తుతం కమిట్ అయిన కామాక్షి కళా మూవీస్ చిత్రం తర్వాత లారెన్స్ చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రానికి షరామామూలుగా లారెన్స్ దర్శకత్వం వహిస్తారు.


ఏ సినిమా లోను చూడని సెట్ "అల్లు అర్జున్"


అల్లు అర్జున్ కథానాయకుడిగా గుణశేఖర్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతోంది. ఇంతవరకు ఏ సినిమా లోను చూడని సెట్ ఈ సినిమాలో చూడబోతున్నారు. ఆదివారం నుంచి ఈ నెలాఖరు వరకు దాదాపు 25 రోజులు ఈ షెడ్యూల్‌ సాగుతుంది. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుంది.ఈ సంస్తలో దేశముదురు తర్వాత ఈ సంస్థలో బన్ని నటిస్తున్న చిత్రమిది. గుణశేఖర్‌, బన్ని కలిసి చేస్తున్న తొలి చిత్రం. అత్యున్నత సాంకేతిక విలువలను పాటిస్తూ రూపొందిస్తున్నారు.మగదీర,ఓయె,ఎవరైన ఎపుడైన వంటి మంచి సినిమాలను తట్టుకుని అందరి అంచనాలకు చేరువవుతుందా చిత్ర విశేషాలు: ఈ చిత్రం ద్వారా కథానాయికగా నూతన నటి పరిచయమవుతోంది. తమిళ నటుడు ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. సుహాసిని, నరేష్‌, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్‌ ప్రసాద్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మణిశర్మ, కెమెరా: ఆర్‌.డి.రాజశేఖర్‌, ఫైట్స్‌: స్టన్‌శివ, కళ: అశోక్‌, కూర్పు: ఆంథోని.



Powered by web analytics software.