Free SMS And Earn Part Time Money







7/7/09

ప్రభుదేవ-లారెన్స్ పోటాపోటీ"డ్యాన్స్ లో కాదుమరి"



కొరియాగ్రాఫర్లుగా ఇద్దరూ స్వయంప్రతిభను చాటుకున్నవారు. అగ్రహీరోలందరికీ నృత్యరీతులు సమకూర్చిన వారు. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ తమ కెరీర్ ను ఒకే రూట్ లో కొనసాగిస్తూ వచ్చారు. వీరిలో ఒకరు ప్రభుదేవా అయితే, మరొకరు లారెన్స్. ప్రభుదేవా నటుడిగా మారి కొన్ని హిట్లు కూడా సొంతం చేసుకుంటే, లారెన్స్ సైతం ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఇద్దరూ కలిసి 'స్టైల్' చిత్రంలో నటించారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో ప్రభుదేవా తొలిసారి దర్శకుడిగా మారితే, నాగార్జున 'మాస్' చిత్రంతో లారెన్స్ దర్శకపగ్గాలు చేపట్టారు. అనూహ్యంగా ఇదే ఏడాది ప్రభుదేవా, లారెన్స్ లు సొంత నిర్మాణ సంస్థలు స్థాపించి నిర్మాతలుగా కూడా మారపోబోతున్నారు. నిర్మాతలుగా ఈ ఇద్దరి తొలి చిత్రాలు తెలుగులోనే ప్లానింగ్ జరుగుతుండటం విశేషం. ప్రభుదేవా తొలిసారి దర్శకత్వం వహించిన హీరో సిద్దార్ధనే తన నిర్మాణ సంస్థ తొలి హీరోగా కూడా ఎంచుకున్నారు. సిద్దార్ధ సైతం ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్ లో తాను పనిచేసిన దర్శకులందరిలోనూ ప్రభుదేవాకే ఎక్కువ మార్కులు కట్టబెట్టి ఆయనపై తనకున్న అభిమానం కూడా చాటుకున్నాడు. ప్రస్తుతం హిందీలో సల్మాన్ తో 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా ఈ ఏడాది చివర్లోనే సిద్దార్ధతో తన సొంత బ్యానర్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్నారు. లారెన్స్ సైతం ఇప్పుడు తమిళంలో నటుడుగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాణ సంస్థ ఏర్పాటు కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి తననెంతో అభిమానించే యువసామ్రాట్ నాగార్జునతోనే తన సొంత బ్యానర్ తొలి చిత్రం తీయాలనే పట్టుదలతో లారెన్స్ ఉన్నారు. నాగార్జునను ఒప్పించే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అదే జరిగితే నాగార్జున ప్రస్తుతం కమిట్ అయిన కామాక్షి కళా మూవీస్ చిత్రం తర్వాత లారెన్స్ చిత్రం మొదలవుతుంది. ఈ చిత్రానికి షరామామూలుగా లారెన్స్ దర్శకత్వం వహిస్తారు.


Powered by web analytics software.