Free SMS And Earn Part Time Money







12/15/10

నూతన అగ్రిమెంట్లు చేయగలమని ఛాంబర్‌ చెప్పిన తర్వాతే పోస్టుప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలియజేసింది.


విడుదలకు దగ్గరయ్యే చిత్రాలకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుపుకోవచ్చని మంగళవారంనాడు ప్రొడ్యూసర్స్‌కు ఫిలింఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తెలియజేసింది. కానీ, తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కానీ, సినిమా షూటింగ్‌లకు కానీ హాజరుకాబోమని ఏపీ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కోటగిరి వెంకటేశ్వరరావు, కె. రాజేశ్వర్‌రెడ్డి ఇతర యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులకు తమ విధానాలను వివరించారు. 10వ తేదీన ఫెడరేషన్‌ జనరల్‌ బాడీ నిర్ణయం ప్రకారం చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని తీర్మానం చేయడం జరిగింది. చర్చలకు పిలవాల్సిందిగా ఫిలిం ఛాంబర్‌ను రెండుసార్లు లెటర్లు పంపించాం. దానికి నేటివరకు ఏవిధమైన స్పందన రాలేదు.

కానీ పోస్టుప్రొడక్షన్స్‌ వర్క్స్‌ చేసుకోవచ్చని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఇచ్చిన వార్తకు మన సభ్యులెవరూ స్పందించవలసిన అవసరంలేదు. గత రెండేళ్ళుగా నిలిపి వేయబడిన వేతనాల అగ్రిమెంట్లు, 28.2.2010తో కాలపరిమితి ముగిసిన అగ్రిమెంట్లును బదులు నూతన అగ్రిమెంట్లు చేయగలమని ఛాంబర్‌ చెప్పిన తర్వాతే పోస్టుప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయని.. తెలియజేసింది.

తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది.




తెలుగును ముద్దుముద్దుగా మాట్లాడే రంభ కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం రంభ గర్భవతి. అందుకని గత కొంతకాలంగా చెన్నైలో తల్లితోపాటు ఉంటోంది.

అయితే లండన్‌లో ప్రసవిస్తే పుట్టిన అమ్మాయో.. అబ్బాయికి అక్కడ సిటిజన్‌‌షిప్‌ వస్తుందని భావించి అక్కడికివెళ్ళాలని నిర్ణయించుకున్నదట.

తొమ్మిదో నెల వచ్చాక ఫ్లైట్‌ ఎక్కడానికి అనుమతించరు కాబట్టి ఇటీవలే అక్కడికి వెళ్ళిపోయింది. తల్లయిన తర్వాత మళ్ళీ సినిమారంగంలోకి రావాలని కలలుకంటోంది. భర్త ప్రోత్సాహంతో నిర్మాణసంస్థను స్థాపించాలని కూడా ప్లాన్‌ చేస్తోందని తెలిసింది.
Powered by web analytics software.