ఝుమ్మంది నాదం చిత్రంతో పరిచయమైన తాప్సీ కి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సూర్య సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం. కేవీ.ఆనంద్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం టైటిల్ మాట్రాన్. మాట్రాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య ఐదు గెటప్‌లలో కని పించనున్నారని సమాచారం. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి విభిన్న కథాం శంతో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు కేవీ.ఆనంద్ పేర్కొన్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆడుగళం లో నటించి అందరి ప్రశంసలు పొందిన తాప్సీ ఇందులో మంచి పాత్ర కొట్టేశారని తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతోంది. రెండో సినిమాకే సూర్య వంటి స్టార్ సరసన ఆఫర్ రావటంతో అంతటా ఆమెకు లక్కు తిరిగినట్లే అంటున్నారు. ప్రస్తుతం సూర్య..గజనీ దర్శకుడు...ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 7 ఆమ్ అరివు చిత్రంలో నటిస్తున్నారు.
3/6/11
తెలంగాణ వాసులుగా టాలీవుడ్ హిరోలు
పవన్ కళ్యాణ్ రాబోయో చిత్రం తీన్ మార్ లో తెలంగాణాకు చెందిన కాలేజి స్టూడెంట్ గా కనిపించనున్నారనేది ఆసక్తికరమైన విషయం. గతంలో తెలుగు సినిమాల్లో నెగిటివ్ పాత్రలకు మాత్రమే తెలంగాణా మాండలికాన్ని ఉపయోగించేవారు. అయితే తాజాగా తెలుగు సినిమా పరిస్ధితిని గమనిస్తే తెలంగాణా ఉద్యమ ప్రభావం తెలుగు సినిమాని ఎంతగా ప్రభావం చేసిందో గమనించవచ్చు.రీసెంట్ గా రిలీజైన సినిమాల్లో హీరోలను తెలంగాణా ప్రాంతానికి చెందిన వారిగా చూపించటం, వారిచేత తెలంగాణ యాసలో మాట్లాడించటం జరిగింది. బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందిన ‘పరమవీర చక్ర’లో హీరో బాలకృష్ణతో ‘కొమరం భీమ్’ పాత్ర వేయించి ఓ పాటను చిత్రీకరించటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రం ‘కొమరం పులి’ లో హీరోను తెలంగాణావాసిగా చూపించారు. ఇక అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’ చిత్రం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అందులో నాగార్జున పాత్ర తెలంగావాది కావడం గమనించతగ్గది. అలాగే, ఆమధ్య విడుదలైన వరుణ్ సందేశ్ ‘ఏమైంది ఈవేళ’ చిత్రంలో హీరోను వరంగల్‌వాసిగా చూపించారు. అలాగే సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘ప్రేమకావాలి’ చిత్రంలో హీరో స్వస్థలం ఖమ్మంగా చూపించడం జరిగింది. వీటితో పాటు మొన్న బుధవారం విడుదలైన ‘అహనా పెళ్లంట’ చిత్రంలోనూ హీరోయిన్ వరంగల్‌కు చెందిన అమ్మాయిగా చూపించారు. అంతేకాదు.. హీరోయిన్స్ సోదరులు శ్రీహరి, సుబ్బరాజు, హీరోయిన్ తండ్రి నాగినీడు తదితరులంతా తెలంగాణా మాండలికంలోనే మాట్లాడుతూ ఉంటారు.ఇలా తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా తెలంగాణాకు, ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే అక్కడ సంస్కృతి,సంప్రదాయాలను కూడా గుర్తించి,గౌరవించి వాటిని సైతం సినిమాల్లో పెడితే మన తెలుగు సినిమాలు మరింత జీవంతో ఉట్టి పడతాయి.ఈ మార్పుకు కారణం ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా తెలంగాణా ఉద్యమమేనన్నది అందరి వాదన
సలోని లక్ష్మీ రాయ్ ల తో త్రిపాత్రభినయం:బాలకృష్ణ
సునీల్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'మర్యాద రామన్న' చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టన భామ సలోని. అయితే ఆ చిత్రం తర్వాత ఆమెకు చెప్పుకోతగ్గ ఆఫర్స్ రాలేదు. తెలుగుఅమ్మాయి అనే చిత్రంలో చేస్తున్న ఈమె తాజాగా బాలకృష్ణ చిత్రంలో ఒక హీరోయిన్ గా బుక్కయ్యింది. శ్రీకీర్తి కంబైన్స్ సంస్థ పతాకంపై ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒక హీరోయిన్ ఇప్పటికే లక్ష్మీరాయ్ ఎంపికైంది. మరో హీరోయిన్ గా సలోనిని ఎంపికచేసారు. ఈ విషయంపై తన ఆనందాన్నివ్యక్తం చేస్తూ "బాలకృష్ణతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి దొరికింది. మాస్ మసాలా పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు చేయని ఒక వైవిధ్యమైన పాత్ర ఈ సినిమాతో దక్కడం ఆనందంగా ఉంది. ఈ నెల 11 నుంచి షూటింగ్ లో పాల్గొంటానని చెప్తోంది. ఈ చిత్రంలో జయసుధ, నదియా, ప్రదీప్‌రావత్, ఆదిత్య మీనన్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సమర్పణ: సందీప్, సంగీతం: కల్యాణిమాలిక్.
జోష్ చిత్రం నాగచైతన్య లాంచ్ కోసమే తీశారు అంటున్న కార్తికా
"అదేంటో కెమెరా ముందు తొలిసారి నిలబడినప్పుడు కూడా నాకు కొత్తగా అనిపించలేదు. నటన అమ్మ జీన్స్‌లోనే ఉంది కదా. ఆ ప్రభావమేనేమో అంటోంది రాధ కూతురు కార్తీక. నాగచైతన్య సరసన 'జోష్'తో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తలుగులో ఆఫర్స్ లేకున్నా తమిళ,మళయాళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. అలాగే.. షూటింగ్ ఎలాంటి లొకేషన్లలో ఉన్నా చాలా కంఫర్టబుల్‌గానే చేస్తాను. అలాగే సినిమాలకు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా నాకు ఎక్కువే. అమ్మ కన్నా ఆంటీ అంబిక నటనంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ నా కాస్టూమ్స్ సెలక్షన్ మొత్తం ఆంటీదే అంది. ఇక జోష్ చిత్రం ప్లాప్ గురించి మాట్లాడుతూ..నాకు తెలుసు జోష్ చిత్రం నాగార్జున కుమారుడు చైతన్య ను లాంచ్ చేయటానికి అని...అందుకే అతని మీదే పూర్తి స్ధాయి ఫోకస్ పెట్టారు. అయితే రిజల్టు ఏ విధంగా వచ్చిందన్న దాని గురించి నేను మాట్లాడను. నేను ఏదైతే తెరమీద చేసానో దానని ఇప్పటికీ ఇష్టపడుతున్నాను..నేను దాని గురించి అస్సలు భాధపడటం లేదు అని తెల్చేసింది. ప్రస్తుతం ఆమె సంతోష్ శివన్ సరసన ఓ మళయాళ చిత్రంలో చేస్తోంది.
రాం సరసన హంసిక
‘‘చక్రి చాలా బిజీగా ఉన్నారు. అందుకని ఆయన స్థానంలో ‘తాజా సెన్సేషన్’ తమన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకున్నాం అంటున్నారు హీరో రామ్. ఆయన తన తాజా చిత్రం ‘కందిరీగ’ కు సంగీత దర్శకుడుగా తమన్ ని పట్టుబట్టి మరీ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ముందుగా చక్రిని సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు.‘దేవదాసు, మస్కా’ చిత్రాల తర్వాత రామ్ కాంబినేషన్‌లో చక్రి చేస్తున్న సినిమాగా మొదట ప్రకటించారు. అయితే ఇప్పుడు చక్రి స్థానంలో తమన్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవటంతో ఆ విషయం గురించి రామ్ తన ట్విట్టర్‌లో ఇలా వివరణ ఇచ్చారు. వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేమ రక్షిత్ నృత్య దర్శకత్వంలో నిన్నటి(ఆదివారం) నుంచి ఒక పాటని షూట్ చేస్తున్నారు. అలాగే ఈ పాటకి సంబంధించిన ట్యూన్ ముందుగా రెడీ అవ్వకపోవడంవల్ల స్టెప్స్ ప్రాక్టీస్ చేయలేదు. డెరైక్ట్‌గా లొకేషన్‌లోనే నేర్చుకుని స్టెప్స్ వేయబోతున్నాం అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ సరసన హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.
బాలీవుడ్ లో బికినీకి రెడి అంటున్న ఇద్దరు టాలీవుడ్ టాప్ హిరోయిన్స్
కాజల్ ..బికినీలో కనిపించనుంది తెలుసా అనేదే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళూ హోమ్లీ లుక్ తో కనిపించిన ఈ ముద్దుగుమ్మ హఠాత్తుగా రూట్ మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందీ అంటే...బాలీవుడ్ ఎంట్రీ అని చెప్తున్నారు. అక్కడ పోటీ తట్టుకోవాలంటే కొన్ని చమక్కులు చెయ్యాల్సిందే అని విశ్లేషిస్తున్నారు.ఇంతకీ ఆమె బికినీ వేస్తుంది తెలుగు సినిమాల్లో కాదు - బాలీవుడ్‌లో. తమిళంలో విజయవంతమైన ‘సింగం’ (తెలుగు యముడు) చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. దానిలో హీరోయిన్‌గా కాజల్ నటిస్తోంది.
పనిలో పనిగా బాలీవుడ్ అవకాశాలను మరికొన్ని వొడిసిపట్టాలనే కోరికతో తొలి చిత్రంలోనే బికినీకి ‘సై’ అంటూ అక్కడ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో తమిళ, మలయాళ, తెలుగు నిర్మాతలు అవాక్కయ్యారు. ఇన్నాళ్లూ లేంది ఇప్పుడు ఇదేమిటి కొత్తగా ఉంది అని చర్చిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రెమ్యునరేషన్ తీసుకుంటున్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు నేను సైతం బికినీకి రెడీ అని అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ కాజల్ ని బికినీలో చూడగలమా అనేది మరికొందరిలో మెదిలిన ప్రశ్న.
ఇన్నాళ్ళూ తన అందాల ప్రదర్శనకు లిమిటేషన్స్ పెట్టుకుని బికినీకు దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు బికినీ వెయ్యటానకి రెడీ అంటోంది. అంతేగాక. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా రెడీ అని చెప్తోంది. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటీ అంటే...కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. పాత్ర కోసం నేను ఎంతటి ఎడ్వంచర్ అయినా చేస్తానని చాలా సార్లు చెప్పాను. బికినీ వెయ్యటం కూడా ధైర్యంతో తీసుకున్న నిర్ణయంగా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అయితే బికినీ వెయ్యాలంటే నాకు ఆ కథ నచ్చాలి. ఆ కథ..బికినీని డిమాండ్ చెయ్యాలి కథ నచ్చి , సీన్ కి అది కరెక్ట్ అనిపిస్తే టూపీస్ బికినీకి నేను రెడీ అంది. రామ్ చరణ్ సరసన ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం తర్వాత నిర్మాత నాగబాబు డైరక్ట్ గా ఆమె తనను ఇబ్బందిపెట్టిందని స్టేట్మెంట్ ఇవ్వటంతో తెలుగులో ఆ తర్వాత ఒక్క ఆఫరూ రాలేదు. హిందీలోనే సినిమాలు చేస్తున్న జెనిలియా ఇలా బికినీకి, లిప్ లాక్ కిస్ కి రెడి అంటూ నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బికినీ ఆఫర్ ని ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు కనపడటం లేదు. ఎందుకంటే జెనీలియా బికినీ వేస్తే ఎవరు చూస్తారు. ఆమె నిండుగా బట్టల్లోనే క్యూట్ గా ఉంటుంది అంటున్నారు. అదీ నిజమేనేమో..

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కారాలు మిరియాలు
పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రూపొందించిన చిత్రం 'కారాలు మిరియాలు'. బ్లూరే ప్రొడక్షన్స్ పతాకంపై పసుపులేటి వెంకటరామారావు దర్శక నిర్మాతగా చేశారు. ఇదొక ప్రేమకథ. భార్యభర్తలమధ్య ఉండే సున్నితమైన కొట్లాటలు, మనస్పర్థలు, మధ్యలో భామ పాత్ర ఇవన్నీ ఒకవైపు హాస్యాన్ని, మరోవైపు హృదయాన్ని టచ్‌చేసే సన్నివేశాలతో తీశామని దర్శక నిర్మాత చెప్పారు. ఈ చిత్రం ఆడియోను హైదరాబాద్‌లో విడుదలచేశారు. రామానాయుడు, ఐమాక్స్ అధినేత రమేష్‌ప్రసాద్ ఆడియోను విడుదలచేశారు.
రమేష్‌ప్రసాద్ మాట్లాడుతూ, ఈనాటి ట్రెండ్ చాలా ఉత్సాహంతో సినిమారంగంలోకి వస్తున్నారు. సాప్ట్‌వేర్‌రంగంలో వచ్చి సక్సెస్ అయినవారు చాలమంది ఉన్నారు. అప్పట్లో ఆనంద్‌తో శేఖర్‌కమ్ముల కొత్త ఫార్మెట్‌తో వచ్చారు. ఈ చిత్ర పాటలువింటుంటే దర్శకుడు మంచి భవిష్యత్ ఉందనిపిస్తుంది అన్నారు.
రామానాయుడు మాట్లాడుతూ... విదేశాల్లో తీసినా తెలుగు టైటిల్ చక్కగా పెట్టారు. కథ బాగుంటేనే అందరూ చూస్తారు. మంచి కథను ఎన్నుకునే విదేశాల్లో సినిమా తీసి ఉంటారనిపిస్తుంది అన్నారు.
హీరో నవకేష్ మాట్లాడుతూ, నాపేరు రేడియోజాకీగా నారాయణగా తెలుసు. ఈ సినిమాకు నవకేష్‌గా మార్చుకున్నాను. చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమాను చేశాం. బామ్మ పాత్ర చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు.
చక్రి మాట్లాడుతూ, ఈ చిత్రానికి పనిచేసిన ఇద్దరు మ్యూజిక్‌డైరెక్టర్లు కృష్ణమూర్తి, విద్యాధరణి నా దగ్గరకు వచ్చి ఆహ్వానించారు. వారి పాటలు బాగున్నాయి. జంట దర్శకులుగా పేరు తెచ్చుకుంటారని అన్నారు. దర్శక నిర్మాత మాట్లాడుతూ, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామన్నారు.

Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |