Free SMS And Earn Part Time Money







3/6/11

తెలంగాణ వాసులుగా టాలీవుడ్ హిరోలు


పవన్ కళ్యాణ్ రాబోయో చిత్రం తీన్ మార్ లో తెలంగాణాకు చెందిన కాలేజి స్టూడెంట్ గా కనిపించనున్నారనేది ఆసక్తికరమైన విషయం. గతంలో తెలుగు సినిమాల్లో నెగిటివ్ పాత్రలకు మాత్రమే తెలంగాణా మాండలికాన్ని ఉపయోగించేవారు. అయితే తాజాగా తెలుగు సినిమా పరిస్ధితిని గమనిస్తే తెలంగాణా ఉద్యమ ప్రభావం తెలుగు సినిమాని ఎంతగా ప్రభావం చేసిందో గమనించవచ్చు.రీసెంట్ గా రిలీజైన సినిమాల్లో హీరోలను తెలంగాణా ప్రాంతానికి చెందిన వారిగా చూపించటం, వారిచేత తెలంగాణ యాసలో మాట్లాడించటం జరిగింది. బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో రూపొందిన ‘పరమవీర చక్ర’లో హీరో బాలకృష్ణతో ‘కొమరం భీమ్‌’ పాత్ర వేయించి ఓ పాటను చిత్రీకరించటం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రం ‘కొమరం పులి’ లో హీరోను తెలంగాణావాసిగా చూపించారు. ఇక అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘రాజన్న’ చిత్రం తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. అందులో నాగార్జున పాత్ర తెలంగావాది కావడం గమనించతగ్గది. అలాగే, ఆమధ్య విడుదలైన వరుణ్ సందేశ్ ‘ఏమైంది ఈవేళ’ చిత్రంలో హీరోను వరంగల్‌వాసిగా చూపించారు. అలాగే సాయికుమార్ కుమారుడు ఆదిని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిన ‘ప్రేమకావాలి’ చిత్రంలో హీరో స్వస్థలం ఖమ్మంగా చూపించడం జరిగింది. వీటితో పాటు మొన్న బుధవారం విడుదలైన ‘అహనా పెళ్లంట’ చిత్రంలోనూ హీరోయిన్‌ వరంగల్‌కు చెందిన అమ్మాయిగా చూపించారు. అంతేకాదు.. హీరోయిన్స్‌ సోదరులు శ్రీహరి, సుబ్బరాజు, హీరోయిన్‌ తండ్రి నాగినీడు తదితరులంతా తెలంగాణా మాండలికంలోనే మాట్లాడుతూ ఉంటారు.ఇలా తెలుగు సినిమాల్లో ఒక్కసారిగా తెలంగాణాకు, ప్రాంతానికి పెద్దపీట వేస్తున్నారు. అయితే అక్కడ సంస్కృతి,సంప్రదాయాలను కూడా గుర్తించి,గౌరవించి వాటిని సైతం సినిమాల్లో పెడితే మన తెలుగు సినిమాలు మరింత జీవంతో ఉట్టి పడతాయి.ఈ మార్పుకు కారణం ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా తెలంగాణా ఉద్యమమేనన్నది అందరి వాదన
Powered by web analytics software.