Free SMS And Earn Part Time Money







1/24/11

పవన్ పక్కన మలైకా అరోరా


సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హీందీ వెర్షన్ లో ‘మున్నీ బదనామ్..’ అనే ఐటమ్ సాంగ్ ని సల్మాన్ తో కలిసి మలైకా అరోరా ఖాన్ చేసింది. ఈ పాట ఎంత ఫేమస్ అయ్యిందో మలైకాకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి మలైకానే ఈ పాట చేస్తుందా?లేక మరెవరైనా చెస్తారా? అనే చర్చలు సాగుతున్నాయి. తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహిస్తున్న హరీష్ శంకర్ తన సినిమాలో హాట్ సీన్స్ ను బాగా ప్రెజెంట్ చేస్తాడు. ఇటీవల విడుదలైన ‘మిరపకాయ్’ చిత్రంలో కూడా రవితేజ, రిచా గంగోపాద్యాయల మధ్య చాలా హాట్ సీన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మలైకా కనుక ఈ ఐటమ్ సాంగ్ చేస్తే హరీష్ శంకర్ ఈ పాటను ప్రేక్షకులు ఆకట్టుకునేలా చిత్రీకరిస్తాడని

నాగ్ వంశానికి నంద్ వంశానికి మధ్య ???? ఒక సినిమా???


జనవరి 14న బాలీవుడ్ లో విడుదలైన యమ్లా, పగ్లా, దీవానా’ చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరో ధర్మేంద్ర తన ఇద్దరు కుమారులతో కలిసి నటించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోని ఓ పెద్ద నిర్మాత ఈచిత్రం రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం సాధిస్తుందని బావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని అక్కినేని వంశంతో తీయాలా లేక నందమూరి వంశం హీరోలతో తీయాలా అనేదే పెద్ద సందేహంగా తయారైంది. మరో ప్రక్క కృష్ణవంశీ, నాగార్జున కాంబినేషన్ లో నాగవంశ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు. కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఈ సూచనల బట్టి ఈ పెద్ద నిర్మాత నందమూరి వంశంతోనే ఈ సినిమా తీయచ్చు పరమవీర చక్ర తో మళ్ళి ఫ్లేప్ లోకి వెళ్ళిన బాలయ్య ఈ సినిమా రీమేక్ కి ఒప్పుకుంటాడో లేదో దర్శక నిర్మాతలు ముందుకొస్తారొ లేదొ అసలు ఆ పెద్ద నిర్మాత ఎవరో కొన్ని సమస్యలు ??? ఇప్పటికింతే

ట్రెండ్ కోసం టూ పీస్ బికిని వేస్తే తప్పులేదు:త్రిష


బికిని వేయడమే బరితెగింపు అయితే, టూ పీస్ బికినీకి కూడా పాపులారిటీ ఎలా వస్తుందని, సెన్సార్ దాన్ని ఎలా అంగీకరిస్తుందని ప్రశ్నిస్తోంది హీరోయిన్ త్రిష ట్రెండ్ మారుతోందనీ, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్లామర్ కొత్త పుంతలు తొక్కుతోందనీ చెబుతోన్న త్రిష, ట్రెండ్ కి తగ్గట్టుగా అప్ టు డేట్ గా వుండాలని క్లాస్ పీకేస్తోంది. అయితే ఎంతగా ట్రెండ్ ని ఫాలో అయినా, వల్గారిటీ జోలికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటానని త్రిష చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ అవకాశాల కోసం కాస్తంత ఎక్స్ పోజింగ్ డోస్ పెంచిన మాట వాస్తవమే కదా..అనడిగితే, బాలీవుడ్ అవకాశాల కోసం కాదుగానీ, మోడ్రన్ లుక్ కోసమే అలా ట్రై చేశానని అతి తెలివి ప్రదర్శిస్తోంది త్రిష. నెంబర్ల పొజిషన్ పై నమ్మకం లేదనీ, ఏ రంగంలో అయినా ముందుండాలని అనుకోవడం తప్పులేదుగానీ, ఆ పొజిషన్ కోసం అడ్డదార్లు తొక్కడం తనకు నచ్చదని త్రిష అంటోంది.

ala modalaimdi trailer

mangala trailer

gaganam Trailer

కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా లకి షాక్


కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్నుశాఖ సోమవారం దాడులు మొదలుపెట్టింది. అయితే ఈ దాడులకు కారణమేమిటన్నది అధికారికంగా తెలియకపోయినప్పటికీ గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని తెలిసింది. ఐటీ అధికారుల దాడులకే ఇదే కారణమా...? లేక ఇంకేమైనా ఉన్నదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా కత్రినా, ప్రియాంకాలిద్దరూ అంతర్జాతీయ స్థాయిలో ఆఫర్లను దక్కించుకోవడమే కాక పెద్దమొత్తంలో పారితోషికాలను తీసుకుంటున్నట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో ఆ ఆదాయలకు సంబంధించిన వివరాలను వారు తెలియజేయకపోవడమే ఈ దాడులకు కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు.

సందర్భం[సంధర్భం లేకున్న ] దొరికితే చాలు టాప్‌లెస్‌గా దర్శన0


సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి..? పొట్టి దుస్తులు వేయాలి ఇదీ ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల పార్ములా. సందర్భం[సంధర్భం లేకున్న ] దొరికితే చాలు కురుచ దుస్తుల్లో అందాలన్నిటినీ బట్టబయలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు నేటి టాలీవుడ్ హీరోయిన్స్.

బాలీవుడ్ హాటెస్ట్ తారామణులు టాప్‌లెస్‌గా దర్శనమివ్వంగా లేనిది... తాము తొడలను, ఎద అందాలను చూపించడంలో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుత హాట్ తారామణులు. టాప్‌లెస్‌గా ఫోజిలిస్తున్న మల్లికా శరావత్, అమీషా పటేల్ వంటి తారలు తమకు మార్గదర్శకులన్నట్లుగా ఉంటున్నాయి వీరి మాటలు.

హౄతిక్ కి షాక్ ఇచ్చిన హౄతిక్ భార్య


నాగర్జున కి పోటిగా [అనుష్క కోసం]రోహిత్


డబ్బు ఒకరిది సినిమా మరొకరిది:దబాంగ్[గబ్బర్ సింగ్]


పవన్ కళ్యాణ్ రీసెంట్ గా గబ్బర్ సింగ్ టైటిల్ ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ ‘దబాంగ్’ కి రీమేక్. ఈ చిత్రం గురుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తోలి చిత్రం ఇది. హిందీ సూపర్ హిట్ దబాంగ్ ఆధారంగా చేస్తున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గబ్బర్ సింగ్ గా నటిస్తున్నాను అన్నారు. అయితే అది నిజం కాదని గణేష్ బాబే నిర్మాత అని అంతటా వినపడుతోంది. గణేష్ కి ఈ మధ్యన సూరి హత్య కేసులో నిందితుడు భానుతో రిలేషన్స్ ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేఫధ్యంలో గణేష్ కి బాగా సన్నిహితుడైన పవన్ కళ్యాణ్ ఈ విధంగా తన పేరు ఉపయోగించి సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం గణేష్ నిర్మాతగా చేస్తున్న లవ్ ఆజ్ కల్ రీమేక్ తర్వాత ఈ చిత్రం ఉండబోతోంది. పేరుకు పవన్ కళ్యాణ్ క్రియోటివ్ వర్క్స్ బ్యానర్ అనే గానీ మొత్తం వెనక ఉండి డబ్బు పెట్టుబడి పెట్టి నడిపించేది గణేష్ బాబే అంటున్నారు. అందులోనూ దబాంగ్ రీమేక్ రైట్స్ తీసుకున్నది కూడా గణేష్ బాబే కావటం ఈ వార్తలకు ఊతమిస్తోంది. తాను దబాంగ్ తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నానని, ఎవరూ కాపీ కొట్టవద్దని ఈ మధ్యనే గణేష్ ఓ లీడింగ్ paper లో లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేయబోతున్నాడు. హరీష్..రవితేజతో మిరపకాయ అనే హిట్ కొట్టారు. ఈ మిరపకాయ కథని కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పాడు కానీ ఓకే కాలేదు......కధ ఓకే చెయాలేని హరీష్ తో మళ్ళి సినిమా ఎందుకు తీస్తునట్టొ పవన్ కల్యాణ్ ఆరెంజ్ ఫ్లేప్ తో మునిగిన నాగబాబు కి ఒక సినిమా తో ఆదుకుంటున్నాడు ఇప్పుడు తన స్నేహితుడు గణేష్ కి ఈ రూపంలో[గబ్బర్ సింగ్]ఆదుకుంటున్నాడు ముందు ముందు ఎంత మంది ని ఆదుకుంటాడో

నవనీత్ కౌర్ వివాహం గొడవలు,వార్నింగ్ లు[మహారాష్ట్ర ఎమ్మెల్యే రవిరానా వివాహం చేసుకోనున్నాడు]


శ్రీను వాసంతి లక్ష్మి చిత్రంతో తెలుగులో పరిచయం అయిన నవనీత్ కౌర్ వివాహం పిబ్రవరి రెండవ తేదీన జరగనుంది. ఆమెను మహారాష్ట్ర ఎమ్మెల్యే రవిరానా వివాహం చేసుకోనున్నాడు. వీరిది ప్రేమ వివాహం అని చెప్తున్నారు. ఇక ఈ వివాహానికి మరో ప్రత్యేకత ఉంది. వీరి వివాహంతో పాటు అదే వేదికపై వివిధ కులాలు, మతాలకు, విశ్వాసాలకు చెందిన దాదాపు 2100 జంటలు ఒకటవనున్నాయి. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ పెళ్ళిళ్ళు జరగనున్నాయి. ఈ ఏర్పాట్లు చేస్తున్నది నవనీత్ కౌర్ కాబోయే భర్త రవిరానా నే కావటం మరో విశేషం. నాలుగు లక్షల గజాల ప్రాంగణంలో లక్ష గజాల వేదికపై 2100 జంటలలో ఒకరిగా వీరి పెళ్ళి జరగనుంది. అంతేకాదు ఈ వివాహాల వేడుకను రికార్డ్ చేయడానికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా వస్తున్నారు.

ఇక నవనీత్ కౌర్ ఆ మధ్యన తన తెలుగులో చివరి సినిమా అయిన భూమా హీరో అతిధి శ్రీనివాస్ తో సహజీవనం చేసిందని గొడవలు,వార్నింగ్ లు జరిగాయి.

('అలా మొదలైంది' రివ్యూ)


సూర్య ప్రకాష్ జోశ్యుల
చిత్రం: అలా మొదలైంది
సంస్థ: శ్రీ రంజిత్‌ మూవీస్‌
నటీనటులు: నాని, నిత్య మీనన్‌, స్నేహ ఉల్లాల్‌, కృతి కర్బందా,
ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు.
సంగీతం: కల్యాణి మాలిక్‌
నిర్మాత: కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌
దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి

మహిళా దర్శకురాలు, అందులోనూ తొలి చిత్రం అంటే రకరకాల అంచనాలు, ఆలోచనలు అలవోకగా మదిలో మొదలైపోతాయి. అయితే ఆ అపోహలను ఒంటిచేత్తో చెదరకొట్టి, కామిడీతో అదరకొట్టి ప్రేక్షకుల నాడిని పట్టే ప్రయత్నం చేసిందీ చిత్రం. స్క్రిప్టు పరంగా చూస్తే రొమాంటిక్ కామిడీ అని మొదలుపెట్టిన ఈ చిత్రం స్క్రీన్ టైమ్ గడిచే కొలిదీ రొమాన్స్ తగ్గిపోయి, కేవలం కామిడీకే పరిమితమతవటమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే రొమాంటిక్ కామిడీ కాకపోతే కామిడి...ఏదైతే ఏంటి టిక్కెట్ డబ్బులు గిట్టుబాటు కావటానికి అని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మౌత్ టాకే ఈ చిత్రాన్ని నిలబెడుతుందనిపిస్తుంది.

గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా చూడదగ్గ కథ...కాదు కాదు..కథనం.

నిజానికి ఇలాంటి కథలు కత్తిమీద సాము లాంటివి. వీటిల్లో ప్రత్యేకమైన కథ ఉండదు. కేవలం సన్నివేశాల బలంతో, డైలాగులతో, నటీనటుల హావ భావాలతో కథనం నడవాలి. అందులోనూ ఈ తరహా చిత్రాల్లో కనపడే...కలవటం...విడిపోవటం..పొందటం అనే రొమాంటిక్ కామిడీ బీట్స్ సగటు సినిమా ప్రేక్షకుడుకి పరిచయం అయినవే. దాంతో తెరపై తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడు ఇట్టే ఊహించేస్తాడు. దాంతో ఇలాంటి కథను నెలబెట్టాలంటే...స్క్రీన్ ప్లేని ఎంత ఆసక్తికరంగా మలిచాము, ఎంత కొత్తగా చెప్పామన్నదే చివరిదాకా కూర్చోబెట్టే అంశం. ఈ విషయంలో దర్శకురాలు పూర్తిగా కాదు కానీ..దాదాపు సఫలీకృతమైనట్లే.

ఇక ఫస్టాఫ్ పూర్తయ్యి ఇంటర్వెల్ కు వచ్చేసరికే కథ ఓ కొలిక్కి వచ్చేసింది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టిన తర్వాత వేరే ఏ సమస్యా వారిద్దమరి మధ్య లేకపోవటంతో కాంఫ్లిక్ట్ లేకుండా పోయింది. దాంతో సెకెండాఫ్ ని రన్ చేయటం కోసం..అపార్ధాలు, ఫేక్ బ్యాంగ్ ల మీద ఆధారపడ్డారు. అలాగే ఇక హీరోయిన్ కి సెల్ ఫోన్ పెడితే కథ ఆగిపోతుందని పెట్టకపోవటం, కథ డిమాండ్ చేయకపోయినా కావాలని డైలీ సీరియల్ తరహా ట్విస్ట్ లు కథలోకి తీసుకురావటం, మైనస్ లు గా ఈ చిత్రంలో పంటిక్రింద రాయిలా కనపడతాయి.

అలాగే హీరో తల్లిని చంపటం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఎక్కడా కథలో డెప్త్ పెరగలేదు... కథలో చిన్న మార్పు కూడా రాలేదు. అలాగే ఆశిష్ విధ్యార్ధి పాత్ర క్లైమాక్స్ లో కామిడి చేసినా నిజానికి అదీ కథను ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళదు. ఇవన్ని ప్రక్కన పెట్టితే కథలో ఎక్కడో ప్లాంటింగ్ చేసి మరెక్కడో పే ఆప్ చేయటం(గే సీన్ వంటివి) అనే టెక్నిక్ ని చాలా చోట్ల వాడినా ఎక్కడా దొరక్కుండా మ్యానేజ్ చేయటం మాత్రం బాగా చేసారు. వీటితో పాటు టైటిల్స్ పడేటప్పుడు ఆ టెక్నీషియన్స్, ఆ ఆర్టిస్టులు చిన్నప్పటి ఫోటోలు వెయ్యటం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కామిడీనే ఈ చిత్రం సక్సెస్ కు ప్రాణమై నిలుస్తుంది.

నటీనటుల్లో నాని, నిత్య పోటీ పడిచేసారు. నిత్య నటనకన్నా నవ్వు బాగుంది. ఆ నవ్వుతో చాలా మంది ప్రేమలో పడే ప్రమాదం కూడా ఉంది. డైలాగులు కూడా ఎన్నుకున్న జెనర్ కి తగ్గట్లే పంచ్ లతో పేలాయి.అయితే కథకు సంభంధం లేని సన్నివేశాల్లోనే అవి పేలటం విచిత్రం. ఇక డైరక్షన్ పరంగా గా దర్శకురాలు నీట్ గా ప్రెజెంట్ చేసింది కానీ తనదైన ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. టెక్నికల్ గా కెమెరా వర్క్ మరింత బావుండాల్సింది. మిగతా డిపార్టమెంట్ లు ఓకే అనిపిస్తాయి. రెండు పాటలు తప్ప మిగతావి ఎక్కవు.

ఏదైమైనా ఈ చిత్రం ఓ కామిడీ గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఓ కొత్త దర్శకురాలు తడబడకుండా చేసిన ప్రయత్నాన్ని అభినందించటానికి వెళ్ళొచ్చు. ఉన్నంతలో ఆహ్లాదంగా తీయటానకి ప్రయత్నంచిన ఈ చిత్రంలో అసభ్యత, శృంగారం లేవు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళి చూసి రావచ్చు.

వైద్యుడిని పెళ్లాడాలన్నది నా కోరిక:kangana ranaut


ఓ వైద్యుడిని పెళ్లాడాలన్నది నా కోరిక అంటూ మనసులో మాటను బయటపెట్టింది హాట్ నటి కంగనా రనౌత్. "వైద్యులు తెలివైనవారు, కామ్‌గా ఉండే తత్వం కలిగి ఉంటారు. ఇదే పరిశ్రమలోని వ్యక్తిని పెళ్లాడాననుకోండి. ఇద్దరి మధ్య కెరీర్ పరుగులు తప్పవు. ఇద్దరం ఇలాగైతే ఎలా సుఖపడతాం చెప్పండి. ఎవరో ఒకరు సమస్యలను సర్ది, బాంధవ్యాన్ని బ్యాలన్స్ చేయాలి కదా" అంటూ చెప్పుకొచ్చింది. అదిసరే... సినిమాల్లో ఓవర్‌ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారని అంటున్నారు.. దీనిపై ఏమంటారు అని అడిగితే... "నేనో చిన్న పట్టణానికి చెందిన యువతిని. గ్లామర్ అంతటినీ బయటపెడుతున్నాననీ, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తున్నానని కొందరు అనుకోవడం తప్పు. పట్టణం నుంచి వచ్చాను కనుక అంత ఎక్స్‌పోజింగ్ బహుశా నేను చేయలేను. ఇప్పుడు చూపిస్తున్న గ్లామర్‌నే ఓవర్ ఎక్స్‌పోజింగ్ అని అంటే నాకంటే ఇంకా ఎక్కువగానే చూపించే అమ్మాయిలు ఈనాడు చాలా చోట్ల ఉన్నార"ని తెగేసి చెప్పింది కంగనా రనౌత్.

అంతపేరు వచ్చిన ఇండస్ట్రీని వదలబుద్దికావడం ??


అనుష్క బాలీవుడ్‌లో నటించే అవకాశం లభించినప్పటికీ ఎందుకనో వెళ్లాలనిపించడం లేదని చెబుతోంది. తమిళంలో విజయం సాధించిన 'సింగం' చిత్రం హిందీ రీమేక్‌లో ఛాన్స్‌ వచ్చినా వద్దని తిరస్కరించింది. తెలుగులోనే అగ్రహీరో(లు)తో నటించడం చాలా తృప్తిగా ఉందనీ, అందువల్ల మరో పరిశ్రమలో కాలుపెట్టేందుకు ఇష్టం రావడం లేదని అంటోంది. ఇదిలావుంటే ఇప్పటికే నాగార్జున చిత్రాలన్నింటిలో ఆమె డేట్స్‌ ఫుల్‌ అయ్యాయి. నాగార్జున నటిస్తుంటే నటనలా అనిపించదు. బిహేవ్‌ చేస్తున్నట్లనిపిస్తుందని అంటోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ వస్త్ర దుకాణానికి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దక్షిణాదిలో చాలా కంఫర్టబుల్‌గా ఉందని, వేదం, అరుంధతి ఎంతో పేరు తెచ్చాయనీ, అంతపేరు వచ్చిన ఇండస్ట్రీని వదలబుద్దికావడం లేదని అంటోంది. నిజమేమరీ..

ఆ మూడు ఉన్న జీవితం మిదైతే ఈ సినిమా చూడలి




Powered by web analytics software.