"హీరో కుమారుడు హీరోనే కావాలా?" దాసరి కుమారుడు హీరో.. ఆయన కుమారుడు హీరో.. ఇలా కథానాయకుల కుమారులంతా హీరోయిలతే ఇండస్ట్రీలో కొత్తదనం ఏముంది? ఎందరో దాసరినారాయణరావును కాలవాలని, రాఘవేంద్రరావు, వినాయక్, రాజమౌళి కాలవాలనుకుంటున్నారు. మరి వారికి సరైన వేదిక ఏది? మధ్యలో ఎవరో ఏజెన్సీ ద్వారా వచ్చి మోసపోతే దానికి బాధ్యులెవరు? అందుకే దానికి ఓ ఫ్లాట్‌ఫారమ్ కావాలి. అది నటి భూమిక కల్పిస్తోంది. దీన్ని అందరూ అభినందించాలని డా. దాసరి నారాయణరావు అన్నారు. నటి భూమిక, భరత్‌ఠాగూర్ నిర్వహిస్తోన్న "మాయానగర్ టాలెంట్ హంట్"ను దాసరి ప్రారంభించారు. పల్లెపల్లెలా తిరిగి నటీనటులను ఎంపికచేశామని, అప్పటినుంచి ఈ పనిని కొనసాగిస్తునే ఉన్నామని దాసరి చెప్పారు. ఇప్పుడంతా చాలా ఈజీగా అయిపోయింది. దేశవిదేశాల్లో ఉన్నవారంతా "మాయానగర్ డాట్‌కామ్" ఓపెన్ చేసి తగిన వివరాలు తెలుసుకోవచ్చునని దాసరి తెలిపారు. త్వరలో తాను కూడా 5 చిత్రాలు తీస్తున్నామని.. అందులో కొత్తవారికి ప్రవేశం కల్పిస్తామని ఆయన భుమికకు హామీ.
మీలో ఎవరైన డైరక్టెర్స్ యాక్టర్స్ అవాలనుకుంటే వెంటనే మయానగర్ ఓపెన్ చేసి మీ ప్రతిభను తెలపండి