Free SMS And Earn Part Time Money







2/27/11

shakti audio function details




దీపికా పదుకొనె తో రణ్ బీర్


sneha ullal dropped in tamil vaanam remake of telugu vedam


తెలుగులో విజయం సాధించిన వేదం చిత్రాన్ని తమిళంలో వానం టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగితి తెలిసిందే. ఈ చిత్రంలో మొదట స్నేహ ఉల్లాల్ ని దీక్షాసేధ్ పాత్రలో తీసుకున్నారు. తెలుగులో అల్లు అర్జున్ ప్రియురాలి పాత్ర అది. అల్లు అర్జున్ పాత్రను శింబు చేస్తున్నారు. అయితే ఇప్పుడామెను తొలగించి జాస్మిన్‌ను పరిచయం చేస్తున్నారు.జాస్మిన్ ఓ డిల్లీ మోడల్. శింబు, భరత్ అనుష్క తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో దర్శకత్వం వహించిన క్రిష్ ఇక్కడ కూడా దర్శకత్వం వహిస్తున్నారు. శింబు, స్నేహా ఉల్లాల్ కాంబినేషన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు చిత్రీకరించారు. ఇప్పుడా సన్నివేశాలను నుంచి తొలగించి శింబు, జాస్మిన్‌లతో చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ నాలుగు రోజులలో పూర్తవుతుందని చిత్రాన్ని ఏప్రిల్‌లో వేసవి విడుదలగా ఈ చిత్రాన్ని ప్లాన్ దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

Mohan babu in bejawada rowdilu


రక్త చరిత్రలో ఎన్టీఆర్ పాత్రకు అప్పట్లో మోహన్ బాబుని రామ్ గోపాల్ వర్మ అడిగన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబు అప్పుడు ఆ పాత్రను రిజెక్టు చేస్తే శతృఘ్నసిన్హా చేసారు.ఇప్పుడు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ త్వరలో రూపొందించనున్న బెజవాడ రౌడీలు చిత్రంలో మోహన్ బాబుకి కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్లు సమాచారం. మోహన్ బాబు కూడా వర్మ దర్సకత్వంలో చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న..వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న దొంగలముఠాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాని వర్మ శిష్యుడు వివేక్ డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కేవలం సమర్పిస్తారు మాత్రమే అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వస్తుందని చెప్తున్నారు. నాగచైతన్య హీరోగా నటించే ఈ చిత్రం మార్చి నెలాఖరుకు మొదలుకానుంది. అప్పరాజు నిర్మించిన కిరణ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని ఇప్పటికే అంతటా పాపులర్ అయింది. అలాగే ఈ చిత్రం బెజవాడలోని రౌడీయిజం,గూండాయిజం నేపధ్యంలో సాగనుంది. ఇప్పటికీ టైటిల్ మార్చమని ఆయనకు ఒత్తిళ్ళు వస్తున్నాయి.

bejawada rowdilu tittle song free download

మగధీర హింది హిరో ఎవరంటే


రామ్ చరణ్ తేజ్, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో రూపొంది ఘన విజయం సాధించిన మగధీర చిత్రం త్వరలో హిందీలో రీమేక్ కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రను రణబీర్ కపూర్ చేస్తున్నాడు. గజనీ నిర్మాత మధు మంతెన ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకుకెళ్థున్నారు. మెఘల్ సామ్రాజ్యంలో జరిగే కథగా ఈ ప్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళినే ఈ చిత్రానికి దర్శకుడుగా ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు దాదాపు తొంభై కోట్లు వరకూ ఖర్చు అవుతుందని ప్రాధమిక అంచనా. ఇక హిందీలోనూ ఈ చిత్రం అధ్బుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుంది.

mahesh ok 4 mani


ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా ట్విట్టర్ లో తాను మణిరత్నం తో సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేసారు. ఆయన ఏం ట్వీట్ చేసారంటే.. పెద్ద న్యూస్ ఏమిటంటే..మణి సార్ ని కలవటం. అవును..లెజండరీ మణిరత్నం ని కలవటం. నా కల నెరవేరిందనిపించింది. ఆయన సినిమా చేస్తున్నాను. ఇది నా జీవితంలో చాలా ఆనందకరమైన రోజు. ఎప్పుడూ మీ సపోర్ట్ కావాలి అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు..శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.ఇప్పటికే టర్కీ, దుబాయి,గుజరాత్ లలో ఈచిత్రం షూటింగ్ జరుపుకుని వచ్చింది.తదుపరి షెడ్యూల్ పిబ్రవరి 15 నుంచి మార్చి 3 వరకూ హైదరాబాద్ లో జరగనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆచంట గోపీచంద్, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ అందిస్తూంటే కోన వెంకట్ మాటలు రాస్తున్నారు.

shakti first look and story


జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన చిత్రం 'శక్తి'. ఈ చిత్రం కథ గురించి చెబుతూ దర్సకుడు మెహర్ రమేష్..ఈ చిత్రం కథ శక్తి పీఠాల నేపధ్యంలో సాగుతుంది అన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహమణ్యం ఈ చిత్రంలో శక్తి పీఠాల ప్రాశస్త్యం గురించి వివరిస్తారని చెప్పారు. ఇక ఎన్టీఆర్ రోల్ ..ఐదు డైమన్షన్స్ లలో ఉంటుందని అన్నారు. ఇక శక్తి చిత్రం మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో నిన్న (ఆదివారం) రాత్రి హైదరాబాద్ లో ని హైటెక్స్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, ఇలియానా, మెహర్ రమేష్, అశ్వనీదత్ జాకీ షరీఫ్, సుమ, దయానంద్, మణిశర్మ, నాని, మంజరి, మంజు భార్గవి, మెహర్ రమేష్, బోయపాటి శ్రీను, కే.ఎస్.రామారావు, గణేష్ తదితరులు హాజరయ్యారు.తోలి సీడీని ఎన్టీఆర్ విడుదల చేసి మణిశర్మ కి ఇచ్చాడు. ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి, జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.



Powered by web analytics software.