Free SMS And Earn Part Time Money







9/11/09

కొన్ని పాత చిత్రాల పోస్టర్స్ మీకోసం



శంఖం రివ్యూ

తెలుగు సినిమాల్లో కొన్ని ఇంకా రొటీన్ ఫార్ములాలోనే మునిగి తేలుతున్నాయ్ అనడానికి చక్కటి ఉదాహరణే ఈ శంఖం.గోపిచంద్కి ఒకేపంద మాస్ ఉందనట్టుగ రణం, లక్ష్యం, శౌర్యంలోని "సున్నా" సెంటిమెంట్‌తో ఈసారి శంఖం అంటూ గోపీచంద్ చేసిన మరో ప్రయత్నం. పక్కా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రమిది. వెంకటేష్ నటించిన జయం మనదేరా... చిత్రానికి దాదాపు జెరాక్స్ కాపీ శంఖం. కాస్త మార్పులతో సత్యరాజ్ వంటి నటుడితో చేసిన ప్రయోగం. రణంలో ఫ్యాక్షనిజంలో నాయకులకోసం అనుచరులు జీవితాలు బలిచేసుకోవద్దన్న పాయింట్ ఉంటే శౌర్యంలోకి వచ్చేసరికి ప్రజలను పీడిస్తున్న ఫ్యాక్షనిస్టును మరో ఫ్యాక్షనిస్టు కొడుకు ఎలా చంపాడన్నది చర్చించాడు. ఇందులో పెద్దగా సందేశాలు, ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఏమీ ఉండవు. ఏదో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు గొడవ. కత్తులతో కుత్తుకలు తెంచుకుంటే... చూసి ఆనందించే స్థాయిలో ఈనాటి ప్రేక్షకుడు లేడు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు గ్రహించినట్లు లేరు. కథలోనూ ప్రత్యర్థులుగా మారేందుకు ఫ్యాక్షనిస్టులకు బలమైన కారణాలు అసలే కనబడవు. ఏదో ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి కనుక ఒకడు మంచివాడు, మరొకడు చెడ్డవాడు అనేలా చూపాలి కనుక చూపాడు. ఎన్నుకున్న ప్రదేశం కూడా కడప జిల్లాలోని ఎర్రగుంట, ఒంటిమిట్ట ప్రాంతాల ఫ్యాక్షన్ నాయకులు పశుపతి( కోట శ్రీనివాసరావు), శివయ్య (సత్యరాజ్)["ఏదో ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి కనుక ఒకడు మంచివాడు, మరొకడు చెడ్డవాడు అనేలా చూపాలి కనుక చూపాడు"ఇలాంటి ఫార్ములతో వచ్చిన ఆంజనేయులు ప్లాప్ అని తెలిసుండదు] Trisha and Gopichandకథలోకి వెళితే ఆస్ట్రేలియాలో సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు చందు ( గోపీచంద్). మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగై దానికి న్యాయం చేయాలంటే ఎవర్ని కొట్టాలనే ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురవుతుంది. తన మామయ్య చంద్రమోహన్ పర్యవేక్షణలో ఉంటాడు. పెళ్లీడుకు వచ్చాడు కనుక తగిన అమ్మాయికోసం వెతుకుతుంటారు. మరోవైపు అంతే సరదాగా జీవితాన్ని గడిపేస్తూ... కోపం వస్తే విపరీతంగా ఎదుటివారిని కొట్టే రకం మహాలక్ష్మిది( త్రిష). అక్కడే తన బాబాయ్ హోటల్ అయిన ఆంధ్రామిర్చి అనే హోటల్‌లో ఉంటుంది. అనుకోకుండా మహాలక్ష్మిని చూసి చందు లవ్‌లో పడతాడు. మహాలక్ష్మి మాత్రం ఇష్టపడదు. మధ్యమధ్యలో కొన్ని సంఘటనలతో ప్రేమలో పడుతుంది"కామన్ ప్రతి సినిమాలో". సరిగ్గా ఆ టైమ్‌లో మహాలక్ష్మి అత్తమ్మ తెలంగాణా శకుంతల వచ్చి తన కొడుకుతో పెళ్లి నిశ్చయమైందని మహాలక్ష్మిని తీసుకుని వెళుతుంది. అయితే చందు విషయం తెలిసిన శకుంతల, దమ్మున్నవాడివైతే కడపవచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లమని రెచ్చగొడుతుంది. దాంతో ఏకంగా కడపలోని ఎర్రగుంటకు వెళ్లడమేకాక నేరుగా మహాలక్ష్మి ఇంటికి వస్తాడు చందు. ఇది చూసిన మహాలక్ష్మి తండ్రి కోట శ్రీనివాసరావు... చందుకు ఓ పని అప్పగిస్తాడు. అది చేస్తే మహాలక్ష్మి నీకు దక్కుతుందంటాడు.. అది ఏమిటి..? చందు దానిని నెరవేర్చాడా...? ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది. ఆతృత ఉంటే థియేటర్‌కు వెళ్లి చూడాలి. మొదటిభాగమంతా ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. ఇంటర్వెల్‌కు కాస్త ముందు ఇండియా వస్తుంది. ఆస్ట్రేలియా ఎపిసోడంతో అల్లరిచిల్లరిగా ఉంటుంది. హీరో హీరోయిన్‌ను ఏడిపించడం... వారికి మధ్యలో శ్రీనివాసరెడ్డి అనే ఆర్టిస్టు పోకిరి చేష్టలతో సాగుతుంది. కామెడీ కోసమే శ్రీనివాసరెడ్డిని పెట్టి చేసిన సన్నివేశాలు ఏమాత్రం పండలేదు. గోపీచంద్ సినిమాలో తప్పనిసరిగా ఉండే అలీ ఇందులోనూ ఉన్నాడు. ఈ పాత్ర కాస్త నవ్విస్తుంది. అలీ పెండ్లికి గోపీచంద్ వెళ్లే సన్నివేశం ఏమంత ఆసక్తిగా లేకపోయినా పెండ్లి తర్వాత అలీ చేసే పనులు కొద్దిగా నవ్విస్తాయి. కథంతా సెకండాఫ్‌లోనే. మహాలక్ష్మి ప్రేమించింది శివయ్య కొడుకునే. ఇద్దరి కుటుంబాలకు బద్ధ విరోధం. ఆ విరోధం కూడా బలంగా లేదు. కాకపోతే... ఊరి జనాల పొలాలను పశుపతి లాక్కుని తన క్వారీలో వారిచేత వెట్టి చాకిరీ చేయిస్తుంటాడు. ఇది అన్యాయం అని తన పొలాలన్నీ శివయ్య పశుపతికి ఇచ్చి వారిని విడిచిపెట్టమంటాడు. ఇంకేముంది శివయ్య దేవుడవుతాడు. ఇది సహించలేని పశుపతి శివయ్యపై పగ పెంచుకుంటాడు. అలా సింపుల్‌గా వారి మధ్య వైరం పెరుగుతుంది. అది చివరికి శివయ్యను చంపేదాకా వస్తుంది. దాంతో చందు పశుపతిని ఎలా చంపాడు..? అన్నదే సినిమా. నటనాపరంగా తండ్రి చనిపోయే సన్నివేశంలో గోపీచంద్ రెండు నిమిషాలపాటు బాగా నటించాడు. మిగిలినదంతా రొటీన్‌గానే ఉంది. త్రిష అల్లరిచిల్లరగా చేయడం మినహా పాత్రలో నటనకు ఏమాత్రం ఆస్కారం లేదు. వేణుమాధవ్ రొటీన్ అయినా తన్నులు తింటూ నవ్వు తెప్పిస్తాడు. డాక్టర్ పాత్రలో రఘుబాబు సన్నివేశం, కృష్ణభగవాన్ పాత్రలు రొటీన్‌. నవ్వు తెప్పించలేదు. తమన్ సంగీతం మామూలుగానే ఉంది. "తకతకదిల్ బరేన్..." గ్రూప్ సాంగ్ కాస్త క్యాచీగా ఉంది. మిగిలినవి సోసో... చిత్రంలో చెప్పుకోవాల్సింది... ఫోటోగ్రఫీ. దర్శకుడు ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్ కనుక ఆ దిశగా బాగా చేయించుకున్నాడు. ఇంతకంటే సినిమా గురించి పెద్దగా చెప్పాల్సింది లేదు. మరి మాస్‌ను ఈ శంఖం ఎంతవరకు ఆకర్షిస్తుందో'అస్సలు నచ్చదని నా అభిప్రాయం చూడాల్సిందే. చివరిగా ఇందులో రెండు అంశాలు వివాదంగా మారే అవకాశాలున్నాయి. 1. టెన్నిస్ ఆట రాకపోయినా చాలామంది ఆ ఆటను ఎందుకు చూస్తారు అనంటే... చిన్న షార్ట్స్‌తో రాకెట్ పట్టుకుని ఎగిరెగిరి కొడుతుంటే... అందాలు చూడ్డానికని గోపీచంద్ మహాలక్ష్మితో అనడం. 2. క్రిస్టియన్ అయిన అలీ తల్లిదండ్రులు, ముస్లిం అయిన ఆయన మామగారు తమ పద్ధతిలో పెండ్లికావాలంటూ పేచీ పెడుతుంటే, గోపీచంద్ వచ్చి, హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేయిస్తాడు. అంతకు ముందు మరో జంట పెండ్లి చేసుకోవాలని చెప్పి తన ప్రేయసి మహాలక్ష్మితో పెండ్లి చేసుకుంటాడు. ఇదంతా ఉత్తిత్తి పెళ్లే అని ధర్మవరపు అనడం... పెండ్లి చేసే తీరు... హిందూ వివాహ వ్యవస్థను అవహేళన చేసేదిగా ఉంది.


[by the yahoo news]

(జస్ట్ గణేష్)

Ganesh Audio Release
రామ్, కాజల్ జంటగా ఎం.శరవణన్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై "స్రవంతి" రవికిషోర్ నిర్మిస్తోన్న గణేష్ (జస్ట్ గణేష్) చిత్రం ఆడియో ఆవిష్కరణ ఈ చిత్రం ఆడియో క్యాసెట్లను యువకథానాయకుడు ఎన్టీఆర్ ఆవిష్కరించి తొలి క్యాసెట్‌ను కోటికి అందించారు. ఆడియో సీడీని డి.సురేష్‌బాబు ఆవిష్కరించి దిల్‌రాజుకు అందించారు.

శరవణన్ మాట్లాడుతూ.. యూనిట్ సహకారంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా గణేష్‌ను తెరకెక్కించామన్నారు

సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా పాటల చిత్రీకరణను స్విట్జర్లాండ్‌కు వెళ్లి తిలకించే అవకాశం తనకు కలిగిందని, వైవిధ్యమైన సంగీతాన్ని అందించడానికి కృషి చేశానని తెలిపారు.

ముఖ్యఅతిథి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కథానాయకుడిగా అన్ని క్వాలిటీలు ఉన్న రామ్ ఈ సినిమాలో ధరించి గెటప్ బాగుందని కితాబిచ్చారు. గెటప్ లాగానే సినిమా కూడా బాగుంటుందని భావిస్తున్నానని, రవికిషోర్‌కి, రామ్‌కి మరో "రెడీ" కావాలని ఎన్టీఆర్ తెలిపారు.

రామ్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పిల్లలతో కలిసి నటించడం జీవితకాలపు మధురానుభూతిని కలిగించిందని, దర్శకుడు చాలా కొత్తగా సినిమాను రూపొందించారని వెల్లడించారు. టైటిల్ పాతగా ఉన్నా సినిమా కొత్తగా ఉంటుందని, ఈ సినిమా ఆడియో విన్న తర్వాతే తాను మిక్కీ జె. మేయర్ ఫ్యాన్‌ని అయ్యానని చెప్పుకొచ్చారు.

అవకాశలు మంచిగ వినియోగించుకుంటున్న కాజల్ కాజల్ ఇప్పటికే రాంచరణ్ బన్ని లతో నటించింది ఇప్పుడు రాం ఇక తన వరుసలో మహేష్,ntr,పవన్,ప్రభాస్ ఉన్నారు.


Powered by web analytics software.