Free SMS And Earn Part Time Money







11/21/10

తనికెళ్ళ భరణి కి నిన్న తెలుగు ఇండస్ట్రీ అతిరధమహరధులచే వెండి పండగ "వెండితెర వెండి పండగ"

మంచి సాహిత్య వేత్త , నటుడు అందరికి సుపరిచితుడు అయినటువంటి తనికెళ్ళ భరణి కి నిన్న తెలుగు ఇండస్ట్రీ అతిరధమహరధులచే వెండి పండగ జరిగింది తనికెళ్ళ భరణి సినీ ప్రస్థానం 25 సంవత్సరాలు[నవంబర్ 17] పూర్తిచేసుకున్న సంధర్బం గా సంగం అకాడమి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సభ"వెండితెర వెండి పండగ" రవీంద్రభారతి లొ మహఘనంగా జరిగింది


ఈ సభలొ"SP Balasubrahmanyam, Raghavendra Rao, Ramgopal Varma, Paruchuri Brothers, Balakrishna, Prakash Raj, Dr Brahmanandam, Venkatesh, Kota Srinivasa Rao, Giribabu, Muralimohan, Janardhan Reddy, KV Ramanachary, MAA TV Ramakrishna, and Prabha

పాల్గొన్నారు

అందుకు గాను తనికెళ్ళ భరణి కి కనకాభిషేకం జరిగింది ,తనికెళ్ళ భరణి రాసిన పుస్తకాన్ని "నక్షత్ర దర్శనం" ప్రకాష్ రాజ్ ఆవిష్కరించాడు మొదటి పుస్తకం బ్రహ్మనందం అందుకున్నాడు ఈ కార్యక్రమాన్ని బాలక్రిష్ణ మొదలుచేశాడు....!

ఈ సంధర్బమై తనికెళ్ళ భరణి మాట్లడుతూ ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ రచయితకి తన పుట్టినరోజున కనకాభిషేకం చేస్తానని చెప్పాడు.

హీరోకి హీరోయిన్ వాంటెడ్. హీరోయిన్‌కి విలన్ వాంటెడ్. విలన్‌కి హీరో వాంటెడ్. ఇదే ఈ చిత్రం ప్రధాన కథాంశం


గోపీచంద్ కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వెనిగళ్ల ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి "వాంటెడ్" టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా రచయిత బీవీఎస్ రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో దీక్షాసేథ్ కథానాయిక నిర్మాత వెనిగళ్ల ఆనందప్రసాద్ మాట్లాడుతూ... శౌర్యం తర్వాత గోపీచంద్‌తో మేం చేస్తున్న చిత్రమిది. గోపీచంద్ తరహా యాక్షన్‌తోపాటు సినిమా చాలా కొత్తగా, స్టయిలిష్‌గా అనిపిస్తుంది. వాంటెడ్ అనేది ఈ చిత్రానికి యాప్ట్ టైటిల్. ఇందులో హీరోకి హీరోయిన్ వాంటెడ్. హీరోయిన్‌కి విలన్ వాంటెడ్. విలన్‌కి హీరో వాంటెడ్. ఇదే ఈ చిత్రం ప్రధాన కథాంశం. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... లవ్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. గోపీచంద్‌కి ఈ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. మాస్‌తోపాటు యూత్‌కూడా లవ్ చేసే విధంగా ఈ పాత్రను తీర్చిదిద్దుతున్నాం. యువతరం ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. గోపీచంద్ తల్లిదండ్రులుగా జయసుధ, చంద్రమోహన్ నటిస్తున్నారు. ఇందులో ఫ్యామిలీ ఎపిసోడ్ చాలా కొత్తగా వినోదాత్మకంగా అనిపిస్తుంది అని చెప్పారు

Nagababu Exclusive Interview

ఏ విషయంలోనైనా ధైర్యంగా పోరాడాలని, అలాంటప్పుడే ముందుకుసాగుతామని నాగబాబు అంటున్నారు. తాజాగా మగధీర ఫేమ్‌ రామ్ చరణ్‌తో ఆరెంజ్‌ సినిమా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగబాబుతో శనివారం జరిపిన ఇంటర్వ్యూ మీ కోసం..

ప్రశ్న : ఆరెంజ్ అంటే ఏమిటి?
జ : ఇది ఒక రంగును సూచిస్తుంది. మనకు ఇంద్రధనుస్సులో ఏడు వర్ణాలు తెలుసు. అందులో తెలుపుకు విశిష్ట స్థానముంది. శాంతికపోతమది. అలాగే ఒక్కో ఎమోషన్స్‌కు ఒక్కో వర్ణం. చక్కని భావానికి ఆరెంజ్ చిహ్నం. ఆ భావం ఏమిటినేది సినిమా. ఆరెంజ్ తింటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందే సినిమా కూడా అలానే ఉంటుంది.

ప్రశ్న : బ్యాక్‌డ్రాప్ విదేశాల్లో తీయడానికి కారణం?
జ : కథాపరంగా అక్కడ తీయాల్సివచ్చింది.. కనుకనే ఆస్ట్రేలియాలో తీశాం. 75% షూటింగ్ అక్కడే జరిగింది.

ప్రశ్న : ఇటీవలే ఆసీస్‌లో మన భారతీయులపై దాడి జరిగాయి. మీ అంచనాలతో అక్కడి వాతావరణం ఎలా ఉందో చెప్పండి?
జ : అక్కడ ఏ విషయం గమనించాం. అక్కడ సెటిల్ అయిన లెబనాన్‌కు, మనదేశంలోని పంజాబీయులకు గొడవలు జరుగుతుంటాయట. మిగిలిన వారు బాగానే ఉన్నారు. కానీ మన షూటింగ్‌కు ఎటువంటి ఇబ్బంది జరగలేదు.

ప్రశ్న : మగధీర తర్వాత వస్తున్న చిత్రంపై ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ : మగధీర మెసర్మేజ్ చేసింది. అంతటి రేంజ్‌నుంచి బయటపడాలంటే కొత్తగా మరో కోణంలో చూపించాలని ట్రైచేశాం. పవన్‌కళ్యాణ్ ఖుషి చిత్రంలా హాయిగా ఎంజాయ్‌గా ఉంటుంది. మగధీర షూటింగ్‌లోనే చరణ్ నాకు ఇలాంటి కథతో చేయాలనుకున్నాడు. అప్పుడు భాస్కర్ కథ చెప్పాడు.

ప్రశ్న : హరీష్‌జైరాజ్‌ను తీసుకోవడానికి కారణం?
జ : గత చిత్రాల్లో ఆయన బాగా ట్యూన్స్ ఇచ్చాడు. మంచి సంగీత దర్శకుడు. ఇందులో ఆరు పాటలు అద్భుతంగా ఇచ్చాడు. ఆడియో హిట్ అయ్యింది.

ప్రశ్న : యూత్‌ను టార్గెట్ చేసి తీశారా?
జ : యూత్‌నే కాదు. మహిళలను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతివారిని ఐడెంటిఫై చేసుకునేలా ఉంటుంది. మహిళలు హీరోయిన్‌ను అన్వయించుకుంటే పురుషులు హీరోను అన్వయిస్తారు. మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి.

ప్రశ్న : ఇటీవల చిరంజీవి చరణ్ ఫైట్స్, డాన్స్ బాగా చేశారన్నారు? అది నిజమేనా?
జ : ఎందుకొచ్చింది ఈ అనుమానం. తండ్రిగా ఆయన అలా స్పందించారు. నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ స్పందించాను. ఫైట్స్ రియల్‌గా చేశాడు. క్లైమాక్స్‌ రైలు ఫైట్, 14వేల అడుగుల నుంచి జంప్ చేయడం, దానికి తగిన విధంగా ప్రికాషన్స్ తీసుకుని చరణ్‌తో పాటు జెనీలియా కూడా జంప్ చేసింది. అక్కడి ఫైట్‌మాస్టర్ హారిస్ డెకెలెస్ కూడా మెచ్చుకున్నారు. ఏదైనా ధైర్యం ఉంటేనే చేయగలరు. చరణ్ ధైర్యవంతుడు. స్కై డైవ్ అనేది ఎడ్వంచర్ క్రీడ. దాన్నికూడా నేర్చుకుని చేశాడు.

ప్రశ్న: బడ్జెట్‌పై భారీ అంచనాలున్నాయి?
జ: మగధీర కంటే చాలా తక్కువ అయ్యింది. గ్రాఫిక్స్ పెద్దగా లేవు. భాస్కర్‌కు చరణ్‌కు హ్యాట్రిక్ చిత్రమవుతుందని చెప్పగలను.

ప్రశ్న : ఇటీవల ఇండస్ట్రీలో విజయాలు తగ్గడానికి కారణం?
జ : ప్రతి ఏడాదీ పరిశీలిస్తే సక్సెస్‌‌లు పది శాతం మించడంలేదు. కానీ ఈ ఏడాది బాగానే ఉన్నాయి. లేటెస్ట్‌గా బృందావనం, రోబో చిత్రాలు విజయవంతమయ్యాయి.

ప్రశ్న : తెలుగు సినిమా భారతీయ అవార్డు స్థాయికి రాకపోవడానికి కారణం?
జ : ఒక్కటే కారణం. మన చిత్రాల గురించి అక్కడి వారికి సరైన అవగాహన లేకపోవడం. మనవారు కూడా అక్కడ కమిటీలో మెంబర్లుగా ఉంటే మంచి చిత్రాలు సెలక్ట్ అవుతాయి. తీసినవన్నీ మంచి సినిమాలే. వారి రూల్స్ ఏమిటో ఒక్కోసారి అర్థంకాదు. ఇదే కాదు. ఇంటర్నేషనల్ ఫిలింస్ రూల్స్ కూడా మనకు అర్థంకావు. గతంలో పోలిస్తే తెలుగులో మంచి చిత్రాలే వస్తున్నాయి.

ప్రశ్న : మీ వారసుడు వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి?
జ : ప్రస్తుతం మా అబ్బాయి వరుణ్ తేజ్ డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఏక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. వరుణ్ సినిమాల్లోకి రావాలంటే దాదాపు ఏడాదికి పైగా పడుతుంది. 2012లో రావచ్చు.

ప్రశ్న : మీ Bannerలో ఫ్యామిలీ హీరోలేనా.. లేక..?:
జ : బయటి హీరోలతో కూడా చేస్తాను. కథలు సెట్ అయ్యాక చేస్తాం. ప్రస్తుతం అర్జున్, పవన్‌కళ్యాణ్‌తో చేయబోతున్నాను. వివరాలు త్వరలో తెలియజేస్తాం.
Powered by web analytics software.