Free SMS And Earn Part Time Money







7/19/09

శివ రీమెక్ లో నాగర్జున తనయుడు



నాగార్జున హీరోగా, రామ్‌గోపాల్‌ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని వెంకట్‌ 'శివ' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు ఈ సినిమా స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది.

మళ్ళీ అదే చిత్రాన్ని నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో రీమేక్ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి జె.డి. చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం జె.డి. చక్రవర్తి నాగచైతన్య నటిస్తోన్న 'జోష్‌'లో కీలక పాత్ర పోషించారు. ఇంకా "జోష్" చిత్రంలో నటి రాధ పెద్ద కుమార్తె కార్తీక హీరోయిన్‌గా నటిస్తోంది. వాసువర్మ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ గోల్డ్ హ్యాండ్ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం చేపట్టా
రు





'శంకరాభరణం', 'శృతిలయలు' లా తీద్దామనుకుని కలవరపడ్డారు



'శంకరాభరణం', 'శృతిలయలు' వంటి సినిమాలు తీసే రోజులా ఇవి?(ఒకవేళ తీసినా ఆ స్థాయి సంగీతం సపొర్ట్ లేకుండా......) కావనుకునే కళాతపస్వి కె.విశ్వనాథ్ కెమెరా వెనక్కి వెళ్లడం మానేశారు. 'రాధాగోపాళం', 'సుందరాకాండ' వంటి చేదు అనుభవాలు బాపూకి కూడా తప్పలేదు. విశ్వనాథ్ సినిమాలా తన తాజా చిత్రం ఉందని అనిపిస్తే అందుకు గర్విస్తానని దర్శకుడు సతీష్ కాసెట్టి ముందే చెప్పుకొచ్చారు. అయితే విశ్వనాథ్ తీసిన నాలుగైదు సినిమాల ఇన్ ఫ్లుయెన్స్ సతీష్ తీసిన 'కలవరమేయే మదిలో' చిత్రంపై కనిపిస్తుంది. అనాటి కళాఖండాలను గుర్తుచేసే ప్రయత్నం పొరపాటు కాదు. అయితే అలాంటి 'మిక్సింగ్'తో సినిమా తీసినంత మాత్రాన సరిపోదు. ఇవాల్టి యువతరం నాడిని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే పనితనం, సన్నివేశాల బలం వంటివి అనివార్యం. వీటికి కనెక్టివిటీగా వినోదం అనేది కూడా తగిన మోతాదులో ఉండాలి. ఉదాహరణకు కథానాయిక హీరో మహేష్ వీరాభిమాని అనే పాయింట్ మీదే సినిమా మొత్తం నడిపి వినోదాల పంట పండించిన 'అష్టాచమ్మ'ను చెప్పుకోవచ్చు. అందులో కథానాయిక స్వాతి చేసిన అల్లరి సినిమాను విజయపథంలోకి తీసుకెళ్లింది. అదే స్వాతి ఇప్పుడు 'కలవరమాయే మదిలో' అన్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అలాంటి స్పాంటేనియస్ అల్లరి, చిలిపిదనాన్నే ఆశించడం సహజం. ఆరంభంలో స్వాతి తనను తాను పరిచయం చేసుకుంటూ తన ఆశలు, ఆశయాలు గడగడా చెప్పేస్తుంటే...ఇంకేం...బోలెడంత ఎంటర్ టైన్ ఇందులోనూ ఉంటుందనే అభిప్రాయం కలుగుతుంది. కొంతసేపు అలాంటి నడకే నడిచినా ఆ తర్వాత స్వాతి ఒకదాని వెంట మరో కష్టాల కలవరంతో అల్లల్లాడుతుంది. ఆ కష్టాలు చూసి అనుకొన్నదొకటి..అయినది మరొకటి అనే 'కలవర' పాటు వీక్షకులకూ సో(పా)కుతుంది. శ్రేయ (స్వాతి) తన తల్లి (ఢిల్లీ రాజేశ్వరి)తో కలిసి ఉంటూ ఓ ఆడిట్ ఆఫీసులో పనిచేస్తుంటుంది. శ్రేయకు పాడటం అంటే ప్రాణం. ఎప్పటికైనా ఎ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ లో తాను పాడాలనేది ఆమె డ్రీమ్. అయితే శ్రేయ తల్లికి మాత్రం శ్రేయ సింగర్ కావాలనుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకు ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది లెండి. అమ్మ కోసం జాబ్ చేస్తూ డబ్బుల సంపాదన కోసం ఓ స్టార్ హోటల్ లో శ్రేయ పాటలు పాడుతుంటుంది. లండన్ తిరిగి స్వదేశానికి వచ్చిన శ్రీను (కమల్ కామరాజు) ప్రతిరోజూ ఆ హోటల్ లో శ్రేయ పాట వింటుంటాడు. అందరూ చప్పట్లు కొట్టినా అతను మాత్రం సైలెంట్ గా ఉండిపోతుంటాడు. ఇది శ్రేయకు నచ్చదు. అతనితోనే అమీతుమీ తేల్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా పరిచయం పెరుగుతుంది. శ్రేయ ఆశయానికి అతను ప్రోత్సాహం అందిస్తుంటాడు. సంగీత విద్యాంసుడైన రావు (విక్రమ్ గోఖలే) ఒకరోజు తన సహచరుడైన శాస్త్రితో (తనికెళ్ల భరణి) కలిసి ఆ హోటల్ కు వచ్చి శ్రేయ పాట వింటాడు. ఆగ్రహంతో ఊగిపోతూ 'నువ్వు పాడేది కూడా ఓ పాటేనా?' అని గద్దిస్తాడు. దీంతో శ్రేయ చిన్నబోతుంది. తనకు పాడటమే రాదన్న రావు వద్దే సంగీతం నేర్చుకోవాలని శ్రేయ నిశ్చయించుకుంటుంది. అయితే ఆమె కోరికను రావు తోసిపుచ్చుతాడు. సంగీతం నేర్పేదిలేదంటాడు. శాస్త్రిని మంచి చేసుకుని పనిపిల్లగా రావు ఇంట్లోకి శ్రేయ అడుగుపెడుతుంది. ఒకవైపు శాస్త్రిని ఒప్పించేందుకు పడేపాట్లు, మరోవైపు శ్రీనును ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంటుంది. షడన్ గా స్టోరీలో ఓ ఊహించని 'మలుపు' చోటుచేసుకుంటుంది. ఇక స్టోరీ ట్రాక్ మారుతుంది. శ్రేయను కలవర పరచిన ఆ ట్విస్ట్ ఏమిటి? రెహ్మాన్ కంపోజిషన్ లో పాడాలనే శ్రియ డ్రీమ్ ఎలా నెరవేరిందనేది మిగతా కథ.



మంచుమనోజ్ ప్రయాణం ఎంతవరకో యస్.యం.యస్,చేయండి56006767కి

మంచు మనోజ్కుమార్ హీరోగా కథకుడు వీరు పోట్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుంకర రామబ్రహ్మం ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం రెండవ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాతో షీనా హీరోయిన్గా పరిచయవుతోంది. చిత్రం ప్రోగ్రెస్ను నిర్మాత వివరిస్తూ 'ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తయింది
.
మనోజ్ కుమార్ తన నిజ జీవితంలో లాగా సరదగా, చలాకీగా ఉండే కుర్రాడిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు,వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది.
ఈ చిత్రానికి (ఎ) అజయ్ గాడి విజయగాథ, (బి) బిందాస్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండు టైటిల్స్ లో ప్రేక్షకులు దేనికి ఎక్కువ ఓటేస్తే ఆ టైటిల్ ఖరారు చేస్తారట. ఇందుకోసం ఎ కానీ బి కానీ టైప్ చేసి 56006767 నెంబర్ కు ఎస్.ఎం.ఎస్.చేయాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. విజేతలకు బహుమతులు కూడా అందజేస్తారు. యూత్ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రుపొందుతోంది.మనోజ్ దర్శకుల హీరో అనీ వీరుపోట్లఅతనితో చేసిన ప్రతి దర్శకుదు తెగ పొగుడుతున్నారు.ఈ సినిమాలో మనోజ్ పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉండబోతోంది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ తారాగణం ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం వీరుపోట్ల అందిస్తున్నారు, భవనచంద్ర పాటలు, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, బోబో శశి సంగీతం అందిస్తున్నారు.ప్రయాణంతో మంచి హిట్ వస్తుందీనుకున్న రాలేదు మరి ఈ సినిమా ప్రయాణం ఎంతవరకో చూసిన తరువాతగాని చెప్పలేం.
Powered by web analytics software.