7/9/09
గోపి గోపిక గోదావరి (వంశి) స్టోరి లైన్
వరుడు సినిమా రెండో హీరోయిన్
ఒయ్ చిత్రం రివ్యు- గీతాంజలి ఇన్స్పిరేషన్
చిత్రం చూస్తుంటే గీతాంజలి సినిమా గుర్తుకువస్తుంది. ఆ చిత్రమే లవ్‌స్టోరీపేరుతో వచ్చింది. దానికి కాస్త మెరుగులు దిద్ది "ఓయ్" అనే పేరుపెట్టినట్లుంది. ఇందులో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లు కూడా సరిపోయేవిధంగా పెట్టారు. ఉదయించే సూర్యుడు హీరో, అస్తమించే అమ్మాయి సంధ్య. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ ప్రయాణం ఎంతవరకు వచ్చింది? అనేది సినిమా. ఇక కథలోకి వెళితే.. ఉదయ్ (సిద్ధార్థ) ఓ ఉన్నత వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. ఇద్దరి ఆలోచనలు వైవిధ్యమే. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వ్డ్ మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా. విశ్లేషణ: ముందుగా షామిలీ గురించి చెప్పుకోవాలి. "జగదేకవీరుడు అతిలోక సుందరి"లో నటించిన షామిలీకి యుక్తవయస్సు వచ్చిన షామిలీకి చాలా తేడా ఉంది. ఈనాటి హీరోయిన్ల తరహాలోకాకుండా సాంప్రదాయంగా వచ్చే పాత్రలకు ఆమె సూటవుతుంది. పాత్రపరంగా వ్యాధి ఉన్నది కాబట్టి దానికి చక్కగా సరితూగింది. నటనాపరంగా బాగానే చేసింది. ఆమెకు మించి సిద్ధార్థ నటనలో రాణించాడు. మణిరత్నం శిష్యుడు నుంచి హీరోగా ఎదిగిన సిద్ధార్థ ఒక్కో చిత్రంలో తన నటనను అద్భుతంగా ప్రదర్శిస్తుంటాడు. మొదటిభాగమంతా అల్లరి అల్లరిగా ఉండే సిద్ధార్థ సెకండాఫ్‌లో కాస్త భిన్నంగా కనిపిస్తాడు. ఆ పాత్ర తీరు బాగుంది. వ్డ్ ఇక రావికొండలరావు, రాధాకుమారి జంట కాస్త చికాకు తెప్పిస్తుంది. సునీల్ కామెడీ ఆకట్టుకుంది. అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలో సురేఖావాణి, భరణి నటించారు. సాంకేతికపరంగా చక్రవర్తి పనితం ప్రతిఫేమ్‌లో చక్కగా కన్పించింది. మణిరత్నం శిష్యుడుగా దర్శకుడు ఆనంద్ ఆయన బాటలో పయనిస్తున్నాడు. ఎడిటింగ్‌లో కాస్త జాగ్రత్త తీసుకుంటే సెకండాఫ్ ఎక్కువగా అనిపించేది కాదు. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సిద్ధార్థ డైరక్షన్‌లో ఇన్‌వాల్వ్ అయినట్లు కన్పిస్తోంది. ఆల్‌రెడీ గతంలో చుక్కల్లో చంద్రుడు చిత్రానికి దర్శకత్వంలో సిద్ధార్థ ఇన్‌వాల్వ్ కావడంతో ఆ చిత్రాన్ని కాస్త చెడగొట్టాడనే పేరుంది. ఈ నేపథ్యంలో "ఓయ్" చిత్రం మొదటి భాగంలో ఆ ఛాయలు కన్పిస్తాయి. సంభాషణల పరంగా బోర్‌గా లేకుండా ఉన్నాయి. షామిలీ తొలి చిత్రం కావడంతో, సిద్ధార్థ హీరో కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. చూసిన ప్రేక్షకుడు మాత్రం కాస్త నిరాశకు గురవుతాడు. మరి "ఓయ్" ఎంతకాలం ఆడుతుందో వేచి చూడాల్సిందే..!.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |