Free SMS And Earn Part Time Money







9/19/09

అల్లు అరవింద్‌ చేసిన విజ్ఞప్తిని రాజమౌళి తిరస్కరన


మగధీర' నిర్మాత అల్లు అరవింద్‌కు చుక్కెదురైంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించడే కాకుండా, గీతా ఆర్ట్స్ సంస్థ లోగడ నిర్మించిన చిత్రాలకే తలమానికంగా నిలిచేలా చేసిన ఘనత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిది.

అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రోడ్యూసర్లలో ఒకడిగా వెలుగొందున్న అల్లు అరవింద్‌ చేసిన విజ్ఞప్తిని రాజమౌళి తిరస్కరించడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 42 కోట్ల రూపాయల వ్యయంతో 'మగధీర' చిత్ర నిర్మాణానికి వెచ్చిందేందుకు నిర్మాత అల్లు ముందుకు వచ్చారంటే అది రాజమౌళిపై ఉన్న నమ్మకమే.

అయితే, అలాంటి నిర్మాత చేసిన కోరిన కోర్కెను రాజమౌళి తీర్చేందుకు నిర్ద్వంధంగా తోసిపుచ్చడం వెనుక గల ఆంతర్యమేమిటని ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ.. అల్లు అరవింద్ కోరిన కోర్కె ఏమిటో తెలుసా..? 'మగధీర' చిత్రాన్ని హిందీలో పునర్మించేందుకు దర్శకత్వ బాధ్యతలను చేపట్టాలని రాజమౌళిని కోరారట.

దీనిపై స్పందించిన దర్శకుడు.. వీలు పడదని నిర్మొహమాటంగా తేల్చి చెప్పారట. ఇందులో తిరకాసు కూడా లేకపోలేదు. 'మగధీర' ఆడియో హక్కులను సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణి కోరగా అల్లు అరవింద్ తిరస్కరించి ఆదిత్య మ్యూజిక్‌కు కట్టబెట్టారనే కోపం రాజమౌళిలో ఉందని అందుకే ఆయన ఈ విధంగా అల్లుపై పగ తీర్చుకున్నారని ఫిల్మ్‌నగర్ వాసులు గుసగుసలాడుతున్నారు





ఈనాడు" చిత్ర సారాంశం"రొటీన్ చిత్రంలా ఉండదు"


Kamal
నటీనటులు: కమల్‌హాసన్, వెంకటేష్, లక్ష్మీ, డా.భరత్ రెడ్డి తదితరులు,
నిర్మాతలు: కమల్స రోని స్క్రూవాలా,
దర్శకుడు: చక్రి తోలేటి.
విడుదల 18.09.09.

పాయింట్: మనిషిలో రెండు కోణాలుంటాయి. అలా సగటుజీవిలో ఉండే రెండో కోణంలో సమాజశ్రేయస్సుకై ఎంతకైనా తెగిస్తాడు? అనేదే "ఈనాడు" చిత్ర సారాంశం.

ఈ చిత్ర కథ అందరికీ తెలిసిందే. హిందీలో విజయవంతమైన "ఎ వెడ్నెస్‌డే"కి ఇది రీమేక్. తెలుగులో "ఈనాడు"గా రూపొందిన ఈ సినిమా రొటీన్ చిత్రంలా ఉండదు. పాటలు, ఫైట్లు ఉండవు. ప్రేమ ఉంటుంది. అయితే అది ప్రజలపై ప్రేమ.

కొంతమంది అరాచకశక్తులు అమాయకుల ప్రాణాల్ని తృణప్రాయంగా తుంచుకుంటే.. కనసీ బాధ్యతగా వారిని అదుపుచేయాల్సిన పోలీసు, రాజకీయ యంత్రాంగం చేస్తుందని ప్రశ్నిస్తూ.. ఒక సామాన్య మానవుడు తలచుకుంటే ఏదైనా చేస్తాడని నిరూపించే ప్రయత్నం. ఇదొక డాక్యుమెంటరీగానో, హాఫ్‌బీట్ ఫిలింగానో ఉన్నా.. సామాన్యుడిని కూడా ఆలోచించేలా చేస్తోంది.

ఇక కథలోకి వెళితే.. హైదరాబాద్‌లో సామాన్య మానవుడు బందన్‌వాలా (కమల్ హాసన్) ఓ నల్లటి బ్యాగ్‌తో బస్ ఎక్కి అక్కడే ఉంచి దిగిపోతాడు. ఆ తర్వాత లక్‌డీకాపూల్ పోలీస్‌స్టేషన్‌లో తన పర్సు పోయిందని, అందులో 500 రూపాయలు, క్రిడిట్ కార్డులున్నాయని కంప్లెంట్ ఇస్తాడు.

ఈ వివరాలు రాసుకున్న అధికారి.. పర్సు దొరికిన వెంటనే తెలియజేస్తానంటాడు. తర్వాత కమల్ హాసన్ బాత్‌రూమ్ ఎక్కడా అని అడిగి, అక్కడికి వెళ్ళి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వస్తాడు. బస్సు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఇలా పలుచోట్ల బ్యాగ్‌లు పెడతాడు. అతనికి కంప్యూటర్ టెక్నాలజీ గురించి బాగు తెలుసు.
Venkatesh



సిటీలో అప్పుడే కడుతున్న పెద్ద భవింతి పైభాగానికి ఎక్కి కంప్యూటర్ ఫోన్‌కనెక్షన్లు పెట్టి.. పోలీస్ కమీషనర్ ఈశ్వరప్రసాద్ (వెంకటేష్)కు ఫోన్‌చేసి లక్‌డీకాపూల్ పోలీస్ స్టేషన్‌లో బాంబు పెట్టానంటాడు. ఆ విషయాన్ని నమ్మించడానికి ఓ టీవీ రిపోర్టర్‌ను ఆహ్వానిస్తాడు. ఆమె లైవ్‌షోను చూపిస్తుంది. ఆ తర్వాత మరో ఐదు ప్రాంతాల్లో పెట్టానని చెబుతాడు. ఎందుకు పెట్టానో చెప్పాలంటే.. నాతో సంబంధిత అధికారి మాట్లాడాలంటాడు.

దీంతో ముఖ్యమంత్రి పి.ఎ. లక్ష్మి ముదుకు వచ్చి తను బాధ్యత తీసుకుంటానంటుంది. కానీ ఆమెకు భయమేస్తుంది. దాంతో అన్ని బాధ్యతలను ఈశ్వరప్రసాద్ తీసుకుంటాడు.

ఇలా బందన్‌వాలా 5, 10 నిమిషాలు, ఒక గంట టైమ్ చెబుతూ.. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ ఇలా సిటీలో పలు ప్రాంతాల్లో బాంబు విధ్వంసం సృష్టించి ఎంతోమంది చావుకు కారణమైన టెర్రరిస్టులు రహతుల్లా, అహమతుల్లా, ఇన్సాస్ ఇలా నలుగురిని అప్పజెప్పమంటాడు.

తన డిమాండ్స్ ఏమిటో తర్వాత చెబుతానని అంటాడు. దీంతో సిటీలో అంతా పోలీసు అధికారులు అలెర్ట్ అవుతారు. మరోవైపు ఈ ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో ట్రేస్ చేయడానికి అధికారులు ప్రయత్నించి విఫలమవుతారు. ఈ ఫోన్ నెంబర్లన్నీ బాంబు బ్లాస్ట్‌లో చనిపోయినవారి పేర్లతో తీసినవే. దీంతో చేసేది లేక.. కమల్ చెప్పినట్లుగా నలుగురు తీవ్రవాదుల్ని సాయంత్రం ఐదు గంటలకల్లా ఎయిర్‌పోర్టు తీసుకువస్తారు.

అందుకు సెక్యూరిటీగా ఇద్దరు అధికారులు మాత్రమే ఉంటారు. అక్కడ వారితోనూ, మరోవైపు కమిషనర్ ఆఫీసర్‌తోనూ కమల్ ఒకేసారి మాట్లాడతాడు. తన డిమాండ్స్ చెబుతానని.. అక్కడే ఉన్న ఓ కారులో నలుగురు తీవ్రవాదుల్ని ఎక్కమంటాడు.

అనుకున్నట్లు ఆ నలుగురు జీప్ దగ్గరకు వెళుతుండగా.. ఓ పోలీసు అధికారికి అనుమానం వచ్చి.. అందులో ఒకడిని ఆపేస్తాడు. ఎందుకంటే.. అందరినీ వదిలేస్తే.. తర్వాత సిటీలో బాంబులు ఎక్కడపెట్టాడో చెప్పకపోతే..? అనే అనుమానంతో.. కానీ అప్పటికే ముగ్గురు జీపు ఎక్కుతారు. వెంటనే ఫోన్ మోగుతుంది. జీపులో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయగానే.. జీప్ పేలుతుంది. దీంతో అక్కడి అధికారులు, కమిషనర్ అవాక్కవుతారు.






కానీ నాలుగో వ్యక్తి చనిపోలేదని తెలుసుకున్న కమల్.. వాడిని చంపితేనే నేను మరిన్ని వివరాలు చెబుతానంటాడు. అలా నాలుగవ టెర్రరిస్టు కూడా చనిపోతాడు. ఆ తర్వాత కమల్ ఏం చెప్పాడు? కమల్ ఎక్కడ నుంచి ఫోన్‌లో ఇదంతా చేశాడు? అన్నది మిగిలిన సినిమా.

విశ్లేషణ: ఇందులో కమల్ పాత్ర కీలకం. సమాజపాలన వ్యవస్థపై కోపం, కసి, ద్వేషం ఉంటే సగటు జీవి ఎలా స్పందిస్తాడనేది చక్కగా చూపాడు. ఉగ్రవాగులు ఎంతోమందిని చంపేస్తే వారికి శిక్ష పడనీయకుండా రోజులపాటు కాలక్షేపం చేస్తూ.. ధనాన్ని, సమయాన్ని వృధాచేస్తున్నాయని, అదే ఉగ్రవాదుల్ని సామాన్యుడు ఎందుకు చంపకూడదని ప్రశ్నిస్తాడు.

రాజకీయనాయకుల వల్లే ఈ వ్యవస్థ ఇంత అద్వానంగా తయారైందంటాడు. ఇంట్లో బొద్దింకలు వస్తే వాటిని చంపేస్తాం. అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తున్న చీడపురుగుల్ని చంపేయడంలో తప్పేంటని ప్రశ్నిస్తాడు.

ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారిలో ఎవ్వరూ తనవారు కాదు. కానీ సగటుజీవిగా ఓ నిండు గర్భిణికి జరుగుతున్న అన్యాయాన్ని అక్కడి ప్రజలు, పోలీసులు కళ్ళప్పిగించి చూశారో చెప్పే విధానంలో.. కమల్ నటన అద్భుతం. మిగతా నటనంతా మామూలే. వెంకటేష్ పోలీస్ కమీషనర్‌గా బాగానే చేశాడు. ఇతర పాత్రలన్నీ కొత్తవే.

సంభాషణల పరంగా నీలకంఠ బాగానేరాశారు. మాటలు పొందికగా ఉన్నాయి. కమల్ కూతురు శ్రుతిహాసన్ అందించిన సంగీతం సరిపోయింది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే ఈ చిత్రాన్ని ముందుగానే హిందీలో చూసినవారికి "ఈనాడు" పెద్దగా అనిపించదు. ఎందుకంటే హిందీలో ఉన్నంత ఉత్కంఠతను తెలుగు ఈనాడులో తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం కాలేకపోయారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.


ముద్దుగుమ్మలు కాలు జారడం

సాధారణంగా సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడే ముద్దుగుమ్మలు కాలు జారడం సహజమని అంటుంటారు. అపుడే వారికి అవకాశాలు వస్తాయన్నది సినిమావాళ్ల వాదన. అయితే, కొంతమంది హీరోయిన్లు మాత్రం.. ఏ ఒక్కరికీ లొంగకుండా, కాలు జారకుండా అవకాశాలు సంపాదించుకుంటున్నామని బయట ప్రగల్భాలు పలుకుతుంటారు.

ఇలాంటి వారి కోవలో అయేషా టకియా ఒకరు. నాగార్జున "సూపర్" చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తాను అలాంటిదాన్ని కాదని ఢంకా బజాయిస్తోంది.

సినిమా అవకాశాల కోసం తాను ఎనాడూ ఎవరికీ లొంగలేదని చెపుతోంది. ఇప్పటివరకూ వివిధ పరిశ్రమల్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరికీ తను తలవంచలేదనీ, తాను కన్యగానే ఉన్నానని చెపుతోంది. తన కన్యత్వాన్ని తన భర్తకి పరిపూర్ణంగా సమర్పించాలన్న లక్ష్యంతో దాన్ని కాపాడుకుంటూ వస్తున్నానని చెపుతోంది. ఇది నిజమేనా అని.. ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎందుకంటే.. తన తొలి చిత్రం "సూపర్‌"లోనే తాను చేసిన అంగాంగ ప్రదర్శన "సూపర్" అని ప్రేక్షకులు చర్చించుకున్న విషయం తెల్సిందే.


విజయవాడలో 'ప్రస్థానం'


శర్వానంద్, రూబీ జంటగా దేవా కట్టా ('వెన్నెల' ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప్రస్థానం'. విఆర్ సి మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విజయవాడలో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

చిత్ర విశేషాలను రవి వల్లభనేని తెలియజేస్తూ, విజయవాడ సిటీ, పరిసర ప్రాంతాలైన మానికొండ, పెనుమాక, చల్లపల్లి, కూచిపూడిలలో మూడు వారల జరిపిన తాజా షెడ్యూల్ లో రెండు పాటలతో పాటు ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ సినిమా ఇతివృత్తం విజయవాడ నేపథ్యానికి చక్కగా సరిపోతుందని దర్శకుడు దేవ్ కట్టా చెప్పారు. యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ సమపాళ్లలో ఉంటూ సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమిదని తెలిపారు. కథ, కథనాలతో పాటు చక్కటి సాంకేతిక విలువలతో చిత్రం రూపొందుతోందన్నారు. నటుడిగా తృప్తి నిచ్చే పాత్రను ఇందులో పోషిస్తున్నాయనీ, సాయికుమార్ అనగానే ఇందులోని పాత్ర అందరికీ గుర్తిండిపోతుందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పరిహార్, 'వెన్నెల' కిషోర్, జయప్రకాష్ రెడ్డి, జీవా, పవిత్ర, లోకేష్, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. శామ్ దత్ సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.





విక్రమ్ సరసన ఓ సినిమాలో

మా' టీవీలో కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయిన స్వాతి, కృష్ణవంశీ దర్శకత్వంతో వచ్చిన 'డేంజర్' చిత్రం ద్వారా కథానాయిగా పరిచయమయింది. అటుపై 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో పూజగా వెంకటేష్ వెంట పడే అమ్మాయిగా నటించి మెప్పించింది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న స్వాతికి కోలీవుడ్ నుండీ పిలుపు వచ్చింది. తమిళ నటుడు 'జై' సరసన 'సుబ్రమణ్యపురం' చిత్రంలో నటించి తన హావభావాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు లో కూడా 'అనంతపురం 1980' పేరుతో డబ్ అయింది.

తెలుగులో ఆమె 'మహి మహి' అంటూ అల్లరి చేసిన 'అష్టాచెమ్మా' చిత్రం చిన్న సినిమాగా విడుదలయి పెద్ద విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ఆమెకు ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఇటీవలే విడుదలయిన 'కలవరమాయే మదిలో' చిత్రంలో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక పై మంచి స్క్రిప్ట్ వస్తేనే సినిమాలు చేస్తానన్న స్వాతి కలనిజమవబోతోంది. విశ్వసనీయ కథనం ప్రకారం స్వాతి 'చియాన్' విక్రమ్ సరసన ఓ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. దీనికి 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', '7/g బృందావన కాలనీ' లాంటి హిట్ సినిమాల దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే
కాకుండా 'సుబ్రమణ్యపురం' ఫేం 'జై' సరసన కూడా ఓ చిత్రంలో నటించబోతోంది.



వై.ఎస్.మహా ప్రస్థానం


దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రాజశేఖర రెడ్డి పేరుతో పూరీ జగన్నాధ్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చరిత్రపై 'వై.ఎస్.మహా ప్రస్థానం' టైటిల్ తో మరో చిత్రం తయారుకానుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల(సెప్టెంబర్) 21 వ తేదీన చేవెళ్ళలో ప్రారంభం కానుంది. 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీన వై.ఎస్.మహా ప్రస్థానం పేరిట చేవెళ్ళ నుంచి పాదయాత్రను ప్రారంభించి 1400 కిలోమీటర్లు పాదయాత్రను ఆయన కొనసాగించి ఇచ్ఛాపురంలో ముగించారు. దాంతో ఆ విషయం ప్రధానాంశంగా శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత డి.సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.దర్శకుడు ఆదిత్య రూపొందించనున్న ఈ చిత్రంలో వై.ఎస్ పోలికలు కలిగిన వ్యక్తి కోసం అన్వేషించి చివరకు పిడుగు రాళ్లకు చెందిన జానిబశ ను ఎంపిక చేశారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి పాత్రను అతను పోషించనున్నారు. ఇక పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 'వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి' అనే పేరుతో చిత్రాన్ని నిర్మించనున్న చిత్రంలో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. వీటికి తోడు దర్శకరత్న దాసరి దర్శకత్వంలో వై.ఎస్ పై ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.


Powered by web analytics software.