Free SMS And Earn Part Time Money







9/19/09

ఈనాడు" చిత్ర సారాంశం"రొటీన్ చిత్రంలా ఉండదు"


Kamal
నటీనటులు: కమల్‌హాసన్, వెంకటేష్, లక్ష్మీ, డా.భరత్ రెడ్డి తదితరులు,
నిర్మాతలు: కమల్స రోని స్క్రూవాలా,
దర్శకుడు: చక్రి తోలేటి.
విడుదల 18.09.09.

పాయింట్: మనిషిలో రెండు కోణాలుంటాయి. అలా సగటుజీవిలో ఉండే రెండో కోణంలో సమాజశ్రేయస్సుకై ఎంతకైనా తెగిస్తాడు? అనేదే "ఈనాడు" చిత్ర సారాంశం.

ఈ చిత్ర కథ అందరికీ తెలిసిందే. హిందీలో విజయవంతమైన "ఎ వెడ్నెస్‌డే"కి ఇది రీమేక్. తెలుగులో "ఈనాడు"గా రూపొందిన ఈ సినిమా రొటీన్ చిత్రంలా ఉండదు. పాటలు, ఫైట్లు ఉండవు. ప్రేమ ఉంటుంది. అయితే అది ప్రజలపై ప్రేమ.

కొంతమంది అరాచకశక్తులు అమాయకుల ప్రాణాల్ని తృణప్రాయంగా తుంచుకుంటే.. కనసీ బాధ్యతగా వారిని అదుపుచేయాల్సిన పోలీసు, రాజకీయ యంత్రాంగం చేస్తుందని ప్రశ్నిస్తూ.. ఒక సామాన్య మానవుడు తలచుకుంటే ఏదైనా చేస్తాడని నిరూపించే ప్రయత్నం. ఇదొక డాక్యుమెంటరీగానో, హాఫ్‌బీట్ ఫిలింగానో ఉన్నా.. సామాన్యుడిని కూడా ఆలోచించేలా చేస్తోంది.

ఇక కథలోకి వెళితే.. హైదరాబాద్‌లో సామాన్య మానవుడు బందన్‌వాలా (కమల్ హాసన్) ఓ నల్లటి బ్యాగ్‌తో బస్ ఎక్కి అక్కడే ఉంచి దిగిపోతాడు. ఆ తర్వాత లక్‌డీకాపూల్ పోలీస్‌స్టేషన్‌లో తన పర్సు పోయిందని, అందులో 500 రూపాయలు, క్రిడిట్ కార్డులున్నాయని కంప్లెంట్ ఇస్తాడు.

ఈ వివరాలు రాసుకున్న అధికారి.. పర్సు దొరికిన వెంటనే తెలియజేస్తానంటాడు. తర్వాత కమల్ హాసన్ బాత్‌రూమ్ ఎక్కడా అని అడిగి, అక్కడికి వెళ్ళి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ను అక్కడే వదిలేసి వస్తాడు. బస్సు, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఇలా పలుచోట్ల బ్యాగ్‌లు పెడతాడు. అతనికి కంప్యూటర్ టెక్నాలజీ గురించి బాగు తెలుసు.
Venkatesh



సిటీలో అప్పుడే కడుతున్న పెద్ద భవింతి పైభాగానికి ఎక్కి కంప్యూటర్ ఫోన్‌కనెక్షన్లు పెట్టి.. పోలీస్ కమీషనర్ ఈశ్వరప్రసాద్ (వెంకటేష్)కు ఫోన్‌చేసి లక్‌డీకాపూల్ పోలీస్ స్టేషన్‌లో బాంబు పెట్టానంటాడు. ఆ విషయాన్ని నమ్మించడానికి ఓ టీవీ రిపోర్టర్‌ను ఆహ్వానిస్తాడు. ఆమె లైవ్‌షోను చూపిస్తుంది. ఆ తర్వాత మరో ఐదు ప్రాంతాల్లో పెట్టానని చెబుతాడు. ఎందుకు పెట్టానో చెప్పాలంటే.. నాతో సంబంధిత అధికారి మాట్లాడాలంటాడు.

దీంతో ముఖ్యమంత్రి పి.ఎ. లక్ష్మి ముదుకు వచ్చి తను బాధ్యత తీసుకుంటానంటుంది. కానీ ఆమెకు భయమేస్తుంది. దాంతో అన్ని బాధ్యతలను ఈశ్వరప్రసాద్ తీసుకుంటాడు.

ఇలా బందన్‌వాలా 5, 10 నిమిషాలు, ఒక గంట టైమ్ చెబుతూ.. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్ ఇలా సిటీలో పలు ప్రాంతాల్లో బాంబు విధ్వంసం సృష్టించి ఎంతోమంది చావుకు కారణమైన టెర్రరిస్టులు రహతుల్లా, అహమతుల్లా, ఇన్సాస్ ఇలా నలుగురిని అప్పజెప్పమంటాడు.

తన డిమాండ్స్ ఏమిటో తర్వాత చెబుతానని అంటాడు. దీంతో సిటీలో అంతా పోలీసు అధికారులు అలెర్ట్ అవుతారు. మరోవైపు ఈ ఫోన్లు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నాయో ట్రేస్ చేయడానికి అధికారులు ప్రయత్నించి విఫలమవుతారు. ఈ ఫోన్ నెంబర్లన్నీ బాంబు బ్లాస్ట్‌లో చనిపోయినవారి పేర్లతో తీసినవే. దీంతో చేసేది లేక.. కమల్ చెప్పినట్లుగా నలుగురు తీవ్రవాదుల్ని సాయంత్రం ఐదు గంటలకల్లా ఎయిర్‌పోర్టు తీసుకువస్తారు.

అందుకు సెక్యూరిటీగా ఇద్దరు అధికారులు మాత్రమే ఉంటారు. అక్కడ వారితోనూ, మరోవైపు కమిషనర్ ఆఫీసర్‌తోనూ కమల్ ఒకేసారి మాట్లాడతాడు. తన డిమాండ్స్ చెబుతానని.. అక్కడే ఉన్న ఓ కారులో నలుగురు తీవ్రవాదుల్ని ఎక్కమంటాడు.

అనుకున్నట్లు ఆ నలుగురు జీప్ దగ్గరకు వెళుతుండగా.. ఓ పోలీసు అధికారికి అనుమానం వచ్చి.. అందులో ఒకడిని ఆపేస్తాడు. ఎందుకంటే.. అందరినీ వదిలేస్తే.. తర్వాత సిటీలో బాంబులు ఎక్కడపెట్టాడో చెప్పకపోతే..? అనే అనుమానంతో.. కానీ అప్పటికే ముగ్గురు జీపు ఎక్కుతారు. వెంటనే ఫోన్ మోగుతుంది. జీపులో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేయగానే.. జీప్ పేలుతుంది. దీంతో అక్కడి అధికారులు, కమిషనర్ అవాక్కవుతారు.






కానీ నాలుగో వ్యక్తి చనిపోలేదని తెలుసుకున్న కమల్.. వాడిని చంపితేనే నేను మరిన్ని వివరాలు చెబుతానంటాడు. అలా నాలుగవ టెర్రరిస్టు కూడా చనిపోతాడు. ఆ తర్వాత కమల్ ఏం చెప్పాడు? కమల్ ఎక్కడ నుంచి ఫోన్‌లో ఇదంతా చేశాడు? అన్నది మిగిలిన సినిమా.

విశ్లేషణ: ఇందులో కమల్ పాత్ర కీలకం. సమాజపాలన వ్యవస్థపై కోపం, కసి, ద్వేషం ఉంటే సగటు జీవి ఎలా స్పందిస్తాడనేది చక్కగా చూపాడు. ఉగ్రవాగులు ఎంతోమందిని చంపేస్తే వారికి శిక్ష పడనీయకుండా రోజులపాటు కాలక్షేపం చేస్తూ.. ధనాన్ని, సమయాన్ని వృధాచేస్తున్నాయని, అదే ఉగ్రవాదుల్ని సామాన్యుడు ఎందుకు చంపకూడదని ప్రశ్నిస్తాడు.

రాజకీయనాయకుల వల్లే ఈ వ్యవస్థ ఇంత అద్వానంగా తయారైందంటాడు. ఇంట్లో బొద్దింకలు వస్తే వాటిని చంపేస్తాం. అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తున్న చీడపురుగుల్ని చంపేయడంలో తప్పేంటని ప్రశ్నిస్తాడు.

ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారిలో ఎవ్వరూ తనవారు కాదు. కానీ సగటుజీవిగా ఓ నిండు గర్భిణికి జరుగుతున్న అన్యాయాన్ని అక్కడి ప్రజలు, పోలీసులు కళ్ళప్పిగించి చూశారో చెప్పే విధానంలో.. కమల్ నటన అద్భుతం. మిగతా నటనంతా మామూలే. వెంకటేష్ పోలీస్ కమీషనర్‌గా బాగానే చేశాడు. ఇతర పాత్రలన్నీ కొత్తవే.

సంభాషణల పరంగా నీలకంఠ బాగానేరాశారు. మాటలు పొందికగా ఉన్నాయి. కమల్ కూతురు శ్రుతిహాసన్ అందించిన సంగీతం సరిపోయింది. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే ఈ చిత్రాన్ని ముందుగానే హిందీలో చూసినవారికి "ఈనాడు" పెద్దగా అనిపించదు. ఎందుకంటే హిందీలో ఉన్నంత ఉత్కంఠతను తెలుగు ఈనాడులో తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం కాలేకపోయారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను భారీ సంఖ్యలో థియేటర్లకు రప్పించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.


Powered by web analytics software.