Free SMS And Earn Part Time Money







11/20/10

టాప్ కమెడియన్ బ్రహ్మనందం కొడుకు గౌతం సినిమా విడుదల చేయటానికి సంశయిస్తున్నారు Distributors


టాలీవుడ్ లొ టాప్ కమెడియన్ బ్రహ్మనందం కొడుకు గౌతం తెలుగు తెరపై మళ్ళి తన లక్ పరీక్షించుకోవటానికి "వారెవా" అనే మూవీతో ముందుకొస్తున్నాడు కాని అంతకు ముందు గౌతం నటించిన "పల్లకిలో పెళ్ళి కూతురు" అంతా బాగ ఆడక పోయేసరికి డిస్ట్రి బ్యూటర్స్ కొంచం ఈ సినిమా విడుదల చేయటానికి సంశయిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకు అంతా సిద్దమయిఉంది ఇందుకోసమై బ్రహ్మనందం తన ఇన్ ఫ్లెన్స్ అంతా ఉపయోగిస్తున్నాడు ఈ సినిమా దర్శకత్వం మహి ,నిర్మతా మూవీ మిరాకిల్స్ వారు చేశారు కొత్తమాయి శాంభవి ఇందులో హిరోయిన్ గా నటించింది

"ఏం నటనా.. ఏం మూవ్‌మెంట్స్.. ఓహ్ సూపర్బ్. ముఖ్యంగా నా భార్య, నా స్నేహితుడు హృతిక్ అయితే జీవించారనుకోండి" :Abhishek


హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన "గుజారిష్" చిత్రం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో హృతిక్‌తో శృతిమించిన శృంగార సన్నివేశాలలో ఐష్ నటించిందని గత వారం నుంచీ బాలీవుడ్ సీనీజనం ఒకటే వాయిస్తున్నాయి. దీంతో ఐశ్వర్య తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఒక దశలో దర్శకుడితో అటువంటి సన్నివేశాలేమైనా ఉంటే దయచేసి తొలగించండి అని చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇదిలావుండగా శుక్రవారం సినిమా విడుదల కావడంతో ఆ చిత్రాన్ని తనతోపాటు చూడాల్సిందిగా ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌ను కోరినట్లు సమాచారం. భార్యకోసం ఏదైనా త్యాగం చేసేందుకు సిద్ధపడతాడన్న పేరున్న అభిషేక్, ఐష్ అడిగిందే తడవుగా తన "ప్లేయర్స్" చిత్రం షూటింగ్ వాయిదా వేసుకుని గోవా నుంచి ఫ్లైట్ ఎక్కి ముంబయిలో వాలిపోయాడట. భర్త రాగానే మిగిలిన కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని వెళ్లి సినిమా చూపించిందట ఐష్. అంతా చూశాక అభి స్పందిస్తూ... నిజంగా "గుజారిష్‌"లో నటించిన నటీనటులందరినీ ప్రత్యేకంగా అభినందించాల్సిందే. "ఏం నటనా.. ఏం మూవ్‌మెంట్స్.. ఓహ్ సూపర్బ్. ముఖ్యంగా నా భార్య, నా స్నేహితుడు హృతిక్ అయితే జీవించారనుకోండి" అంటూ పొగడ్తల వర్షం కురిపించాడట. సినిమాలో తమ నటనను భర్త అలా మెచ్చుకునేసరికి ఐష్ కళ్లవెంట ఆనంద భాష్పాలు రాలాయట. భర్త అంతగా పొగిడితే ఏ భార్య మాత్రం ఆనందించకుండా ఉండగలదు...

నిషా అగర్వాల్ సూత్రాలు చెపుతుంటే, సీనియర్ నటి ప్రియమణి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదట


అంతా కప్పుకుని కూడా సెక్సీగా రెచ్చగొట్టవచ్చని కొత్త తార నిషా అగర్వాల్ సూత్రాలు చెపుతుంటే, సీనియర్ నటి ప్రియమణి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నదట. అనుష్క, ఇలియానాల మాదిరిగా సొగసులన్నీ ఆరబోసి టాలీవుడ్ రేసులో ముందుండాలని తెగ ఆరాటపడుతోందట. కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేస్తానని దర్శకనిర్మాతలతో చెప్పాలనీ, అగ్రహీరోల వెంట అవకాశం వచ్చేలా చూడమని తన మేనేజర్ వద్ద ఒకటే పోరుపెడుతోందట. ప్రియమణి గొడవ పడలేని సదరు మేనేజర్ ప్రస్తుతం టాప్‌స్టార్ చిత్రాల్లో ప్రియమణి ఆఫర్లకోసం కాలికి బలపం కట్టుక తిరుగుతున్నాడట. అన్నట్లు కోలీవుడ్‌లో తమన్నా, అనుష్క వంటి తారలు రాకతో ప్రియమణికి అనుకున్నంత అవకాశాలు రావడం లేదట. దీంతో ఆమె టాలీవుడ్‌నే నమ్ముకున్నట్లు సమాచారం.

Is Mahesh courageous than Chiranjeevi?


రొబొ సినిమా తరవాత చిరంజీవి అంతటి వాడు శంకర్ దర్శకత్వం లొ చేయటానికి ఆసక్తి చూపుతుంటే తెలుగు లొ చిరంజీవి తరవాత మెగస్టార్ పోటి లొ నిలబడిన మహేష్ శంకర్ కి షాక్ ఇచ్చే లా ఉన్నాడు. శంకర్ బాలీవుడ్ చిత్రం 3ఇడియట్స్ ని 3 రాస్కెల్స్ గా తెలుగు తమిళ్ ల లో అనువాదాం చేద్దామనుకుంటు తమిళ్ లొ విజయ్ తొ తెలుగు లొ మహేష్ తొ చేద్దామనుకుంటున్నాడు. కాని శంకర్ ఎంపిక[ఆమీర్ పక్కన ఉన్న మాధవన్ , శర్మ క్యారెక్టర్స్] చేసిన మిగిలిన ఇద్దరూ తమిళ వాలే ఉండటంపై మహేష్ శంకర్ తొ పట్టు బట్టి తెలుగు వాళ్ళని పెట్టించేలా ఉన్నాడు ఇలా గాని జరిగితే తెలుగు ఇండస్ట్రి లొ మహేష్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది తెలుగు ఇండస్ట్రీ పెద్దలు కూడ దీని హర్షిస్తున్నారు .

మగధీర, అరుంధతీ వంటి చిత్రాలు 3D గా మారిస్తే:Allu Venkatesh




మగధీర ఈ సినిమా గురించి ఆలోచించగానే మనకి గుర్తుకొచ్చేది ఆ సినిమా యొక్క విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా తరవాత తెలుగు సినిమా వ్యాపార సామర్ధ్యం మారిపోయింది భారీ చిత్రాలు రూపొందుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో బాగ వినియోగించుకుంటున్నారు ఈ సినిమా విడుదల అయి ఎలా అయితే రికార్డులు చెప్పాలంటే అన్ని విధాలుగా టాలీవుడ్ స్థాయిని పెంచిందో ఇదే చిత్రం మరో అడుగు ముందుకేస్తు రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అల్లు వెంకటేష్ చెప్పారు. ఈ పరిజ్ఞానం తో మామూలు ధియేటర్లని కూడా3D ప్రదర్శనకు అనువుగా మలుచుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయమై మాట్లడుతు ఈ పరిజ్ఞానం వల్ల ప్రేక్షకులకు మంచి పిక్చర్ సౌండ్ ఎఫెక్ట్ ఇవచ్చని పైరసి కూడ ఆపగలమని చెప్పారు. ఖర్చుకూడా తగ్గుతుందని చెప్పారు.

తొలిసారి 10%ధియేటర్లని 3Dధియేటర్స్ గా మారుస్తామని చాల భాగం హాలీవుడ్ చిత్రాలు 3D రూపంలోనే వస్తున్నాయి అని మన తెలుగు లో కూడ మగధీర, అరుంధతీ వంటి చిత్రాలు 3D గా మారిస్తే మంచి ఫలితాలిస్తాయని ఆయన అన్నారు.

ఈ సభలొ సినీ నిర్మాత అల్ల్లు అరవింద్,మెహర్ రమేష్ ,యస్.యస్.రాజమౌళి సెంధిల్ కుమార్ ,శర్వా నంద్ పాల్గొన్నారు.

ఐశ్వర్య రాయ్ తన నటన జీవితంలో ఎన్నో చేదు అనుభవలను ఎదుర్కొంది:sagar bellari


ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ తన నటన జీవితంలో ఎన్నో చేదు అనుభవలను ఎదుర్కొంది వాటన్నిటిని సాగర్ బెళ్ళారి తెరపైకి ఎక్కించబోతున్నాడు. ఆమె మొదట్లొ నటించిన చిత్రాలేవి సరిగ్గ విజయవంతం కాలేదు అసలు నటనకి పనికిరాదన్నారు. అ కసి తోనే ఈ అందాల భామ బాలీవుడ్ లోనే అగ్ర తారగా ఎదిగింది ఎవరికి విజయాలు అంత సులువుగా రావని నిరూపించింది.

సాగర్ బెళ్ళరి విషయానికొస్తే ఇతడు అంతకముందు 'భేజా ఫ్రే' అనే వినోదాత్మామక చిత్రం తీసి విజయం అందుకొన్నాడు. ఇప్పుడు ఐష్ జీవితం పై సినిమా తీసి విజయం అందుకొందామని ఎదురు చూస్తున్నాడు కాని ఈ సినిమా లొ ఐష్ నటించదు ఆ పాత్రలొ మినీషా లాంబా నటిస్తుంది. అయితే ఈ సినిమా లొ ఐష్ నటన జీవితం కంటే మోడల్ గా ప్రపంచసుందరిగా ఎదిగే ఘట్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమచారం.


సునీల్ చైనాని ఈ చిత్రన్ని నిర్మించబోతున్నాడు.
Powered by web analytics software.