Free SMS And Earn Part Time Money







12/12/10

రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు:surya




"రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు. ఇది రెండు పార్ట్ లుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ఫ్యాక్షనిస్ట్, రాజకీయ నాయకుడు అయిన పరిటాల రవి జీవిత చరిత్ర అని గుర్తించుకోవాలి. అలాగే రక్త చరిత్ర అనేది అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కోసం తీసింది కాదు. ఈ చిత్రంలోని హింసాత్మక ధీమ్ మాస్ ఆడియన్స్ లో నెగిటివ్ మోటివేషనల్ ఇన్ఫూలియన్స్ ను కలగచేస్తుంది. అయితే నేను గతంలో చాలా హింసతో కూడిన చిత్రాలు చేసాను.

అయితే వాటిలో కుటుంబం నేఫధ్యంలో కథ అల్లి ఉంటాయి, అలాగే హింసను ప్రేరేపించే సన్నివేశాలను బ్యాలెన్స్ చేయటానికి హీరోయిన్ తో ప్రేమ కథ ఉంటుంది. అయితే రక్త చరిత్ర చిత్రంలో ఇంటెన్సిటీ తగ్గుతుందని ఆ ఇంటిగ్రెంట్స్ ఏమీ పెట్టలేదు. అయినా ఇబ్బందేం లేదు. రామ్ గోపాల్ వర్మ తో మరో చిత్రం చేయటానికి నేను రెడీగా ఉన్నాను అన్నారు.

ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ప్లాప్ అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో "ది బిజెనెస్ మేన్" పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య కమిటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే డైరక్ట్ చేసేటట్లు కనపడుతున్నట్లు తెలుస్తోంది.

గగనమే గందరగోళమైందా..?




ఇటీవల అక్కినేని నాగార్జునను ఫ్యాన్స్ కలుస్తున్నారు రమ్మంటూ... సినిమా విషయాలను చెప్పేందుకు ప్రయత్నించిన దిల్ రాజుకు భంగపాటు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయమై నాగార్జునకు దిల్ రాజు క్షమాపణ చెప్పారు.

దీనిపై నాగ్ స్పందిస్తూ... నన్ను ఫ్యాన్స్ కోసం రమ్మని పిలిచారు. తీరా వచ్చాక బ్యాగ్‌పైపర్ బ్రాండ్ వాళ్లు రెడీగా ఉన్నారు. వారు అక్కడ ఎందుకున్నారు..? మీడియా ఎందుకు వచ్చింది..? అనేది కూడా నాకు తెలీదు. అందుకే మీతో సినిమా గురించి మాట్లాడలేదని నాగ్ చెప్పారు.

అసలు ఇలా ఎందుకు జరిగిందని అడిగితే ఎవరికి వారు ఏవేవో కారణాలు చెపుతున్నారు. దిల్ రాజు తనకు తెలీదంటాడు. మేనేజర్లు తమకు తెలియదంటారు. మరి ఎవరికి తెలుసు...? అంతా గందరగోళంగా అనిపించింది. గగనమే గందరగోళమైందా..? అన్నంత డౌటు వచ్చిందని నాగార్జున అన్నారు. గగనం సినిమా జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలవుతుందని చెప్పారు.

రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).




రోబో హీరో రజినీకాంత్ అరవై పదుల్లోకి అడుగుపెట్టారు. వయస్సు పెరిగినా వన్నె తరగని కథానాయకుడిగా రాణిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

అభిమానం పాళ్ళు కాస్త ఎక్కువైన తమిళ తంబీలు రజినీకాంత్ జన్మదిన వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. అభిమాన సంఘాలతో పాటు ఎక్కడికక్కడ కేక్‌లు కట్ చేస్తూ రజనీ పుట్టిన రోజున కేక్‌లు కట్ చేస్తూ పండుగలా జరుపుకుంటున్నారు.

తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ పాత్రల నుంచి సూపర్‌స్టార్‌గా ప్రకాశిస్తున్న రజినీకాంత్ అభిమానులకు ఆరాధ్యదైవం. అంతేకాదు.. రజినీకాంత్ భారత్‌లో అత్యంత ఖరీదైన సినిమాల్లో హీరోగా నటించిన ఘనత సాధించాడు. అలాగే భారీ మొత్తంలో పారితోషికం తీసుకుని తన రికార్డులు తానే అధిగమించిన ఒకే ఒక్క హీరో రజనీకాంత్‌కు నేడు అరవయ్యవ జన్మదినం (డిసెంబర్ 12).

ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో (18.08.1975లో విడుదలైన) తెరకెక్కిన ఆపూర్వ రాగంగళ్ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేసిన రజినీకాంత్ 158 చిత్రాల్లో నటించారు. తాజాగా విడుదలైన రజినీకాంత్ 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. 60వ ఏట రోబోతో హిట్ కొట్టిన యాంత్రికుడికి మనం కూడా బర్త్ డే విషెస్ చెప్పేద్దాం.. హ్యాపీ బర్త్ డే టు రజినీకాంత్....!
Powered by web analytics software.