Free SMS And Earn Part Time Money







12/12/10

రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు:surya




"రక్త చరిత్ర-2" చిత్రం మాస్ కోసం తీసింది కాదు. ఇది రెండు పార్ట్ లుగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ ఫ్యాక్షనిస్ట్, రాజకీయ నాయకుడు అయిన పరిటాల రవి జీవిత చరిత్ర అని గుర్తించుకోవాలి. అలాగే రక్త చరిత్ర అనేది అన్ని వర్గాల ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కోసం తీసింది కాదు. ఈ చిత్రంలోని హింసాత్మక ధీమ్ మాస్ ఆడియన్స్ లో నెగిటివ్ మోటివేషనల్ ఇన్ఫూలియన్స్ ను కలగచేస్తుంది. అయితే నేను గతంలో చాలా హింసతో కూడిన చిత్రాలు చేసాను.

అయితే వాటిలో కుటుంబం నేఫధ్యంలో కథ అల్లి ఉంటాయి, అలాగే హింసను ప్రేరేపించే సన్నివేశాలను బ్యాలెన్స్ చేయటానికి హీరోయిన్ తో ప్రేమ కథ ఉంటుంది. అయితే రక్త చరిత్ర చిత్రంలో ఇంటెన్సిటీ తగ్గుతుందని ఆ ఇంటిగ్రెంట్స్ ఏమీ పెట్టలేదు. అయినా ఇబ్బందేం లేదు. రామ్ గోపాల్ వర్మ తో మరో చిత్రం చేయటానికి నేను రెడీగా ఉన్నాను అన్నారు.

ఇక రక్త చరిత్ర చిత్రం గురించి సూర్య మాట్లాడటానికి తమిళ మీడియా వద్ద ఇష్టపడటం లేదు. ఒక్కసారి ప్లాప్ అయినంత మాత్రాన ఆ కాంబినేషన్ రిపీట్ చేయకూడదా అంటున్నాడు. రామ్ గోపాల్ వర్మ, సూర్య కాంబినేషన్ లో "ది బిజెనెస్ మేన్" పేరుతో వర్మ నిర్మించనున్న చిత్రంలో సూర్య కమిటైన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మొదట పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేస్తాడనుకున్నారు కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మే డైరక్ట్ చేసేటట్లు కనపడుతున్నట్లు తెలుస్తోంది.
Powered by web analytics software.