Free SMS And Earn Part Time Money







3/5/11

కొత్తగా ఐ హేట్ చిరంజీవి వెబ్ సైట్


ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణపై తయారు చేసిన ఐ హేట్ బాలకృష్ణ వెబ్‌సైట్ సంగతి బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇదే తరహాలో ఐ హేట్ చిరంజీవి అంటూ మరో వెబ్‌సైట్ వచ్చింది. దీంతో పోలీసులు ఈ వెబ్‌సైట్‌లపై ఆరా తీస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఈ వెబ్‌సైట్ వివరాలను తెలియజేస్తూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ, చిరంజీవిపై తయారు చేసిన వెబ్‌సైట్లను తయారు చేసిన వారిని గుర్తించేందుకు సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నా మని సిసిఎస్ అధికారి డిసిపి సత్యనారాయణ తెలిపారు. సినీ హీరోల ప్రతిష్టను దిగజార్చేవిధంగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రూపొందిస్తున్న వెబ్‌సైట్లపై పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ పోలీసు బృందాలను రంగంలో దించారు.

అటు ఇటు తిరుగుతున్న రచ్చ టైటిల్


ఏమైంది ఈ వేళ' చిత్రంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సంపత్ నందికి ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం దొరికింది. అదే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయడం. గతంలో జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి ల కలయికలో వస్తున్న చిత్రానికి రచ్చ టైటిల్ ను నిర్ణయించినట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ సంపత్ నంది ఆ టైటిల్ తనదంటూ మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇదే టైటిల్ తో రవితేజ తో సినిమా చేయాలనుకున్న సంపత్ నంది రవితేజను ఒప్పించడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు ఇదే కథను చరణ్ కు కూడా చెప్పి అవకాశాన్ని సంపాదించాడు. మెరుపు చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో సంపత్ రవితేజకు హ్యాండిచ్చి చరణ్ తో రచ్చ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్టు నిర్మాతలు చెప్తున్నారు. ధరణి చెప్పిన కథ కంటే సంపత్ చెప్పిన లైనే నిర్మాతలకి, హీరోకి బాగా నచ్చిందట. మాటలు, ట్రీట్ మెంట్ కూడా నచ్చడంతో వెంటనే సినిమా స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు.తన ఫ్యూచర్ విషయంలో టెన్షన్ లో వున్న రామ్ చరణ్ కి ఈ సినిమా స్టార్ట్ అవుతుండడం కాస్త ఊరట కలిగించే విషయమే.

పవన్ తీన్ మార్ డౌట్ అభిమానుల్లో సందేహం


పవన్ కళ్యాణ్ గత సినిమా ‘పులి’ విడుదల తేదీలు ఎన్ని మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీరా ఈ సినిమా విడుదలయిన తర్వాత ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘తీన్ మార్’ చిత్రం విడుదల తేదీ కూడా పవన్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందట. దీనికి కారణం వచ్చే నెల రెండో వారంలో సినిమాని విడుదల చేస్తామని నిర్మాత అంటున్నాడుగానీ..ఇప్పటివరకూ కన్ఫార్మ్ డేట్ చెప్పడంలేదు. ఆడియో తేదీ కూడా ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పబ్లిసిటీని వెరైటీగా ప్లాన్ చేస్తున్నానని చెబుతోన్న గణేష్, పవన్ కెరీర్ లోనే ‘తీన్ మార్’ ది బెస్ట్ ఫిలిం అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే అసలు అనుకున్న టైమ్ కి ‘తీన్ మార్’ విడుదలవుతుందా? లేదా అని అభిమానులకు సందేహం కలుగుతోందని, దీనివల్ల చాలా నిరాశకు గురవుతున్నారని సమాచారం. ఈ సినిమాలో ‘లార్డ్ శివ మీద ఈ చిత్రంలో ఓ పాట ఉంటుందట. ఈ పాటను విన్నవాళ్ళు ఖచ్చితంగా చిరంజీవి గారి ‘ఇంద్ర’ సినిమాలోని ‘బమ్ బమ్ బోలే’ పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా రెండు పాటల చిత్రీకరణ జరగాల్సివుంది. జయంత్ లాంటి దర్శకుడిని పెట్టుకుని నిర్మాత విడుదల తేదీని కన్ఫార్మ్ గా చెప్పకపోవడం అభిమానులను కంగారుకు గురి చేస్తోందట.

ఆస్కార్ లో అరవై ముద్దులు కౌగిలింతలు ఇచ్చిన బాలీవుడ్ సెక్స్ బాంబ్


ఈ మధ్యనే జరిగిన ఆస్కార్ ఫంక్షన్లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ,అదే వేడుకలో ఉన్న ఐష్ ని డామినేట్ చేసేసిందట అందంలో కాదులేండి ఆ విషయం మల్లికాకి తెలుసు మరే విషయం లో అనుకుంటున్నార హాలీవుడ్ తారలకు ముద్దులు కురిపియడంలో అభిషేక్ ఉన్నాడని ఐష్ ఆగిందికాని ఐష్ ఏమి తక్కువతినలేదట కాని మల్లిక చేసినంత చేయలేదట వచ్చిన ప్రతిఒక్కరిని కౌగిలించుకొని ముద్దులుపెట్టేసి తెగ ఇంప్రెస్ చేసేసిందట ఒకట?రెండా?ఏకంగా అరవై పైనేఉన్నాయట అమ్మడి ముద్దులు కౌగిలింతలు ఈ విషయం ప్రస్తావిస్తే అవును ముద్దు ఇవ్వడంతప్పుకాదని హాలీవుడ్ ప్రముఖులు మల్లికాని వెనకేసుకొస్తున్నారు అది అభిమానపూర్వకంగా ఇచ్చే ముద్దులట అని చెప్తున్నారు అక్కడ అయిఉండొచ్చుకాని ఇక్కడ సాంప్రదాయం అని అడిగితే ఏమి పట్టనట్టు ఉంటోందట అంటే ఇక్కడ అటువంటి సాంప్రదాయం కోసం వేచిచూస్తోందేమో

దర్శకుడు కనిపించి కనిపించని విధంగా తీర్చి దిద్దాడు:ఎక్స్ పోజింగ్


లక్స్‌పాప లక్స్‌పాప... అంటూ నరసింహనాయుడు బాలకృష్ణ ఆటపట్టించిన ఆషాశైనీ ఉరఫ్‌ మయూరి ప్రస్తుతం ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అంటోంది. జగపతిబాబుతో ఓ పాటకు సిద్ధమైంది. అందులో ఐటం సాంగ్‌ చేసింది.

పూర్తి ఎక్స్‌పోజింగ్‌తో ఉన్న ఆ పాటను గురించి ప్రశ్నిస్తే... సంఘ విద్రోహశక్తులు వచ్చే ఓ పబ్‌లో సాగే పాట ఇది. దానికి అనుగుణంగానే డ్రెస్‌ కోడ్‌ ఉంది. ముందుగా దర్శకుడు చెప్పినప్పుడు సున్నితంగా తిరస్కరించాను. కానీ కథంతా చెప్పాక చేయాలనిపించింది.

పాట సినిమాకు కీలకం. ఇందులో కన్పించి కన్పించని విధంగా దర్శకుడు తీర్చిదిద్డాడు అంటోంది. ఆమధ్య చీరకట్టుకుని చిన్నాతో ఓ చిత్రంలో నటించింది. అటువంటి పాత్రలు మళ్ళీ రావడంలేదని బాధపడుతోంది

అల్లు అర్జున్ పెళ్ళిలో మహేష్ మెయిన్ ఎట్రక్షన్


తన సినిమా ఫంక్షన్లకి హాజరవడమే ఇష్టం లేక వీలయినంత వరకు ఆడియో ఫంక్షన్లు, వంద రోజుల వేడుకలని మహేష్ బాబు అవాయిడ్ చేస్తుంటాడు. ఇక సినిమా పరిశ్రమకి సంబంధించిన ఏ కార్యక్రమానికి మహేష్ అస్సలు అటెండ్ అవడు. పెళ్లిళ్లు, పేరంటాలు అయితే సరేసరి. అలాంటి మహేష్ బాబు తన అలవాట్లకి భిన్నంగా అల్లు అర్జున్ సంగీత్ ఉత్సవానికి సతీసమేతంగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పెళ్లిళ్లకే వెళ్లని మహేష్ సంగీత్ కి రావడం నిజంగా బన్నీకి అతనిచ్చిన గిప్టులాంటిదని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. మిగిలిన యు నటుల్లా డాన్సులు, హంగామా గట్రా చేయకపోయినా అల్లు అర్జున్, స్నేహారెడ్డిలని విష్ చేసి వారితో కాసేపు సమయం గడిపి మహేష్ వెళ్లిపోయాడు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే ‘వరుడు’ కంటే అక్కడున్నంత సేపు మహేష్ బాబు మెయిన్ ఎట్రాక్షన్ అయ్యాడు..

శక్తి లో జూ యన్.టి.ఆర్ కొత్త గెటప్ వివరాలు


బడ్జెట్ లిమిట్ లేకుండా రూపొందుతోన్న చిత్రమని ‘శక్తి’ లాంఛ్ రోజునే అశ్వనీదత్ ఈ చిత్రంపై క్రేజ్ పెంచేశారు. మొహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు తెరపై రూపొందిన అత్యంత కాస్ట్ లీ సినిమాగా చరిత్రకెక్కుతుందని అంటున్నారు. ‘మగధీర’ ఇచ్చిన నమ్మకంతో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘శక్తి’. ఇందులో జూ ఎన్టీఆర్ డ్యూయోల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర ఎన్టీఆర్ ఎప్పుడూ చేసే క్యారెక్టర్స్ కి దగ్గరగానే ఉంటుంది కానీ మరో క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేలా ఉంటుందని తెలిసింది. యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘శక్తి’ చిత్రంలో 5 రకాల గెటప్ ల్లో కనబడతాడని ఈ చిత్ర దర్శకుడు మొహర్ రమేష్ తెలిపాడు. ‘శక్తి’, ‘రుద్ర’గా చిత్రంలోని జూ ఎన్టీఆర్ స్టిల్స్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా యంగ్ టైగర్ వేసిన మరో గెటప్ గురించిన వార్తలు బయటకి వచ్చాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ గా జూ ఎన్టీఆర్ ఓ గెటప్ వేసాడట. ఈ గెటప్ గురించి ఈ యూనిట్ చాలా గోప్యంగా ఉంచుతోంది. ఈ గెటప్ లో ఎన్టీఆర్ అదిరిపోయాడని, చాలా పవర్ ఫుల్ గా ఈ పాత్రని మొహర్ రమేష్ తీర్చి దిద్దాడని విశ్వసనీయమైన సమాచారం.

ఇష్టం లేక పోతే మూసుకుర్చొమన్న ఫొటోగ్రాఫర్ రిచాని


నిన్న బిగ్ సి షోరూమ్ కు సంబంధించిన లక్కీ డ్రాను రిచా తీసింది. లక్కీ డ్రా వంగి తీసేటప్పుడు లోనెక్ వేసుకోవడంతో రిచా అందాలు బహిర్గతం అయ్యాయి. వెంటనే ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని కల్పించారు. సాయంత్రానికల్లా ఈ ఫోToaలు నెట్ లో దర్శనమిచ్చాయి. ఫోటోలను నెట్ లో చూసుకున్న రిచా తన పిఆర్ఓ ద్వారా కొంత మంది ఫోటో గ్రాఫర్లకు ఫోన్ చేయించిందట. పిఆర్ఓ ఫోటోగ్రాఫర్ల పై మండిపడ్డాడని తెలుస్తోంది. వెంటనే ఓ ఫోటో గ్రాఫర్ ఆవిడ చూపించింది కాబట్టి మేము ఫోటోలు తీసాము. ‘మిరపకాయ్’ చిత్రంలో ఫుల్లు గా ఎక్స్ పోజింగ్ చేసింది. ఇప్పుడెందుకు అంత రాద్దాంతం చేస్తోంది. చూపించడం ఇష్టంలేకపోతే మూసుకుని కూర్చోవచ్చు కదా అని ఆ పిఆర్ఓ దగ్గర అన్నాడని సమాచారం.

మత్తు కొసం కాక మరెందుకొ ఇలియాన డ్రగ్స్ కి అలవాటు పడిందా??


సినిమా స్టార్లకి డ్రగ్సి కి అవినాభావ సంబంధం ఉంది. మత్తుకోసం కాకపోయినా చర్మసౌందర్యంకోసం, వయసుపైబడుతున్నా… గ్లామర్ కాపాడుకోవడంకోసం స్టార్లంతా డ్రగ్స్ ని ఎంతోకొంత పరిమాణంలో తీసుకుంటుంటారు. లేటెస్ట్ గా ఇలియానా ఇలా డ్రగ్స్ కి బానిసైందని సమాచారం. చిన్నచిన్నగా మొదలుపెట్టిన ఇలియానా, ఇప్పుడు డ్రగ్స్ లేకుండా పూటగడవని స్టేజ్ కి వచ్చేసిందట.

ఎప్పుడూ సినిమా లైట్ల ముందు మేకప్ వేసుకుని కూర్చుంటే ఎవరి ఫేసయినా త్వరగా కళ తప్పుతుంది. అందునా హీరోయిన్ల లేత చర్మమయితే మరీ త్వరగా కమిలిపోతుంది. అందుకే హీరోయిన్ల కెరీర్ స్పాన్ అంత తక్కువ ఉంటుంది. అయితే చర్మం పాడైపోతున్నా కానీ దానికి గ్లో ఇవ్వడానికి డ్రగ్స్ హెల్ఫ్ అవుతూ ఉండడంతో నేటి తరం హీరోయిన్లు మత్తు కోసం కాకపోయినా అందం కోసమయినా వాటికి అలవాటు పడుతున్నారు. త్రిష, శ్రియ తదితర హీరోయిన్లు వీటితోనే ఇంకా ఫీల్డులో నెట్టుకొస్తున్నారని భోగట్టా. ఇదిలావుంటే ఇలియానా కూడా వారి దారిలోనే డ్రగ్స్ కి అలవాటు పడి ఇప్పుడు వాటిని మానలేకపోతోందని, ఇలా అందం కోసం డ్రగ్స్ కి బానిసలుగా మారిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని వినికిడి.

అల్లు అర్జున్ పెళ్ళికి పవన్ షూటింగ్ ఆపొకొలేదు ఎంత సిన్సియర్


అల్లు అర్జున్ పెళ్లి సందడిలో భాగంగా మొన్న రాత్రి హైదరాబాదులో 'సంగీత్' కార్యక్రమం గ్రేండ్ లెవెల్ లో జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన మహామహులంతా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంతమంది డ్యాన్సులు కూడా చేసి, బన్నీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, ఈ వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎక్కడా కనపడలేదనీ, ఉద్దేశపూర్వకంగానే వాళ్లు దీనికి డుమ్మా కొట్టారనీ కొన్ని వార్తలొచ్చాయి. అయితే, బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఈ వార్తలని తీవ్రంగా ఖండించాడు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడని. అలాగే నాగబాబు కూడా 'పవన్ కల్యాణ్ ప్రైవేటు మనిషి. ఫంక్షన్లకు ఎక్కువగా రాడు. అయినా మేం పిలవడం జరిగింది. పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పాడు' అంటూ ట్విట్టెర్ లో రాసాడు.


శక్తి కధ [గుసగుసలు]


ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘శక్తి’ ఒకటి. జూ ఎన్టీఆర్ ఇలియానా జంటగా మొహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జైట్ గో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘శక్తి’ ఆడియో విడుదలయ్యింది. ఇక..ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? అనే విషయంపై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ నోటా ఈ నోటా వినిపించిన ప్రకారం కథ ఈ విధంగా ఉంటుందని తెలిసింది. మరి ‘శక్తి’ అసలు కథ ఇదో కాదో ఈ సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే...ఇలియానాకి సెక్యురిటిగా శక్తి..ఈ చిత్రంలో ఎన్టీఆర్ నేషనల్ సెక్యురిటీ ఫోర్స్ లో పని చేస్తాడు. అతని పేరు ‘శక్తి’. ఈ సెక్యురిటీ ఫోర్స్ కి తమిళ నటుడు ప్రభు హెడ్ గా వ్యవహరిస్తుంటాడు. అందాల సుందరి ఇలియానా ఈ ప్రభుకి కూతురు. ఈ కూతురిగారికి దైవభక్తి మెండు. అందుకని భారతదేశంలో ఉన్న దేవాలయాలను సందర్శించాలని అనుకుంటుంది. కానీ సెక్యురిటి ప్రాబ్లమ్ ఉంటుందని, వెళ్లొద్దని కూతురికి చెబుతాడు ప్రభు. తండ్రి మాట వినదు ఇలియానా. ఎలాగైనా వెళ్లాల్సిందేనని పట్టుబడుతుంది. వేరే దారి లేక ఆమెకు సెక్యురిటీగా శక్తిని పంపిస్తాడు ప్రభు.

శక్తిపైనే దాడులు...ఈ ఇద్దరూ టింగు రంగా అంటూ ప్రయాణం అవుతారు. కానీ ఇద్దరి పై దాడి జరుగుతుంది. ఆ దాడిని శక్తి శక్తివంతంగా ఎదుర్కొంటాడు. ఆ తర్వాత కూడా ఎటాక్ జరుగుతుంది. సినిమా ఇంటర్వెల్ కి చేరుకునే సమయానికి ఈ ఎటాక్ లు జరుగుతున్నవి ఇలియానాపై కాదు..తనపైనే అని తెలుసుకుంటాడు శక్తి. అక్కడ సినిమా ఇంటర్వెల్ చేరుకుంటుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఆరంభం అవుతుంది. రుద్ర(ఎన్టీఆర్)అనే అతను శక్తి పీఠాలు ఉన్న రాజ్యానికి రాజు. వాటిని దొంగలించి అపారమైన శక్తి సంపాదించాలని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తాయి. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలనుకుంటాడు రుద్ర. ఈ పోరాటంలో రుద్ర చనిపోతాడు. రుద్ర వంశానికి చెందిన శక్తి ఆ శక్తి పీఠాలను కాపాడటానికి నడుం బిగిస్తాడు. క్లుప్తంగా ‘శక్తి’ కథ అని ఫిలింనగర్ వర్గాల్లో జరిగిన చర్చలు బట్టి తెలిసింది.

అనుష్క అరవ గ్లామర్ సీక్రెట్


తెలుగు సినిమాల్లో అనుష్క ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా, ఆమె తమిళ సినిమాల్లో చేసిన ఎక్స్ పోజింగ్ తో పోల్చితే తక్కువేనని అన్పించకమానదెవరికైనా, అయితే అనుష్క మాత్రం అరవ దర్శకలు ఎవర్నైనా సెక్సీగా చూపించగలరనీ, తనను మరింత సెక్సీగా చూసిస్తున్నారనీ, తానేమీ ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేయడం లేదని చెబుతోందనుకోండి. అది వేరే సంగతి. ఆ మధ్యన ‘యముడు’ సినిమాలో అనుష్క గ్లామర్ కి టాలీవుడ్ ఒక్కసారిగా అవాక్కయ్యింది. మొన్నీమద్యనే స్ట్రెయిట్ గా తెలుగులో వచ్చిన ‘రగడ’ సినిమాలో అనుష్క గ్లామర్ కి మంచి మార్కులే పడినా, ‘పులివేట’గా వస్తోన్న తమిళ సినిమా ‘వెటైకారన్’లో మాత్రం అనుష్క ప్రదర్శించిన గ్లామర్ అంతా ఇంతా కాదు. తెలుగులోకన్నా, అనుష్క తమిళంలోనే గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు సంపాదించేసుకుందని చాలామంది టాలీవుడ్ ప్రముఖులే అభిప్రాయపడ్తున్నారు. ఇంతకీ అనుష్క అరవ గ్లామర్ సీక్రెట్ ఏమిటో..!

లిప్ లాక్ సీన్లో ఘాటు ఏమి లేదు:ఇషా చావ్ల


ముద్దు పెట్టుకోవడం చాలా ఘాటుగా ఉందని ఎవరైనా అన్నారేమో కానీ.. ప్రేమకావాలి హీరోయిన్‌ ఇషా చావ్లాకు మాత్రం అందులో ఘాటేమీ లేదని తేల్చేసింది. అందులో ఎంతో అనుభవం ఉన్న అమ్మాయిలా ఈ విషయాన్ని చెపుతోంది.

ఆ చిత్రంలో పార్క్‌లో హీరో సడెన్‌గా ఆమెకు లిప్‌ కిస్‌ ఇస్తాడు. ఈ సీన్‌లో ఎలా నటించారని అడిగితే.. మొదట ఆ సన్నివేశం చెప్పేటప్పుడు కంగారుపడ్డాను. దర్శకుడు కథలో దాని ఇంపార్టెన్స్ చెప్పి మరీ చేయించారు. సెన్సార్‌ ఇబ్బంది ఏమీ ఉండదు అని అన్నారు.

సినిమాలో ఆ సీన్‌ చూస్తే ఘాటుగా ఏమీ అనిపించలేదు అని చెప్పింది. ఆ సీన్‌ చేసేటప్పుడు పక్కనే మమ్మీ కూడా ఉందని మరీ చెప్పుకొచ్చింది. కనుక పెదవులపై పెదవులతో ముద్దాడితే ఈనాటి హీరోయిన్లకు ఎటువంటి ఫీల్ ఉండదన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఈతరం హీరోయిన్లు ఎక్కడికో వెళ్లిపోయినట్లు లేదూ....?

ఎద అందాలు అలా అలా దర్శనమిచ్చాయట:సోనమ్ మాత్రం ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తోందట


బాలీవుడ్ టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపే టాప్ సెక్సీ‌స్టార్ సోనమ్ కపూర్. ఈ అమ్మడు ఇటీవల మగరాయుడిలా ప్రవర్తిస్తోందట. ఎక్కడికెళ్లినా మగాళ్లు ధరించినట్లు బనియన్, పొట్టిపొట్టి షార్టులతో దర్శనమిస్తోందట. ఇటీవల ఓ ఫంక్షన్‌కు మగాళ్లలానే బాగా వదులుగా ఉన్న టాప్ వేసుకుని వచ్చిందట. ఏదో సందర్భంలో మాట్లాడుతూ చేతిని అలా పైకి లేపేసరికి టాప్ కాస్తా బాగా కిందికి జారిపోయే ఎద అందాలు అలా అలా దర్శనమిచ్చాయట. మరి ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా...? ఫోటోలతోపాటు వీడియోలను కూడా తీసి పారేశారట. ఇంత జరిగినా సోనమ్ మాత్రం ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తోందట. దాని గురించి ఎవరైనా మాట్లాడినా... పట్టించుకోవడం లేదట. గ్లామర్ పరిశ్రమలో ఇవన్నీ మామూలే. సినిమాల్లో ధరించే దుస్తులకంటే బయట నిండైన వస్త్రాలతోనే వెళుతున్నానని సర్ది చెపుతోందట.
Powered by web analytics software.