12/22/10
భారీ సెట్‌లో శివశంకర్ నేతృత్వంలో ఛార్మి
"నగరం నిద్రపోతున్న వేళ" చిత్రంలో ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. గురుదేవ క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో నంది శ్రీహరి, టేకుల ముక్తిరాజ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న నగరం నిద్రపోతున్న వేళ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
నిర్మాతలు మాట్లాడుతూ... నవంబరు 18 నుండి ఈ నెల 3 వరకూ చిత్రీకరణ జరుపుకొని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో నృత్య దర్శకుడు శివశంకర్ నేతృత్వంలో ఛార్మిపై ఓ పాటను, ఫైట్ మాస్టర్ ప్రభు నేతృత్వంలో ఒక ఫైట్ చిత్రీకరించాం.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. తదుపరి షెడ్యూల్‌ను జనవరి రెండోవారంలో జరుపడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఆహుతి ప్రసాద్, సత్యప్రకాష్, పరుచూరి బ్రదర్స్, శివారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: దీన్‌రాజ్, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: యశోకృష్ణ, సహనిర్మాత: టేకుల ముక్తిరాజ్, నిర్మాత: నంది శ్రీహరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌రాజ్
బంద్‌లోనైనా అక్కడ షూటింగ్
ఇండస్ట్రీ అంతా బంద్ ప్రభావంతో ఉంటే.. అరకొర చిత్రాలు షూటింగ్‌లు జరుగుతూనే ఉన్నాయని ఇటీవలే ఎన్.శంకర్ ఆరోపించారు. ఇన్‌డైరెక్ట్‌గా దాసరి నారాయణరావు షూటింగ్ జరుగుతుందని చెప్పాడు.
కానీ ఆ చిత్రం షెడ్యూల్ ప్రకారం విదేశాల్లో చేయాల్సి ఉంది. అందుకోసం బంద్‌లోనైనా అక్కడ షూటింగ్ ముగించుకుని ఇటీవలే హైదరాబాద్ వచ్చింది చిత్ర యూనిట్. బాలకృష్ణ ఇందులో రకరకాల గెటప్స్‌లో కన్పిస్తున్నారు. అందులో ఒకటి కొమరమ్‌భీమ్ పాత్ర.
ఈ పేరుతో ఇటీవలే చిత్రం కూడా విడుదలై ఓ మాదిరి ఆదరణ పొందింది. పరమవీర చక్ర విషయానికి వస్తే.. ఈనెల 29న ఆడియోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్‌కు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. కానీ, బంద్ వల్ల పోస్ట్‌ప్రొడక్షన్స్ ఆగిపోవడంతో ప్రత్యేక ప్యాకేజీపై పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుగుతున్నాయని తెలిసింది.
అమీషాపటేల్, షీలా, నేహాధూపియా హీరోయిన్లుగా నటింస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.
పిచ్చి రికార్డులకు ప్రేక్షకుడు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు సినిమా కార్మికులు బలి భారీ చిత్రాల విడుదల
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంగా పరిగణింపబడుతున్న మగధీర రికార్డులకు బ్రేక్ వేసే సమయం వచ్చిందంటూ ఎడాపెడా వాయించేస్తున్నారు మీడియా మిత్రులు. అరవై ఏళ్ల పరిశ్రమలో ఒక్క మగధీర రావటానికి ఎంత కాలం పట్టిందని పట్టించుకోకుండా పోకిరి, మగధీరల మధ్య ఉన్న టైం గ్యాప్ పరిగణలోకి తీసుకుంటే కొందరి వాదన నమ్మక తప్పడం లేదు.
భారీ చిత్రాలను భారీ సంఖ్య ప్రింట్లతో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటం అన్న కొత్త సూత్రం ప్రకారం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే అదృష్టం కలిసి వస్తే మగధీర కి బ్రేక్ వేసే చిత్రాలు దండిగానే చూడొచ్చు. అప్పటి దాకా ఎందుకు వచ్చే సంవత్సరంలోనే సిద్దార్థ ‘అనగనగా ఓ ధీరుడు’, జూ ఎన్టీఆర్ ‘శక్తి’, అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’లలో ఏ ఒక్కటి భారీ దిశగా పయనించినా మగధీర రికార్డులకి బ్రేక్ వేయడం ఖాయం అనే వాదన ఫిల్మిం నగర్ లో యమ జోరుగా సాగుతోంది.
బాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తాయని..తమిళంలో క్రియేటివిటీ తగ్గిందని..నోటికొచ్చినట్టు వాగిందట ఈ అమ్మడు
ఏ కొండకాగొడుగుపట్టడం హీరోయిన్లకు ఉన్న అలవాటే. తమిళంలో నటించేటప్పుడు అక్కడి వాళ్ళను, తెలుగులో నటించేటప్పుడు ఇక్కడివాళ్ళను పొగడటం హీరోయిన్లకు కామనైపోయింది భారీ ఎక్స్ ఫోజింగ్ తో కింద నుంచి పైదాకా చూపించే ప్రియమణి విషయానికొస్తే..నిజానికి తమిళచిత్రాలు ప్రియమణికి మంచి పేరు తీసుకొచ్చాయి. తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’ లో నటనకు ప్రియమణికి ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుంది.
అయితే ఇటీవల బాలీవుడ్ లోకి ఎంటరైన ఈ అమ్మడు అప్పుడే తమిళంపై చిన్నచూపు చూస్తోంది. బాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తాయని..తమిళంలో క్రియేటివిటీ తగ్గిందని..నోటికొచ్చినట్టు వాగిందట. ప్రియమణి మాటలు తమిళ ప్రేక్షకులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆమె అంటే వారు ఊగిపోతున్నారట. ఈ విషయంపై ప్రియమణి మళ్ళీ మాట మారుస్తుందేమో వేచి చూడాల్సిందే..
ఐటమ్ సాంగులకే చార్మి ఫిక్సయిపోతే
రగడ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికానందున విడుదల డిసెంబర్ 24కి పోస్ట్ పోన్ అయింది. అనుష్క, ప్రియమణి, హీరోయిన్స్ గా నాగర్జున హీరోగా నటించిన ‘రగడ’కి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ ‘ఎ’సర్టిఫికెట్ ఇచ్చింది నుండసెక్సీ భామ ఛార్మి ఎంత గొప్ప డాన్సరో ఇప్పుడు కొత్తగా చెప్సేదేముంది. చాలా సినిమాల్లో తన డాన్స్ తో ప్రేక్షకుల్ని మైమరపింపజేసిన ఛార్మి, ఈ మధ్య సినిమాల్లో అవకాశాల్లేకపోయినా అడపా దడపా ఐటమ్ సాంగులతో సరిపెట్టుకుంటోంది. మంచి డాన్సర్ కావడంతో ఆవైపుగా ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఐటమ్ సాంగులంటే ఛార్మికి కోపమొస్తుందిగానీ, స్పెషల్ సాంగ్..అంటూ వాటి గురించి తనదైన శైలిలో ఉప్పొంగిపోతూ చేప్సేస్తోంది ఛార్మి. ఇంతకీ విషయమేటంటే, నాగార్జున కోసమంటూ ‘రగడ’ సినిమాలో ఐటమ్ సాంగ్..అదేనండీ స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేసేసిన ఛార్మి ఆ పాటలో డాన్స్ ఇరగదీసేసింది. అందునా బెల్లీ డాన్స్ చేస్తూ ఛార్మి వేసిన స్టెప్పులు సినిమా టీజర్స్ లో దర్శనమిస్తోంటే, అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఐటమ్ సాంగులకే చార్మి ఫిక్సయిపోతే బెటరని ఫిక్సయిపోయిన ప్రేక్షకులు, ‘రగడ’ సినిమా తర్వాత మరింతగా, ఆమెను ఆ టైప్ లో ఎంకరేజ్ చేస్తారన్నది నిర్వివాదాంశం.
దాసరివి అంత పుచ్చు తెలివి తేటలు
150వ సినిమాను ఎంత తొందరగా విడుదల చేసుకుంటే అంత తొందరగా ఓ రికార్డు పూర్తి చేసుకోవచ్చన్న దిశగా సాగుతున్నాయి దాసరి నారాయణరావు లీలలు. బాలకృష్ణ అమాయకత్వానికి ఎంత మంది బలవుతారన్న విషయం పక్కన పెడితే. నిర్మాత సి కళ్యాణ్ పరిస్థితి ఏమిటన్నదే కొంచెం దీనంగా ఆలోచించాల్సిందే.
మరి రికార్డుల కోసం పాకులాడే దాసరిని చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలా అంటే ముందుగా ఆ వరుసలో ఉండేది నిన్నటి తరం దర్శకుడు ఎ కోదండ రామిరెడ్డి. చిరంజీవితో తిరుగులేని హిట్లిచ్చిన ఈ దర్శకుడు 97 సినిమాలైతే కానిచ్చేశాడు కానీ అక్కడ నుండి కదల్లేక చతికిలబడ్డాడు. మరి దాసరి తూతూ మంత్రంగా బాలయ్య పరమవీర చక్ర షూటింగ్ కానించేస్తున్నాడు కదా అదే దారిలో మీరు కూడా సెంచరీ కొట్టి ఆ రికార్డేదో పూర్తి చేయలేక పోయారా? అంటే పాపం సమాధానం చెప్పలేకపోయాడట. దాసరి అంత పుచ్చు తెలివి తేటలు ఇంకొకరికి రావటం అంటే సామాన్యమైన విషయమా?
ఒక్క పాటతో సినిమా ఇందస్ట్రీలో గొడవలు రేపుతున్న సినిమా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు చిత్రంలో బాలీవుడ్ భామ సాక్షి గులాటి చేస్తున్న పాత్ర పేరు కనిష్క. సినిమాలో ఆమె గురించి వర్మ రిలీజ్ చేసిన బ్రోచర్ లో వివరిస్తూ..బాబు గారి అండతో గ్లామర్ హీరోయిన్ అయ్యి బాబు గారికే చెక్ పెట్టడానికి ట్రై చేసిన బాగా కమర్షియల్ ఆలోచనలు ఉన్న కమర్షియల్ హీరోయిన్ అని రాసారు. ఇంతకీ ఈ పాత్ర తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ని ఉద్దేశించి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిష్క ఎవరిని గుర్తు చేస్తోంది. అలాగే ఆమెను చేర దీసిన బాబు ఎవరు..ఆయనకు చెక్ పెట్టడమేంటి అనే ఆలోచనలో పడుతున్నారు.
కాజల్ రాం చరణ్ రొమెన్స్ కట్
మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తేజ్, కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం ‘మెరుపు’. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఆ మధ్య ఇరవై రోజుల పాటు యూనిట్ ఎంతో కష్టపడి ఒక పాటను కూడా తీశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే కాజల్ ఈ సినిమా చెయ్యడం లేదు. షూటింగ్ ఎక్కువ రోజులు బ్రేక్ రావడంతో తన డేట్స్ లేవంటోంది.
ఈ సినిమా నుంచి తప్పించుకోవడానికి నిర్మాతల్ని ఏదో విధంగా కన్వీన్స్ చేసి ఒప్పించుకుంది. ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా జరిగిన తర్వాత కాజల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలీదు. ఇప్పుడు కాజల్ స్థానంలో ఇలియానా పేరు పరిశీలనలో వుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా జరగడంలేదని, ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది నిజామా కాదా అన్నది తెలియాల్సి వుంది. కాగా చరణ్ సినిమా మొన్న విడుదలైన ఆరెంజ్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో జెనీలియా ఎక్కువ డబ్బులాగిందని ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేపింది.
ఈయన డైరెక్షన్‌లో క్యారెక్టర్ భామలు వుంటే తన కారవాన్‌లో సరసాలు సాగిస్తాడట.
ఇండస్ట్రీలో డాక్టర్ టు యాక్టర్ అయిన వాళ్ళని చూశాం. లాయర్ నుంచి నటుడు, ఆ తర్వాత దర్శకుడు అయిన జి.వి. గురించి తెలుసుకుందాం. విలన్‌గా పరభాషా చిత్రాల వారిని తీసుకొస్తుంటే.. మన దగ్గర లేరా? అంటూ చక్కగా మాట్లాడినా... ఆ పరభాషా నటీమణులు వస్తే మాత్రం.... వారితో ఎంజాయ్ చేయడానికి ఎగబాడతాడని ఇండస్ట్రీ టాక్.
జివీకి ఇండస్ట్రీలో పలుకుబడి కూడా బాగానే ఉండటంతో ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోందట. కాసేపు ఈయనకి సహకరిస్తే అవకాశాలు ఇప్పిస్తాడని చాలామంది తారలు ఇష్టం లేకపోయినా సహకరిస్తున్నారట.
షూటింగ్ స్పాట్‌లో పబ్లిక్‌గా ఇలాంటివి జరుగుతున్నా నిర్మాత చూసీ చూడనట్టు పోతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా "రంగ ది దొంగ" చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి థియేటర్ దొరక్క బాక్స్‌లు ల్యాబ్‌లో మూలుగుతున్నాయి.
తెలుగమ్మాయిలా కనిపించే ఈ ముంబాయి భామ మళ్లిd తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.అందాలను కన్నడ సినిమాలో???
'జయం', 'అపరిచితుడు' చిత్రాల్లో సంప్రదాయానికి ప్రతీకగా కనిపించే పాత్రల్లో కనిపించిన సదా కూడా ట్రాక్ మార్చేసింది. వర్ధమాన నాయికల్లాగే ఒళ్లు చూపించడానికి సిద్ధమైంది. అందంగా కనిపించమే కాదు నేటి యువత అభిరుచికి అనుగుణంగా మారాలి అని భావించినట్టుంది. డజనుకు పైగా చిత్రాల్లో నటించినా, ఆశించిన టర్నింగ్ రాకపోవడంతో ఇప్పుడు తన అందాలను చూపించడానికి సై అంటోందట. తాజాగా కన్నడంలో ఒక సినిమాలో ఇలా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలుగమ్మాయిలా కనిపించే ఈ ముంబాయి భామ మళ్లిd తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
బొమ్మాళి పెళ్ళి విషయం ఎత్తగానే తన మనసులోని అభిప్రాయం బయట పెట్టేసింది
సినిమా హిరోయిన్ లు పెళ్ళి అనగానే నాకప్పుడే పెళ్ళి కాన్సెప్ట్ ఏ లేదు కెరిర్ పైనే నా దౄష్టంత అని చెప్తుంటారు కాని ఈ బొమ్మాళి పెళ్ళి విషయం ఎత్తగానే తన మనసులోని అభిప్రాయం బయట పెట్టేసింది తను ఒకతనితొ లవ్ లో ఉన్నానని ఒకటి రెండు ఏళ్ళలో మేమిద్దరం పెళ్ళి చేసుకొబోతున్నామని కాని తన పేరు ఇప్పుడే చెప్పనని పేరు చెబితే కొన్ని సందేహాలు బయటకి వ్యక్తం అవుతాయని అవన్ని రావటం నాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది మరి ఈ బొమ్మాళి చేసుకొనే ఆ ఆరడుగుల అదౄష్టవంతుడు ఏవరో వేచి చూడాల్సిందే మరి
- ఇట్లు మీ అప్పల్రాజు అంటే వెనక రాంగోపాల్ వర్మ
రొటీన్ సినిమాలు చూసి చూసి విసిగిపోయి నేనే ఓ అద్భుతమైన సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాను. ఒక మంచి కథతో, హృదయానికి హత్తుకునే క్యారెక్టర్లతో సినిమా తీస్తే ఎందుకు సూపర్ హిట్ అవదో మీ అందరికీ తెలియజేయాలన్న నా ఆశ.
మీరు ఎప్పుడూ చూసే విధంగా వర్షం పాటలు, పనికిమాలిన సెట్లు, అర్థంలేని ఫైట్లు, అవసరం లేని ఫారిన్ లొకేషన్లు కాకుండా హార్ట్ టచింగ్ ఎమోషన్లు, ఎక్స్‌టార్డినరీ పెర్ఫార్మెన్స్‌లు ఉంటాయి. అండర్‌కరెంట్‌గా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా.
ఇది మీ అందరికి నా తరపున సంక్రాంతి కానుక. ఈ గొప్ప సెంటిమెంట్ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్లీ ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్లో తప్పకుండా కలుద్దాం. మీ అందరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు
- ఇట్లు మీ అప్పల్రాజు అంటే వెనక రాంగోపాల్ వర్మ
cold war between sakshi and ramcharan
సాక్షి' లాంటి ఇడియాటిక్ ఛానెల్స్ చేసే ప్రచారాన్ని నేను లెక్క చెయ్యను. ఆరెంజ్ లో నిజమైన పాత్రను చేసాను..నేను దానిని బాగా ఇష్టపడ్డాను" అంటూ 'సాక్షి' ఛానెల్ పై మండిపడుతూ..రామ్ చరణ్ ఆ మధ్య ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ చరణ్ కీ, సాక్షి ఛానెల్ మధ్య కోల్డ్ వార్ ప్రారభమైంది. ఆరెంజ్ చిత్రం పంపిణీ చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు న్యాయం చేయాలంటూ ప్రారభించిన ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాంతో సాక్షి ఛానెల్ వారు రామ్ చరణ్ పై ఓ స్పై కెమెరాను ప్రత్యేకంగా పెట్టారని, అతను ఏ చిన్న పొరపాటు చేసినా దానిని హైలెట్ చేయటానికి రెడీ గా ఉన్నారని అంతటా వినపడుతోంది. ఇక రామ్ చరణ్ అంతలా కోప్పపడటానికి కారణం...రామ్ చరణ్ తాజా చిత్రం 'ఆరెంజ్' ని సాక్షి ఛానెల్ వారు డిజాస్టర్ చిత్రం అని తేల్చేయటమే. అంతేగాక వారు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి చెప్పే స్లోగన్ అయిన సామాజిక న్యాయం..ఈ సినిమా విషయంలోనూ అమలుపరచాలని డిమాండ్ చేసారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, నిర్మాతలు మొదట తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల, ఆ తర్వాత కొడుకు రామ్ చరణ్ వల్ల చాలా లాస్ అయ్యారని వారిని ఆదుకొని సామాజిక న్యాయం చేయాలని సూచించారు. అలాగే ఆరెంజ్ చిత్రం రెండో రోజే ధియోటర్స్ ఖాళీ అయ్యాయని, మూడో రోజుకు చాలా చోట్ల తీసివేసారని ఆరోపించారు. దాంతో రామ్ చరణ్ ఇలా స్పందించారు.
Subscribe to:
Posts (Atom)
Powered by web analytics software. |