12/22/10
పిచ్చి రికార్డులకు ప్రేక్షకుడు డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు సినిమా కార్మికులు బలి భారీ చిత్రాల విడుదల
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంగా పరిగణింపబడుతున్న మగధీర రికార్డులకు బ్రేక్ వేసే సమయం వచ్చిందంటూ ఎడాపెడా వాయించేస్తున్నారు మీడియా మిత్రులు. అరవై ఏళ్ల పరిశ్రమలో ఒక్క మగధీర రావటానికి ఎంత కాలం పట్టిందని పట్టించుకోకుండా పోకిరి, మగధీరల మధ్య ఉన్న టైం గ్యాప్ పరిగణలోకి తీసుకుంటే కొందరి వాదన నమ్మక తప్పడం లేదు.
భారీ చిత్రాలను భారీ సంఖ్య ప్రింట్లతో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటం అన్న కొత్త సూత్రం ప్రకారం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే అదృష్టం కలిసి వస్తే మగధీర కి బ్రేక్ వేసే చిత్రాలు దండిగానే చూడొచ్చు. అప్పటి దాకా ఎందుకు వచ్చే సంవత్సరంలోనే సిద్దార్థ ‘అనగనగా ఓ ధీరుడు’, జూ ఎన్టీఆర్ ‘శక్తి’, అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’లలో ఏ ఒక్కటి భారీ దిశగా పయనించినా మగధీర రికార్డులకి బ్రేక్ వేయడం ఖాయం అనే వాదన ఫిల్మిం నగర్ లో యమ జోరుగా సాగుతోంది.
Powered by web analytics software. |