Free SMS And Earn Part Time Money







12/16/10

nagavalli review


నటీనటులు: విక్టరీ వెంకటేష్‌, అనుష్క, కమలినీముఖర్జీ, రిచా గంగోపాధ్యాయ, శ్రద్దాదాస్‌, శరత్‌బాబు, ప్రభ, బ్రహ్మానందం, ఎం.ఎస్‌. నారాయణ, రక్ష, పూనమ్‌కౌర్‌, సుజ తదితరులు. కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, ఫైట్స్‌: విజయ్‌, కాస్ట్యూమ్స్‌: రమా రాజమౌళి, విజువల్స్‌: విన్‌సెంట్‌ స్టూడియో, సంగీతం: గురుకిరణ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.వాసు, నిర్మాత:బెల్లంకొండ సురేష్‌.

పాయింట్‌: చనిపోయిందనుకున్న చంద్రముఖి మళ్ళీ ఎలా వచ్చింది? ఎలా వెళ్ళిపోయింది. అన్నది పాయింట్‌.

మొదటి పార్ట్‌ చంద్రముఖి చూసిన ఫీలింగ్‌తో ఈ సినిమా చూస్తే అంతగా అనిపించదు. ఏదో మిస్‌ అయిందనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్‌గా రజనీకాంత్‌ నటన, మాడ్యులేషన్‌, లకలకలక.. అనే పదాలు తెలీని వైబ్రేషన్‌ ప్రేక్షకుడిలో క్రియేట్‌ చేసింది. నాగవల్లిలో వెంకటేష్ మాడ్యులేషన్‌.... 'ఔరా ఔరా..' అనేది అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాగవల్లి ఎవరు? అనేది సస్పెన్స్‌ కలగజేయడంలో దర్శకుడు బాగానే చేశాడు. టోటల్‌గా విక్టరీ వెంకటేష్‌ 25 సంవత్సరాల కెరీర్‌లో కొత్తగా చేసే ప్రయత్నంలో అతను బాగానే చేశాడనే చెప్పాలి.

కథ: చంద్రముఖి పెయింటింగ్‌ గాలిలో కొట్టుకుంటూ వచ్చి ఓ పెయింటర్‌కు దొరుకుతుంది. దాన్ని ఇంటిలో తీసుకుని పెట్టుకుంటాడు. తనదికాని దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య అడిగితే దానికి ససేమిరా అంటాడు. అయితే అతను తెల్లారేకల్లా చనిపోయి వుంటాడు. ఈ పెయింట్‌ను ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. కట్‌చేస్తే.... విజయనగర సంస్థానదీశుల వారసులైన శరత్‌బాబు ప్యాలెస్‌కు చేరుతుంది. ఆమె కుమార్తె కమలినీముఖర్జీ నాట్యశాస్త్ర పోటీల్లో బహూమతిగా ఇస్తారు. దాన్ని తెస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు.

ఇదిలాఉండగా, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. తనింటిలో 34 అడుగుల పాముందని తెలుసుకుని ఆఖరికి ఓ స్వామిజీ దగ్గరకు వెళతాడు. అతను మీ ఇంటి సమస్యను పరిష్కరిస్తానని అంటాడు. అయితే... ఇటువంటి సమస్యను సాల్వ్‌ చేసే వ్యక్తులు దేశంలో ఇద్దరే ఉన్నారంటూ.. డా|| ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.

ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను పిలిపిస్తారు. అతను వచ్చినప్పటి నుంచి ఇంటిలో ఉన్న సమస్యను ఒక్కోటి తన మానసిక శాస్త్రం ప్రకారం పరిష్కరిస్తుంటాడు. అయితే ఈ క్రమంలో శరత్‌బాబుకున్న మిగిలిన ముగ్గురు కుమార్తెల్లో ఒకరిని చంద్రముఖి ఆవహించిందని గుర్తిస్తాడు. ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను పరిశీలిస్తాడు.

అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.

తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా|| విజయ్‌ ఎలా కనిపెట్టాడు? చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది? అన్నది కథ.

ఈ చిత్రంలో డాక్టర్‌గా, రాజుగా, అఘోరాగా విక్టరీ వెంకటేష్‌ నటించాడు. మూడు భిన్నమైన పాత్రల్ని పోషించాడు. 'రాజును చూసిన కళ్ళతో మొగుడ్నిచూసి మొత్తినట్లు...'అన్న సామెత చందంలా రజనీకాంత్‌ను చూసిన కళ్ళతో వెంకటేష్‌ను చూడలేకపోయారు ప్రేక్షకులు. కానీ వెంకటేష్‌ నటన బాగుంది. 'చుమ్మా... అనే పదం ఆయన్ను అనుసరించినట్లుంది. అసలు సినిమా మొత్తం చంద్రముఖిని చూసినట్లే ఉంది. కొత్తగా కన్పించింది మాత్రం నటీనటులే.

కమలినీ ముఖర్జీ నాట్యంలో బాగా రాణించింది. శ్రద్దాదాస్‌ పాత్ర నామమాత్రమే. చంద్రముఖిగా అనుష్క చేసినా... ఆమె డాన్స్‌ సరిగ్గా చేయలేక పోవడం మైనస్‌గా ఉంది. నాగవల్లి పాత్రలో రిచా గంగోపాధ్యాయ అమరింది. దెయ్యంగా ఆమె చేసిన హావభావాలు కుదిరాయి. బ్రహ్మానందం కామెడీ సపోర్ట్‌గా ఉంది. స్వామీజీగా చంద్రముఖిలో చేసిన కన్నడ నటుడే చేశాడు.

ముఖ్యంగా సౌండ్‌ ఎఫెక్ట్‌ చిత్రానికి కీలకం. ఛాటో కె. నాయుడు కెమెరా పనితం బాగుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ బాగున్నాయి. పాటలపరంగా అన్నీబాగానే ఉన్నాయి. 25 ఏళ్ళ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని.. 'అభిమానులు లేనిదే హీరోలు లేరురా.. అనుచరులు లేనిదే లీడర్లు లేరురా..' రాసిన పాట పర్వాలేదు. గురుకిరణ్ సంగీతం సరిపోయింది.

ముఖ్యంగా చెప్పాల్సింది వాసుగారి దర్శకత్వం.. స్క్రీన్‌ప్లే.... చంద్రముఖి నాగవల్లిగా ఎలామారిందనే పాయింట్‌ను చెప్పే క్రమంలో లింకులు బాగున్నాయి. కానీ, చివరికి వచ్చేసరిక స్క్రీన్‌ప్లే తేలిపోయింది. అంతా గందరగోళంగా ఉంది. సమస్యను సాల్వ్‌ చేయాల్సిన డాక్టర్‌ విజయ్‌ చేయకపోవడమే కాక... ఏదో అదృశ్య శక్తి వచ్చి సాల్వ్‌ చేస్తుంది. అది ఎలా అనేది క్లారిటీ లేదు. మహిళా ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.

Rating 5/3
Powered by web analytics software.