Free SMS And Earn Part Time Money







2/4/11

ఎప్పుడో ఎదురవాల్సింది ఇప్పుడే ఎదురయింది తాప్సికి


తాప్సీని పెంచి పోషిస్తున్న మంచు కుంటుంబం ఆమెకి ఎదురు తిరగిందా? తాప్సీ బిజీ అయిపోయి తమని లెక్క చేయడం లేదని మండి పడుతోందా? అంటే అవుననే అంటున్నాయి గాసిప్ వర్గాలు. మంచు బ్రదర్స్ ఇద్దరితో సినిమాలు చేసిన తాప్సీ మోహన్ బాబు బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉందట. అందుకు ఆమో అగ్రిమెంట్ కూడా సైన్ చేసిందట. ఇంతలో తెలుగు, తమిళంలో బిజీ అయిపోవడంతో తాప్సీ ప్రస్తుతం మంచు కంచె నుంచి బయటపడేందుకు చూస్తోందట. మోహన్ బాబు సినిమాలో నటించడానికి కుదరదని చెప్పిందట. అసలే చండశాసనుడు కాబట్టి తాప్సీ పై నిర్మాతల మండలిలో కంప్లయింట్ ఇచ్చినట్టు భోగట్టా. ఇదే కనుక నిజమైతే మంచు ఫ్యామిలీతో రాసుకు పూసుకు తిరుగుతున్న తాప్సీకి ఏదో ఒకనాడు ఎదురవుతుందని సినీ వర్గాలు ఊహించిన పరిస్థితే ఎదురైందని అనుకోవచ్చ.

బోయపాటి దర్శకత్వంలో యన్.టి.ఆర్ చురకత్తి


2010 లో ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు అదుర్స్, బృందావనం విడుదలై విజయాన్ని సాధించాయి. అందుకే ఎన్టీఆర్ కూడా చాలా హుషారుగా వున్నాడు. వెంట వెంటనే సినిమాలు చేయడానికి సంకల్పించాడు.

ప్రస్తుతం మొహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలో నటిస్తున్న తారక్ తర్వాత నటించనున్న చిత్రం సురేందర్ రెడ్డి రచ్చ. ఈ చిత్రం ఫిబ్రవరి 28న చిత్రీకరణ మొదలు కానుంది. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న చురకత్తి ఏప్రిల్ ఒకటిన మొదలు కానుంది. అంటే ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే ఎన్టీఆర్ నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి వేసవిలో సందడి చేస్తే మరొకటి దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నమిత లోని మరో కోణాన్ని చూపిస్తున్నాం ఎస్.కె.బషీద్




అందాల ఆరబోతలో ఎటువంటి షరతులు విధించుకోకుండా చూసినోళ్ళకు చూసినంత చందాన అందాల ఆరబోసే బొద్దుగుమ్మ నమిత. ఈ అమ్మడు అందాలకు దాసోహమైన ప్రేక్షకులు నిత్యం నమిత జపం చేస్తున్నారు. ఈ గ్లామర్ తార త్వరలో మరోసారి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించటానికి సిద్దమవుతున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ఫైర్'. నమిత, సలోని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.బి.కె.ఫిలిమ్స్ పతాకంపై ఎస్.కె.కరీమున్నీసా నిర్మిస్తున్నారు.

ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'డిసెంబర్ రెండోవారంలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బెంగళూరు, మైసూరు, కేరళ లోని అందమైన ప్రదేశాల్లో 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. రెండు పాటలతో సహా అరవై శాతం టాకీ పూర్తయింది. మిగిలిన వర్క్ ను హాంకాంగ్, ఆస్ట్రేలియా లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'యూత్ ను టార్గెట్ చేసి రూపొందిస్తున్న చిత్రమిది. నమిత సలోని పాత్రలు ఆకట్టుకునే విధంగా వుంటాయి. కధ కధనాలతో పాటు పాటలు కూడా అందర్నీ అలరిస్తాయి. ఇప్పటి వరకు నమిత తన కెరీర్ లో పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన నమితలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం దర్శకునిగా నాకు మంచిపేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది' అని తెలిపారు.

రెండవ హిరోయిన్ వేటలో ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మాస్' డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న భారీ చిత్రం రెబల్ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మూడోవారం నుంచి హైదరాబాద్ లో జరుగుతుంది.

ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ 'ప్రభాస్ హీరోగా ఓ సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించాలన్న మా కోరిక ఈ 'రెబల్' చిత్రంతో నెరవేరుతుంది. మా దర్శకులు రాఘవ లారెన్స్ ఈ చిత్రం కోసం అద్భుతమైన కధను సిద్దం చేసారు. ప్రభాస్ ఈ సబ్జెక్ట్ విని ఎంతగానో ఎక్సైట్ అయ్యారు. భారీ సాంకేతిక రూపొందే ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ అనుష్క ఓ హీరోయిన్ గ అనటిస్తోంది. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకునే ఈ రెబల్ చిత్రంలో ఎన్నో విశేషాలుంటాయి' అన్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. బ్రహ్మానందం, ముఖేష్ రుషి, కెల్లీ డార్జ్, షియాజీ షిండే, అలీ, ఎమ్.ఎస్.నారాయణ, చలపతి రావు, జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, జీవా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

'రెబల్' సాంకేతిక నిపుణుల వివరాలు:

మాటలు: డార్లింగ్ స్వామి
సంగీతం: తమన్ ఎస్.
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
మేకప్: రాము
దుస్తులు: రమేష్,
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు,
కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్

బాలీవుడ్ భామలకు దీటైన సమాదానం అనుకుంటోంది:నేను పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటిస్తా:సమీరా రెడ్డి


తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు సమీరా రెడ్డి. స్వతహాగా తెలుగు అమ్మాయి అయినటువంటి సమీరా రెడ్డి, ముంబయిలో పుట్టి పెరగడం వల్ల పాస్ట్ కల్చర్‌కు బాగా అలవాటు పడినట్లు ఉన్నారు. అందుకేనేమో నగ్నంగా నటించడానికి సైతం ఓకే అంటూ చేతులు ఊపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు లాంటి చిత్రాలలో నటించినటువంటి సమీరా రెడ్డి ఆతర్వత చిరంజీవితో జైచిరంజీవలో నటించడం జరిగింది. ఆసినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడడంతో ఇక మరలా తెలుగు సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఎర్రగులాబీలు సినిమాతో మరలా మన ముందుకు వస్తున్నారు. ఏమి మాయచేశావే సినిమాకి దర్శకత్వం వహించినటువంటి గౌతమ్ మీనన్ ఈసినిమాకి కూడా దర్శకత్వం వహించారు. మన హిందీ హీరోయిన్లు, రాణీ ముఖర్జీ, విద్యాబాలన్, మందిరా బేడీలు ఇప్పటికే టాప్ లెస్ గా కనిపించి ప్రేక్షకులను ఆనందపరిచారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ మరో అడుగు ముందుకు వేసి "నేను నగ్నంగా నటించటానికి రెడీ" అంటోంది సమీరా రెడ్డి. ఇక్కడో చిన్న మతలబు ఉందండోయ్ "కళాత్మక చిత్రంలో, పాత్ర డిమాండ్ చేస్తేనే నేను నగ్నంగా నటిస్తాను" అని అంటోంది.

మరి గబ్బర్ సింగ్ ఎవరని టాలీవుడ్ వర్గాల ప్రశ్న పూరి జగన్నాధ్ కి


పూరీ జగన్నాథ్ హిందీ చిత్రం ‘షోలే’ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ హీరోలుగా మంచి బాడీ పర్సనాలిటీ మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలైన ప్రభాస్, గోపిచంద్ కాంబినేష్ లో పూరీ జగన్నాథ్ రూపొందించాలని భావిస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్ ఇంతకు మందే ‘వర్షం’లో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకొన్న గోపిచంద్ ఇండస్ట్రీలో ఓ అగ్రసీవ్ హీరోగా వెలుగొందుతున్నాడు. అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ మల్టీస్టారర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబందించి ‘పార్ట్ నర్’ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్వతి మిల్టన్, బిందుమాధవి హీరోయిన్స్ గా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

ఎగిరి గంతులేస్తున్న రాజశేఖర్


గత కొంతకాలంగా సినిమాలు లేక అలమటిస్తున్న సీనియర్ కధానాయకుడు రాజశేఖర్ కు ఎట్టకేలకు కొన్ని సినిమాలు దొరికాయి. ప్రస్తుతం ఆయన తన సతీమణి దర్శకత్వంలో రూపొందుతున్న మహంకాళి అనే సినిమాలో నటిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రానికి వేరే దర్శకుడు వున్నారు. కాని రాజశేఖర్ కు ఆయనతో విభేదాలు రావడంతో ఇక మెగా ఫోన్ ను జీవిత చేపట్టారు. ఈ మహంకాళి చిత్రం తన కెరీర్ లో మరో అంకుశం అవుతుందని అంటున్నాడు రాజశేఖర్. కాగా రాజ శేఖర్ పుట్టిన రోజు నేడు.

ఈ సందర్భంగా ఆయన త్వరలో నటించనున్న చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'మహంకాళి తో పాటు త్వరలో కన్మణి దర్శకత్వంలో అర్జున పేరుతొ ఓ చిత్రం, కోడి రామకృష్ణ, కే.ఎస్.నాగేశ్వర రావు, మహాదేవ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాల్లో కూడా నటిస్తున్నానని ఆయన చెప్పారు.

సో ఎట్టకేలకు రాజశేఖర్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయన్నమాట

అభిషేక్ కి పోటిగా మహేష్ బాబు


హీరోయిన్లే కాకుండా హీరోలు కూడా దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారిప్పుడు. సినిమాలలో నాలుగైదు నెలలు కష్టపడితేనే కానీ రానంత మొత్తం, ఒక్క అడ్వర్ టైజ్ మెంట్ చేస్తే చాలు వచ్చిపడిపోతున్నాయి. పైగా సినిమా అయితే... రేపది హిట్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ ఒకటి వుంటుంది. అదే యాడ్ విషయంలో అయితే ఆ టెన్షన్ అక్కర్లేదు. అందుకే, తమ గ్లామర్ ని ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ హీరోలు ఆ రంగంలో కూడా వినియోగించుకుంటున్నారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం వీటిలో బిజీగా ఉంటున్నాడు. ఈమధ్య 'వివేల్' ఐటీసీ ప్రాడక్ట్ కి బ్రాండ్ అంబాస్సడార్ గా అసైన్ మెంట్ చేసిన ఈ హీరో, తాజాగా మరో బ్రాండ్ కి కూడా కమిట్ అయ్యేలా వున్నాడు. 'ఐడియా సెల్యులార్' ప్రాడక్ట్ కి ప్రచార కర్తగా మహేష్ ని అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ అసైన్ మెంట్ ఓకే అవ్వచ్చని తెలుస్తోంది

అందాలు హద్దులు దాట కుండ ఆరబోయటం నాకు తెలుసంటున్న టాలీవుడ్TOP తార


అందం అంటే ఎవరి అర్ధాలు వారికుంటాయి. అందం కంటికోరకంగా కనిపిస్తుంది. ఒక వస్తువుని చూసేటప్పుడు ఎంత అందంగా వుందో చెప్పాలంటే ఆ సమయంలో ఆ వ్యక్తి మానసిక ఆలోచనపై ఆధారపడి వుంటుంది అని సెలవిస్తోంది కాజల్. తెలుగు యువ హీరోలందరి సరసన నటిస్తూ అగ్ర కధానాయికల రేసులో దూసుకుపోతుంది ఈ భామ. ఇంతకీ అందం గురుంచి కాజల్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పిందా? అని ఆలోచిస్తున్నారా...

అందాల ఆరబోత విషయంలో మీ హద్దులేమిటి? అని అడిగినప్పుడు ఇదంతా చెప్పుకొచ్చింది. అందంగా కనపడటం వేరు. హద్దులు దాటి అందాలు ఆరబోయడం వేరు. ఈ రెండింటికి వున్న తేడా నాకు తెలుసు. అందుకే శృతిమించి ఎప్పుడు అందాలు ఆరబోయలేదు. నేను సినిమా ఒప్పుకునేటప్పుడు ముందుగా ఆలోచించ ఈ విషయం గురుంచి నిర్ణయం తీసుకుంటా. నేను నటించే సినిమా నా కుటుంబ సభ్యులతో కలిసి చూడగలనా? లేదా? అని ఆలోచిస్తాను. అని చెప్పుకొచ్చారు కాజల్.

ఈ చిత్రంలో ఈజిప్టు మహారాణిగా పూజాబేడి


కామసూత్ర కండోమ్ ప్రకటనలో నటించి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన తార పూజాబేడి. 90లో యువతరానికి పూజ పేరు బాగా తెలుగు. కబీర్ బేడి కూతురుగానే కాదు. అందాలు ఆరబోసిన నాయికగాను పరిచయమే.

కండోమ్ ప్రకటనల్లో గరమ్ గరమ్ భంగిమల్లో నటించింది ఈ భామ. ఒకప్పుడు మోహన్ బాబు చిట్టెమ్మ మొగుడు చిత్రంలో సెక్సీ గా నటించి తన అందాలను రుచి చూపిన ఈ భామ త్వరలో ఎన్టీఆర్ నటిస్తున్న శక్తి చిత్రం ద్వారా మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రంలో ఈజిప్టు మహారాణిగా పూజాబేడి నెగెటివ్ రోల్ ను పోషిస్తున్నారు.

లవ్ ఆజ్ కల్ పోయి తీన్ మార్ ఖాన్ అయింది


కొమరం పులి ప్లాఫ్ తో నిరాశలో వున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నాడు. ఇక వరుసగా సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. జయంత్ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ రీమేక్ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ ను కూడా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు.

కాగా జయంత్ దర్శకత్వంలో గణేష్ బాబు నిర్మిస్తున్న లవ్ ఆజ్ కల్ చిత్రానికి 'తీన్ మార్' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లుగా తెలిసింది. మొదట్లో ఈ చిత్రానికి ఖుషిగా, లవ్లీ అనే టైటిల్స్ ను పరిశీలించారు. కాని వీటికంటే కధ ప్రకారం తీన్ మార్ అనే టైటిల్ వైపే అందరూ మొగ్గు చూపడంతో ఆ టైటిల్ నే నిర్ణయించారు.

ప్రస్తుతం మైసూరు లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సరసన త్రిష ఈ చిత్రంలో నాయికగా చేస్తున్నారు.కొమరం పులి వాయిదా వేస్తు పోయాడు ఫైల్ అయింది ఈ సినిమా పేర్లు మారుస్తు పోతున్నాడు ఈ సినిమా పరిస్థితి ముందు ముందు చూడండి
Powered by web analytics software.