Free SMS And Earn Part Time Money







2/4/11

నమిత లోని మరో కోణాన్ని చూపిస్తున్నాం ఎస్.కె.బషీద్




అందాల ఆరబోతలో ఎటువంటి షరతులు విధించుకోకుండా చూసినోళ్ళకు చూసినంత చందాన అందాల ఆరబోసే బొద్దుగుమ్మ నమిత. ఈ అమ్మడు అందాలకు దాసోహమైన ప్రేక్షకులు నిత్యం నమిత జపం చేస్తున్నారు. ఈ గ్లామర్ తార త్వరలో మరోసారి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించటానికి సిద్దమవుతున్నారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ఫైర్'. నమిత, సలోని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.బి.కె.ఫిలిమ్స్ పతాకంపై ఎస్.కె.కరీమున్నీసా నిర్మిస్తున్నారు.

ఎస్.కె.బషీద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ 'డిసెంబర్ రెండోవారంలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. బెంగళూరు, మైసూరు, కేరళ లోని అందమైన ప్రదేశాల్లో 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. రెండు పాటలతో సహా అరవై శాతం టాకీ పూర్తయింది. మిగిలిన వర్క్ ను హాంకాంగ్, ఆస్ట్రేలియా లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ 'యూత్ ను టార్గెట్ చేసి రూపొందిస్తున్న చిత్రమిది. నమిత సలోని పాత్రలు ఆకట్టుకునే విధంగా వుంటాయి. కధ కధనాలతో పాటు పాటలు కూడా అందర్నీ అలరిస్తాయి. ఇప్పటి వరకు నమిత తన కెరీర్ లో పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన నమితలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం దర్శకునిగా నాకు మంచిపేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది' అని తెలిపారు.

Powered by web analytics software.