Free SMS And Earn Part Time Money







2/4/11

ఎగిరి గంతులేస్తున్న రాజశేఖర్


గత కొంతకాలంగా సినిమాలు లేక అలమటిస్తున్న సీనియర్ కధానాయకుడు రాజశేఖర్ కు ఎట్టకేలకు కొన్ని సినిమాలు దొరికాయి. ప్రస్తుతం ఆయన తన సతీమణి దర్శకత్వంలో రూపొందుతున్న మహంకాళి అనే సినిమాలో నటిస్తున్నారు. మొదట్లో ఈ చిత్రానికి వేరే దర్శకుడు వున్నారు. కాని రాజశేఖర్ కు ఆయనతో విభేదాలు రావడంతో ఇక మెగా ఫోన్ ను జీవిత చేపట్టారు. ఈ మహంకాళి చిత్రం తన కెరీర్ లో మరో అంకుశం అవుతుందని అంటున్నాడు రాజశేఖర్. కాగా రాజ శేఖర్ పుట్టిన రోజు నేడు.

ఈ సందర్భంగా ఆయన త్వరలో నటించనున్న చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'మహంకాళి తో పాటు త్వరలో కన్మణి దర్శకత్వంలో అర్జున పేరుతొ ఓ చిత్రం, కోడి రామకృష్ణ, కే.ఎస్.నాగేశ్వర రావు, మహాదేవ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రాల్లో కూడా నటిస్తున్నానని ఆయన చెప్పారు.

సో ఎట్టకేలకు రాజశేఖర్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయన్నమాట
Powered by web analytics software.