2/4/11
అభిషేక్ కి పోటిగా మహేష్ బాబు
హీరోయిన్లే కాకుండా హీరోలు కూడా దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారిప్పుడు. సినిమాలలో నాలుగైదు నెలలు కష్టపడితేనే కానీ రానంత మొత్తం, ఒక్క అడ్వర్ టైజ్ మెంట్ చేస్తే చాలు వచ్చిపడిపోతున్నాయి. పైగా సినిమా అయితే... రేపది హిట్ అవుతుందా? లేదా? అనే టెన్షన్ ఒకటి వుంటుంది. అదే యాడ్ విషయంలో అయితే ఆ టెన్షన్ అక్కర్లేదు. అందుకే, తమ గ్లామర్ ని ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ హీరోలు ఆ రంగంలో కూడా వినియోగించుకుంటున్నారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం వీటిలో బిజీగా ఉంటున్నాడు. ఈమధ్య 'వివేల్' ఐటీసీ ప్రాడక్ట్ కి బ్రాండ్ అంబాస్సడార్ గా అసైన్ మెంట్ చేసిన ఈ హీరో, తాజాగా మరో బ్రాండ్ కి కూడా కమిట్ అయ్యేలా వున్నాడు. 'ఐడియా సెల్యులార్' ప్రాడక్ట్ కి ప్రచార కర్తగా మహేష్ ని అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ అసైన్ మెంట్ ఓకే అవ్వచ్చని తెలుస్తోంది
Powered by web analytics software. |