Free SMS And Earn Part Time Money







7/8/09

బాలయ్య బాబుకు పేజ్ త్రీ అవమానం

ఈ విషయం ఒక ప్రముఖ పత్రికలో విలెకరిగా పనిచెస్తున్న నా మిత్రుడి ద్వారా నాకు తెలిసింది
డెక్కన్ చార్జర్స్ విజయాన్ని పురస్కరించుకుని( 6-7-2009) హైదరాబాద్ లో బ్రహ్మాండమైన పార్టీ జరిగింది. దీనికి వివిధ రంగాలకు చెందిన 400 మంది ప్రముఖులు హాజరయ్యారు. హీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గర్వంగా ఒక చోట కూర్చుని ఉండకుండా అందరితో కలిసిపోడానికి ఆయన ప్రయత్నించారు. హై సొసైటీ పేజ్ త్రీ యువతి ఒకరు "మిమ్మల్ని గతంలో చూడలేదు, ఈ సిటీకి కొత్తా" అని అడిగింది. దానితో బాలకృష్ణకు కొంత సేపు మాటలు నట్లు పడ్డాయి. "నా పేరు బాలకృష్ణ. టాలీవుడ్ యాక్టర్ ని.ఎన్టీఆర్ కుమారుడిని" అని ఇంగ్లీషులో చెప్పుకోవలసి వచ్చింది. హిందీ, ఇంగ్లీషు సినిమాలు మాత్రమే చూసే వారికి తాను తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదనుకుని సరిపెట్టుకున్న బాలయ్య మరో యువతి వద్దకు వెళ్ళారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆమె రేఖాజైన్. "మీరు నాకు తెలుసు" అని ఆమె హిందీలో చెప్పింది. డ్యాన్స్ చేసుకుందామా అని బాలయ్య ఆహ్వానించగా "నేను నా భర్తతో మాత్రమే డ్యాన్స్ చేస్తాను"
అని చెప్పింది. రాంగ్ నెంబర్ కు కాల చేశాననుకుంటూ బాలకృష్ణ మళ్ళీ బార్ రూమ్ కు బయలుదేరారట.




యురప్ లో మగధీరుడు





తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెగామూవీని అత్యధిక ప్రింట్లతో ప్రపంచమంతటా జూలై నాలుగోవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని "నాకోసం నువ్వు.. అని సాగే పాటను రామ్‌చరణ్, కాజల్‌పై యూరప్‌లో ఈ నెల 7వ తేదీ నుండి చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో మగధీర షూటింగ్ పూర్తవుతుంది
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న "మగధీర" ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, సేల్స్ పరంగా రికార్డులు సౄష్టిస్తోంది



జగన్ వ్యాపారాలలో యువసామ్రాట్ పెట్టుబడులు

ఎన్నికల ముందు నాగార్జున కాంగ్రెస్ కు అనుకూలంగా యాడ్స్ లో నటించారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ పథకాలను ఆకాశానికి ఎత్తేశారు. తండ్రి తెలుగుదేశం పక్షపాతి అయినా నాగార్జున మాత్రం మళ్ళీ అధికారంలోకి రానున్న పార్టీ కాంగ్రెసేనని ముందే తన దివ్య దృష్టితో కనిపెట్టారు. అదే ఆయనకు ఇప్పుడు కలిసోచ్చింది. నాగార్జునకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. పైగా ఆయనది బిజినెస్ లో గోల్డెన్ హ్యాండ్ అన్న పేరుంది. కోకాపేట, గచ్చిబౌలిలో ఆయనకు బినామీ పేర్లతో ఎకరాల కొద్దీ భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఎకరం వేలల్లో కొనుక్కుంటే ఇప్పుడు ఒక్క ఎకరమే కోట్ల విలువ చేస్తుంది.

ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ వ్యాపార సామ్రాజ్యంలో కొంత వాటా నాగార్జునకు ఉందని తాజా సమాచారం. మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జగన్ త్వరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నారు. పాత వ్యాపారాల్లోనే కాక కొత్త వెంచర్లలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ ది గోల్డెన్ లెగ్గే, నాగార్జునది గోల్డెన్ హ్యాండే. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో...........




Powered by web analytics software.