ఎన్నికల ముందు నాగార్జున కాంగ్రెస్ కు అనుకూలంగా యాడ్స్ లో నటించారు. సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ పథకాలను ఆకాశానికి ఎత్తేశారు. తండ్రి తెలుగుదేశం పక్షపాతి అయినా నాగార్జున మాత్రం మళ్ళీ అధికారంలోకి రానున్న పార్టీ కాంగ్రెసేనని ముందే తన దివ్య దృష్టితో కనిపెట్టారు. అదే ఆయనకు ఇప్పుడు కలిసోచ్చింది. నాగార్జునకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. పైగా ఆయనది బిజినెస్ లో గోల్డెన్ హ్యాండ్ అన్న పేరుంది. కోకాపేట, గచ్చిబౌలిలో ఆయనకు బినామీ పేర్లతో ఎకరాల కొద్దీ భూమి ఉన్నట్టు తెలుస్తోంది. ఎకరం వేలల్లో కొనుక్కుంటే ఇప్పుడు ఒక్క ఎకరమే కోట్ల విలువ చేస్తుంది.
ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ వ్యాపార సామ్రాజ్యంలో కొంత వాటా నాగార్జునకు ఉందని తాజా సమాచారం. మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జగన్ త్వరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నారు. పాత వ్యాపారాల్లోనే కాక కొత్త వెంచర్లలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ ది గోల్డెన్ లెగ్గే, నాగార్జునది గోల్డెన్ హ్యాండే. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో...........