మగధీర స్టొరీ లైన్ అంటూ ఓ కథ ప్రచారం లోకి వచ్చింది. వారు చెప్పే దాని ప్రకారం కాలభైరవ గా రామ్ చరణ్ కనపడతారు. అతని ప్రేయసి ఓ రాకుమార్తె. ఐతే కాలభైరవను ఎలాగైనా అంతం చేసి అతని ప్రేమను భగ్నం చేసేందుకు అంతఃపురంలోనే కుట్రలు జరుగుతుంటాయి. కాలభైరవ సవతి సోదరుడే (శ్రీహరి) ఇందుకు సూత్రధారి. ఆ కుట్రకు గురై తమ ప్రేమను పండించుకోలేక పోయిన కాలభైరవ, అతని ప్రియురాలు మరో జన్మ ఎత్తుతారు. కాలభైరవ ఒక స్టంట్ మన్ గా, ప్రిన్స్ ఓ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ తిరిగి కలుస్తారు. ఆ కాలంలో ఈ ఇద్దరి ప్రేమ జంటను విడిదీసిన సవతి సోదరుడే ఈ జన్మలో వారిద్దరినీ కలుపుతాడు. కాలభైరవగా-స్టంట్ మన్ గా రామ్ చరణ్, ప్రిన్స్ గా-ఫ్యాషన్ డిజైనర్ గా కాజల్, ఆ ఇద్దర్నీ విడదీసి మళ్లీ కలిపే పాత్రలో శ్రీహరి నటిస్తున్నారు. రాజస్ఠాన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పునర్జమన్మ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి సైతం ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చేసాడు. గీతా ఆర్ట్స్ పై గజనీ తర్వాత ఎక్కువ బడ్జెట్ లో నిర్మితమైన చిత్రం ఇదే.అలాగే చిరంజీవి కెరీర్ లో సూపర్ హిట్ ఘరానామొగుడు లోని "బంగారు కోడి పెట్ట" పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసారు. అంతేగాక "చిరంజీవి" సైతం తన కుమారుడుతో కలిసి స్టెప్స్ వేసి తన అభిమానులను అలరించనున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ హార్స్ రైడింగ్ ,కాజల్ యాక్షన్,స్రీహరి నటన హైలెట్ సూపర్ హైలెట్ చిరంజీవి బంగారు కోడి పెట్ట లో ఒక స్టెప్ వేయడం ఇక ఇప్పటివరకూ ఒక్క ప్లాప్ కూడా లేని రాజమౌళి డైరక్ట్ చేయటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.