Free SMS And Earn Part Time Money







2/18/11

మఘదీర హిందిలో కూడ హెల్ప్ అవుతోంది:కాజల్


దక్షినాది చలన చిత్ర రంగంలో నిస్పందేహంగా బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ ఎవరంటే కాజల్ అని చెప్పచ్చు. అదుకు నిదర్శనాలైనటువంటి ఆమె నటించిన ‘మగధీర’, ‘ఆర్య2’, తమిళంలో ‘నాన్ మహాన్ అల్లా’ సినిమా సక్సెస్ లే ఆమె క్రెడిట్. దాంతో ఆమె ఇండస్ట్రీలో ఆమె ఇమేజ్, క్రేజ్ ఒక్కసారిగా అమాంతగా పెరిగిపోయింది. ఒక సినిమా హిట్ అయితే అందులో నటించిన ఆర్టిస్టులకి మరికొన్ని సినిమాలు వస్తాయి. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'మగధీర' సినిమా హీరోయిన్ కాజల్ కి అలాగే ఉపయోగపడింది. ఆ సినిమా సక్సెస్ తో తను స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. రెమ్యునేరేషన్ పెంచింది. అంతేకాదు, ఆ హిట్ కాజల్ కి ఇంకా హెల్ప్ అవుతూనే వుంది. ఆ సినిమా వల్లే తాజాగా తనకి హిందీలో ఓ అవకాశం వచ్చింది. తమిళంలో హిట్టయిన 'సింగం' సినిమాని దర్శకుడు రోహిత్ శెట్టి హీరో అజయ్ దేవగణ్ తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ ఎంపికకు 'మగధీర' సినిమా తోడయ్యిందట. దీని గురించి కాజల్ చెబుతూ 'రోహిత్ ఇటీవల 'మగధీర' చూసాడట. నా పెర్ ఫార్మెన్స్ కి ఇంప్రెస్ అయి, నన్ను కాంటాక్ట్ చేసారు. నాకు కూడా హిందీ ప్రాజక్టు నచ్చింది. దానికి తోడు డేట్స్ కూడా వున్నాయి. యాక్సప్ట్ చేసాను. ఆ విధంగా 'మగధీర' నాకు హిందీలో కూడా హెల్ప్ అయింది' అంటోంది

కర్దాషియాన్ అపార్ట్ మెంట్‌లో ఒకరోజు ఆరోజు రాత్రి వారిద్దరి మద్యా జరిగినటువంటి కొన్ని రాంచీ సీన్స్‌ని కూడా ప్రసారం


కిమ్ కర్దాషియాన్ నిర్వహించేటటువంటి రియాలిటీ టివి షో కోర్ట్నిఅయిన అండ్ కిమ్ టేక్ న్యూయార్క్ లో వచ్చేవారం కిమ్ కర్దాషియాన్ మాజీ ఆస్ట్రేలియా బాడీగార్డ్ షీన్గో డీనీతో కలసి నిద్రపోయినటువంటి కొన్ని రోమాంటిక్ సన్నివేశాలను ఓ ఎపిసోడ్‌గా వేయనున్నట్లు సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే న్యూయార్క్ లోని కిమ్ కర్దాషియాన్ అపార్ట్ మెంట్‌లో ఒకరోజు కిమ్ కర్దాషియాన్ మరియు ఆమె మాజీ బాడీగార్డ్ ఒకే మంచం మీద నిద్రపోవడం జరిగింది. ఆరోజు అలా జరగడానికి కారణాలు ఏంటనేవి ఓ ధారావాహికగా కిమ్ కర్దాషియాన్ తన రియాలిటీ టివి షోలో వేయడానికి సిద్దమైనట్లు తెలిపారు. ఇది మాత్రమే కాకుండా ఆరోజు రాత్రి వారిద్దరి మద్యా జరిగినటువంటి కొన్ని రాంచీ సీన్స్‌ని కూడా ప్రసారం చేయనున్నట్లు సమాచారం

హిరోయిన్ చెల్లెలలని పరిచయం చేస్తున్న హిరో


ఈ మద్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సాంప్రదాయం ఆనవాయితీగా మారింది. ఏంటదీ అని అనుకుంటున్నారా..సినిమా హీరోయిన్స్ గా ఒక రేంజికి వచ్చిన తర్వాత వారి చెల్లెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఆనవాయితీగా మారింది. గతంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తన చెల్లెలు అదితి అగర్వాల్‌ని రాఘవేంద్రరావు డైరెక్షన్‌‌లో గంగోత్రి సినిమా ద్వారా పరిచయం చేసింది. ఇప్పుడు ఆభాద్యతను మళ్శా కొత్తగా వరుణ్ సందేశ్ తీసుకన్నట్లు ఉన్నాడు. దానికి కారణం అక్కలు పెద్ద హీరోల సినిమాలతో బిజీగా ఉంటే, వారి బాటలోనే చిత్రసీమలో ఎగదాలనే ఉద్దేశ్యంతో చూస్తున్న చెల్లెళ్శకు వరుణ్ సందేశ్ దారి చూపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో కాజల్ చెల్లెలు సిషా అగర్వాల్ ని తెలుగు చిత్ర సీమకు ఏమైందీ ఈవేళ అనే చిత్రంలో హీరోయిన్‌‌గా పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు తమిళంలో చికుబుకు అనే చిత్రంలో నటించినటువంటి ప్రీతి రావుని కూడా ఇక్కడికి తెస్తున్నాడు

కంగనా రనౌత్ తన పెదాలుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోని మరీ చాలా మృదువుగా అందంగా చేసుకుందని సమాచారం పుల్‌గా తాగి పడిపోయిన హీరోయిన్‌కి లిప్ లాక్ కిస్ ఇచ్


బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజిని సంపాదించుకున్నారు కంగనా రనౌత్. సాధారణంగా తాగి పడిపోయే లేడి క్యారెక్టర్స్ అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది కంగనా రనౌత్ మాత్రమే. దానికి కారణం లేకపోలేదు గతంలో వచ్చినటువంటి చాలా సినిమాలలో కంగనా రనౌత్ అలాంటి పాత్రలను పోషించడం జరిగింది. ముఖ్యంగా మనం ష్యాషన్ అనే సినిమాలో కంగనా రనౌత్ చేసినటువంటి యాక్షన్ గనుక చూసినట్లైతే ఆమె నటనకు వావ్ అనని వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నమ్మశఖ్యం కాదు. సరిగ్గా అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఇంకోక సినిమాలో కంగనా రనౌత్ వేశారు. ఏంటా ఆసినిమా అని అనుకుంటున్నారా తను వెడ్స్ మను. ఈచిత్రంలో కంగనా రనౌత్ పెద్ద తాగుబోతుగా నటిస్తున్నారు. ఈసినిమాలో కంగనా రనౌత్ పుల్‌గా తాగి పడిపోతుందని సమాచారం. ఆసమయంలో హీరో మాధవన్ ఆమెకు ముద్దు పెడతాడంట. గతంలో గురు సినిమాలో విద్యాబాలన్‌కు లిప్ టు లిప్ కిస్ పెట్టినటువంటి మాధవన్ అప్పటి నుండి ఇక ఏ హీరోయిన్ కు ముద్దు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఐతే ఇప్పుడు ఈసినిమాలో కధ డిమాండ్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్ధితులలో కంగనా రనౌత్‌‌కు ముద్దు పెట్టడం జరిగిందంట. దీనికి అసలు కారణం మొన్నా మద్య కంగనా రనౌత్ తన పెదాలుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోని మరీ చాలా మృదువుగా అందంగా చేసుకుందని సమాచారం. దాంతో అటువంటి పెదాలను ముద్దాడాలని అనుకున్నాడో లేక దర్శకుడు చెప్పిన సన్నివేశం రికమండ్ చేయడం వల్ల ముద్దుకి అంగీకరించాడో తెలియడం లేదు. ఏది ఏతేనేం అందమైన పెదాలను ముద్దు పెట్టుకునే అదృష్టాన్ని కొట్టివేశాడు

రెస్టారెంట్ యజమాని శివతో రీమా


ప్రముఖ రెస్టారెంట్ యజమాని శివ కిరణ్ సింగ్‌తో నిశ్చితార్థం జరిగినట్టు వచ్చిన వార్తలపై సినీ నటి రిమాసేన్ స్పందించారు. తనకు నిశ్చితార్థం కాలేదన్నారు. అయితే, ఒకరోజు రాత్రి అత్యంత దగ్గరి సన్నిహితులైన మా నలుగురికి శివ ఇచ్చిన విందు మాత్రం జీవితంలో మరచిపోలేనిదన్నారు. ఆ రోజు రాత్రిని నెమరు వేసుకుంటే.. ఎన్నో తీపిగుర్తులు కళ్ళముందు కనిపిస్తాయన్నారు. ఆ పార్టీలో శివ తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడని రీమా చెప్పింది. ఏది ఏమైనా.. శివతో గడిపిన ఆ ఒక్కరాత్రి ఎలా గడిచిపోయిందో తెలియలేదన్నారు. ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లను కలిగిన శివ.. ఈనెల 16వ తేదీన ఇచ్చిన విందు పార్టీకి టాప్ బిజినెస్‌మెన్‌లతో పాటు పలువురు హాజరయ్యారని చెప్పారు. అయితే, మా ఇద్దరికి అధికారికంగా ఎంగేజ్‌మెంట్ కుదిరితే ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తానని చెప్పింది.

తాను చెప్పదలచుకున్నది చెబుతానని రామ్‌గోపాల్‌వర్మ చేసిన ప్రయత్నమే కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు అంతే


నటీనటులు: సునీల్‌, స్వాతి, సాక్షి, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, తనికెళ్లభరణి, అజయ్‌, కోవైసరళ, అలీ, ఎంఎస్‌నారాయణ, కృష్ణుడు,రఘుబాబు తదితరులు నిర్మాణం: శ్రేయ ప్రొడక్షన్స్‌, నిర్మాత: కోనేరు కిరణ్‌కుమార్‌, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ. పాయింట్‌: ఏది హిట్‌, ఫట్‌ అవుతుందనేది చెప్పలేనమనే పాయింట్‌. సినిమా పరిశ్రమ గురించి తాను చెప్పదలచుకున్నది చెబుతానని రామ్‌గోపాల్‌వర్మ చేసిన ప్రయత్నమే కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు. దర్శకుడు అవ్వాలనుకుని హైదరాబాద్‌ వచ్చే వ్యక్తికి కనబడే కష్టాలు తీశానని అన్నాడు. కానీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఆధిపత్య పోరులో అప్పల్రాజు వంటి దర్శకుడు ఎలా నలిగిపోయాడనే దానిపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు వర్మ. కథ: 'మీకొక అబద్ధం చెప్పాను. కామెడీ సినిమా అన్నాను. కానీ ఇది ట్రాజెడీ సినిమా. ఒకరికి కామెడీ మరొకరికి ట్రాజెడీ...' అంటూ వర్మ వాయిస్‌ ఓవర్‌తో కథ ప్రారంభమవుతుంది. కట్‌ చేస్తే... అమలాపురంలో రంభ అనే థియేటర్‌లో సినిమా చూస్తున్న అప్పల్రాజు (సునీల్‌) కనబడతాడు. తన పక్కనే ఉన్న కృష్ణుడుతో తనదగ్గర ఓ కథ ఉందనీ, ఇటువంటి కథల్ని చూస్తుంటే తన కథ కూడా సినిమా తీయాలని చెబుతాడు. అలా తన ఇంటిలో గొడవ చేసి హైదరాబాద్‌ రైలు ఎక్కుతాడు. తన ఫ్రెండ్‌ సత్యం రాజేష్‌ హీరోగా ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని అతని దగ్గరకెళతాడు. ఇక్కడ పరిస్థితి వివరిస్తాడు. ఎలాగైనా సరే దర్శకుడవ్వాలనుకుంటారు. రాసుకున్న కథకు 'నాయకీ' అని పేరు పెడతాడు. అక్కడ రాంఖీ(రఘుబాబు) అనే బూతు సినిమాల నిర్మాతను కలుస్తాడు. అతనికి కథ వినిపిస్తే అది అలా...అలా... హీరోయిన్‌ కనిష్క (సాక్షి)కి చేరుతుంది. తను రాసుకున్న ట్రాజెడీ సినిమాకు కమర్షియల్‌ హంగులు కలిపి రకరకాల ప్రయోగాలు చేస్తారు చుట్టుప్రక్కలవారంతా. అందులో క్రియేటివ్‌హెడ్‌, డిస్ట్రిబ్యూటర్‌, హీరో, హీరోయిన్‌, శ్రీశైలం అనే రౌడీ (బ్రహ్మానందం)..ఇలా తలో ముక్క జోడించి ఆఖరికి సినిమాను మారుస్తారు. తనకిష్టం లేకపోయినా పరిస్థితుల రీత్యా అప్పల్రాజు లొంగిపోతాడు. రిలీజ్‌నాడు టీవీల్లో నెగెటివ్‌టాక్‌తో విమర్శకులు చర్చాగోష్టీ పెడతారు. మరికాసేపటికి అది హిట్‌ అని ప్రేక్షకులుతీర్పు చెబుతారు. దీంతో తన సినిమా ఇంత హిట్‌ ఎందుకు అయిందో తెలియని అమాయకత్వంతో కూడిన ఫేసు పెడతాడు. అది చిత్రముగింపు. సునీల్‌ పాత్రపరంగా బాగా అమరాడు. తను నమ్ముకున్న రాసుకున్న కథను రకరకాలుగా మార్చేస్తుంటే ఆయనలోని భావావేశాలు ఎలా పొంగుతాయో సన్నివేశపరంగా బాగా చూపాడు. స్వాతి పాత్ర అతని దగ్గర అసిస్టెంట్‌ దర్శకురాలు. తెలుగు సరిగ్గారాని అమ్మాయిగా నటించింది. ఇక హీరోల పాత్రల్లో అజయ్‌, ప్రణీత్‌లున్నారు. కనిష్కపాత్రను అనుష్క పాత్రగా, ఆమెతో సన్నిహిత సంబంధాలుండే హీరో బాబు పాత్ర ప్రణీత్‌ను(నాగార్జున) పాత్రలుగా ప్రేక్షకులు అనుకునేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బహిర్గతం చేశాడు ఈ చిత్రంలో వర్మ. అలాగే హీరోల మధ్య పోటీలుంటే తన సినిమాను ఎలా బయటకు తెచ్చుకుంటారో చూపాడు. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోతే ఆఖరికి గూండా చేత సినిమా నిర్మాణం చేపట్టి, ఆయనచేత పాటలు రాయించి దానికి అవార్డు కూడా దక్కడం నేటి సినిమా పరిశ్రమ ఎటువైపు వెళుతుందో చూపాడు. పాటలపరంగా సినిమాను ఏ దర్శకుడు ఎలా తీశాడనేది 'అబ్బ సొత్తుకాదురా టాలెంట్‌..' అంటూ చెప్పాడు. సినిమా టైటిల్స్‌ ఎలా ఉంటాయో 'కొట్టుకుందాం రా'. లేచిపోదాం రా.. వంటి సినిమా ఆడియోఫంక్షన్‌లు జరిగే సన్నివేశాన్నిచూపాడు. సినిమా రివ్యూలను రాసే వెబ్‌సైట్లను, ఫ్లాపైన సినిమాకు పబ్లిసిటీ ఇచ్చే టీవీ ఛానళ్ళను, ప్రమోషన్‌లు ఎలా ఇవ్వాలో తెలియజెప్పే ప్రెస్‌కు చెందిన రాజు అనే వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని తీసినట్లు ఇండస్ట్రీ గురించి తెలిసినవారికి అర్థమవుతుంది. లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడమే సినిమా పబ్లిసిటీ అంటూ పాటలో చెప్పిన వర్మ... తన సినిమాను కూడా... ఇండస్ట్రీ ఇలా ఉందంటూ చెప్పే ప్రయత్నంలో తను అలానే చేశాడనిపిస్తుంది. సంక్రాంతి ఇద్దరు హీరోల సినిమాలు విడుదలయ్యే క్రమంలో మరో హీరో ఫిలింబాక్స్‌ను తగులబెట్టే సన్నివేశం... ఇండస్ట్రీలో ఆధిపత్య పోరును గుర్తు చేస్తుంది. ఇందులో రవితేజ 'ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి.'అంటూ ఓ సన్నివేశంలో కనిపిస్తాడు. టోటల్‌గా సినిమా కష్టాలంటూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు వారి కష్టాలు తమకెందుకు అంటే కష్టమే... టేక్‌ ఇట్‌ ఈజీగా తీసుకుంటే కొద్దిరోజుల సినిమా మాత్రమే.
Powered by web analytics software.