Free SMS And Earn Part Time Money







2/18/11

తాను చెప్పదలచుకున్నది చెబుతానని రామ్‌గోపాల్‌వర్మ చేసిన ప్రయత్నమే కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు అంతే


నటీనటులు: సునీల్‌, స్వాతి, సాక్షి, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, తనికెళ్లభరణి, అజయ్‌, కోవైసరళ, అలీ, ఎంఎస్‌నారాయణ, కృష్ణుడు,రఘుబాబు తదితరులు నిర్మాణం: శ్రేయ ప్రొడక్షన్స్‌, నిర్మాత: కోనేరు కిరణ్‌కుమార్‌, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ. పాయింట్‌: ఏది హిట్‌, ఫట్‌ అవుతుందనేది చెప్పలేనమనే పాయింట్‌. సినిమా పరిశ్రమ గురించి తాను చెప్పదలచుకున్నది చెబుతానని రామ్‌గోపాల్‌వర్మ చేసిన ప్రయత్నమే కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అప్పల్రాజు. దర్శకుడు అవ్వాలనుకుని హైదరాబాద్‌ వచ్చే వ్యక్తికి కనబడే కష్టాలు తీశానని అన్నాడు. కానీ ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఆధిపత్య పోరులో అప్పల్రాజు వంటి దర్శకుడు ఎలా నలిగిపోయాడనే దానిపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేశాడు వర్మ. కథ: 'మీకొక అబద్ధం చెప్పాను. కామెడీ సినిమా అన్నాను. కానీ ఇది ట్రాజెడీ సినిమా. ఒకరికి కామెడీ మరొకరికి ట్రాజెడీ...' అంటూ వర్మ వాయిస్‌ ఓవర్‌తో కథ ప్రారంభమవుతుంది. కట్‌ చేస్తే... అమలాపురంలో రంభ అనే థియేటర్‌లో సినిమా చూస్తున్న అప్పల్రాజు (సునీల్‌) కనబడతాడు. తన పక్కనే ఉన్న కృష్ణుడుతో తనదగ్గర ఓ కథ ఉందనీ, ఇటువంటి కథల్ని చూస్తుంటే తన కథ కూడా సినిమా తీయాలని చెబుతాడు. అలా తన ఇంటిలో గొడవ చేసి హైదరాబాద్‌ రైలు ఎక్కుతాడు. తన ఫ్రెండ్‌ సత్యం రాజేష్‌ హీరోగా ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుని అతని దగ్గరకెళతాడు. ఇక్కడ పరిస్థితి వివరిస్తాడు. ఎలాగైనా సరే దర్శకుడవ్వాలనుకుంటారు. రాసుకున్న కథకు 'నాయకీ' అని పేరు పెడతాడు. అక్కడ రాంఖీ(రఘుబాబు) అనే బూతు సినిమాల నిర్మాతను కలుస్తాడు. అతనికి కథ వినిపిస్తే అది అలా...అలా... హీరోయిన్‌ కనిష్క (సాక్షి)కి చేరుతుంది. తను రాసుకున్న ట్రాజెడీ సినిమాకు కమర్షియల్‌ హంగులు కలిపి రకరకాల ప్రయోగాలు చేస్తారు చుట్టుప్రక్కలవారంతా. అందులో క్రియేటివ్‌హెడ్‌, డిస్ట్రిబ్యూటర్‌, హీరో, హీరోయిన్‌, శ్రీశైలం అనే రౌడీ (బ్రహ్మానందం)..ఇలా తలో ముక్క జోడించి ఆఖరికి సినిమాను మారుస్తారు. తనకిష్టం లేకపోయినా పరిస్థితుల రీత్యా అప్పల్రాజు లొంగిపోతాడు. రిలీజ్‌నాడు టీవీల్లో నెగెటివ్‌టాక్‌తో విమర్శకులు చర్చాగోష్టీ పెడతారు. మరికాసేపటికి అది హిట్‌ అని ప్రేక్షకులుతీర్పు చెబుతారు. దీంతో తన సినిమా ఇంత హిట్‌ ఎందుకు అయిందో తెలియని అమాయకత్వంతో కూడిన ఫేసు పెడతాడు. అది చిత్రముగింపు. సునీల్‌ పాత్రపరంగా బాగా అమరాడు. తను నమ్ముకున్న రాసుకున్న కథను రకరకాలుగా మార్చేస్తుంటే ఆయనలోని భావావేశాలు ఎలా పొంగుతాయో సన్నివేశపరంగా బాగా చూపాడు. స్వాతి పాత్ర అతని దగ్గర అసిస్టెంట్‌ దర్శకురాలు. తెలుగు సరిగ్గారాని అమ్మాయిగా నటించింది. ఇక హీరోల పాత్రల్లో అజయ్‌, ప్రణీత్‌లున్నారు. కనిష్కపాత్రను అనుష్క పాత్రగా, ఆమెతో సన్నిహిత సంబంధాలుండే హీరో బాబు పాత్ర ప్రణీత్‌ను(నాగార్జున) పాత్రలుగా ప్రేక్షకులు అనుకునేలా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని బహిర్గతం చేశాడు ఈ చిత్రంలో వర్మ. అలాగే హీరోల మధ్య పోటీలుంటే తన సినిమాను ఎలా బయటకు తెచ్చుకుంటారో చూపాడు. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోతే ఆఖరికి గూండా చేత సినిమా నిర్మాణం చేపట్టి, ఆయనచేత పాటలు రాయించి దానికి అవార్డు కూడా దక్కడం నేటి సినిమా పరిశ్రమ ఎటువైపు వెళుతుందో చూపాడు. పాటలపరంగా సినిమాను ఏ దర్శకుడు ఎలా తీశాడనేది 'అబ్బ సొత్తుకాదురా టాలెంట్‌..' అంటూ చెప్పాడు. సినిమా టైటిల్స్‌ ఎలా ఉంటాయో 'కొట్టుకుందాం రా'. లేచిపోదాం రా.. వంటి సినిమా ఆడియోఫంక్షన్‌లు జరిగే సన్నివేశాన్నిచూపాడు. సినిమా రివ్యూలను రాసే వెబ్‌సైట్లను, ఫ్లాపైన సినిమాకు పబ్లిసిటీ ఇచ్చే టీవీ ఛానళ్ళను, ప్రమోషన్‌లు ఎలా ఇవ్వాలో తెలియజెప్పే ప్రెస్‌కు చెందిన రాజు అనే వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని తీసినట్లు ఇండస్ట్రీ గురించి తెలిసినవారికి అర్థమవుతుంది. లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడమే సినిమా పబ్లిసిటీ అంటూ పాటలో చెప్పిన వర్మ... తన సినిమాను కూడా... ఇండస్ట్రీ ఇలా ఉందంటూ చెప్పే ప్రయత్నంలో తను అలానే చేశాడనిపిస్తుంది. సంక్రాంతి ఇద్దరు హీరోల సినిమాలు విడుదలయ్యే క్రమంలో మరో హీరో ఫిలింబాక్స్‌ను తగులబెట్టే సన్నివేశం... ఇండస్ట్రీలో ఆధిపత్య పోరును గుర్తు చేస్తుంది. ఇందులో రవితేజ 'ప్లీజ్‌ ఒక్క అవకాశం ఇవ్వండి.'అంటూ ఓ సన్నివేశంలో కనిపిస్తాడు. టోటల్‌గా సినిమా కష్టాలంటూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు వారి కష్టాలు తమకెందుకు అంటే కష్టమే... టేక్‌ ఇట్‌ ఈజీగా తీసుకుంటే కొద్దిరోజుల సినిమా మాత్రమే.
Powered by web analytics software.