2/4/11
అందాలు హద్దులు దాట కుండ ఆరబోయటం నాకు తెలుసంటున్న టాలీవుడ్TOP తార
అందం అంటే ఎవరి అర్ధాలు వారికుంటాయి. అందం కంటికోరకంగా కనిపిస్తుంది. ఒక వస్తువుని చూసేటప్పుడు ఎంత అందంగా వుందో చెప్పాలంటే ఆ సమయంలో ఆ వ్యక్తి మానసిక ఆలోచనపై ఆధారపడి వుంటుంది అని సెలవిస్తోంది కాజల్. తెలుగు యువ హీరోలందరి సరసన నటిస్తూ అగ్ర కధానాయికల రేసులో దూసుకుపోతుంది ఈ భామ. ఇంతకీ అందం గురుంచి కాజల్ ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పిందా? అని ఆలోచిస్తున్నారా...
అందాల ఆరబోత విషయంలో మీ హద్దులేమిటి? అని అడిగినప్పుడు ఇదంతా చెప్పుకొచ్చింది. అందంగా కనపడటం వేరు. హద్దులు దాటి అందాలు ఆరబోయడం వేరు. ఈ రెండింటికి వున్న తేడా నాకు తెలుసు. అందుకే శృతిమించి ఎప్పుడు అందాలు ఆరబోయలేదు. నేను సినిమా ఒప్పుకునేటప్పుడు ముందుగా ఆలోచించ ఈ విషయం గురుంచి నిర్ణయం తీసుకుంటా. నేను నటించే సినిమా నా కుటుంబ సభ్యులతో కలిసి చూడగలనా? లేదా? అని ఆలోచిస్తాను. అని చెప్పుకొచ్చారు కాజల్.
Powered by web analytics software. |