Free SMS And Earn Part Time Money







1/26/11

wanted [కి సినిమా కి సంబంధం లేదు]preview


రాంబాబు (గోపీచంద్‌) హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు. ఎప్పటికప్పుడు ఈ రోజు గడిచిపోతే చాలు అనుకుటూ ఏ లక్ష్యం లేకుండా తన జీవితం గడుపుతూంటాడు. ఉద్యోగం చేయటానికి కూడా ఇష్టపడడు. అతనికి ఇంట్లోవాళ్లు సపోర్టు ఇచ్చి జాబ్ చేయనివ్వరు . ఇలా పనిపాటా లేకుండా తిరిగే అతని జీవితంలోకి నందిని (దీక్షాసేథ్‌) ప్రవేశిస్తుంది. ఆమె పరిచయంతో రాంబాబు పూర్తిగా మారిపోతాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం నందిని మనసు గెలుచుకోవడమే. అయితే ఆమె తన ప్రేమని ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెడుతుంది. వాటిని నెరవేర్చి ఆమె చేయి అందుకోవటం కోసం రాంబాబు ఏం చేశాడన్నదే మిగతా కథ.

ఈ కథలో బసివిరెడ్డి (ప్రకాష్‌రాజ్‌) పాత్ర రాంబాబుకి సరైన సవాల విసురుతుంది.ఇందులో పల్లెటూరి పిల్లగా దీక్షాసేధ్ సోలో హీరోయిన్‌గా పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం టైటిల్ గురించి దర్శకుడు బి.వియస్ రవి మాట్లాడుతూ..హీరోకి హీరోయిన్ వాండెట్. విలన్ కి హీరో వాంటెడ్. కాబట్టే స్క్రిప్టు ప్రకారం ఈ టైటిల్ యాప్ట్ అని తలిచాం అంటున్నారు. ఇక దర్శకుడు బి.వియస్ రవి గతంలో కళ్యాణ రామ్ జయీభవ, విష్ణు వర్దన్ సలీం, ఝమ్మంది నాదం వంటి చిత్రాలకి కథ, మాటలు అందించారు.
సంస్థ: శ్రీ భవ్య క్రియేషన్స్‌ నటీనటులు: గోపీచంద్‌, దీక్షాసేథ్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ, చంద్రమోహన్‌, జయసుధ తదితరులు. సంగీతం: చక్రి కూర్పు: శంకర్‌ ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్ నిర్మాత: వెనిగళ్ల ఆనందప్రసాద్‌ రచన-దర్శకత్వం: బి.వి.ఎస్‌.రవి.
Powered by web analytics software.