Free SMS And Earn Part Time Money







1/26/11

దాసరి డైలాగులు తీసేశారు


బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పరమ వీర చక్ర'. తేజా సినిమా పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో అమీషా పటేల్‌, నేహా ధూపియా, షీలా, జయసుధ, మురళీమోహన్‌, విజయ్‌చందర్‌, విజయ్ ‌కుమార్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ నటించారు. పదహారు రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 12-1-11న విడుదలై ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

1. మూడు, నాలుగు రీళ్ళలో (17వ సీన్‌గా) జాతీయ పతాకాన్ని తిరగేసినట్టు చూపిన దృశ్యాలను పదకొండు పన్నెండు రీళ్ళలో (సీన్‌ నెం 66) బాంబ్‌ జాతీయ పతాకంలో చుట్టినట్టున్న దృశ్యాలను తొలగించారు.

2. తొమ్మిదవ రీలులో (సీన్‌ నెం 40) చిత్రీకరించిన 'బ్లడీ ఇండియన్స్‌', భారత్‌ కి కుత్తే' పదాలను తొలగించారు.

3. అయిదు ఆరు రీళ్లలో (సీన్‌ నెం 26) చిత్రీకరించిన ''పైనైతే నేను ఒక్కడినే పడుకుంటాను, ఇక్కడ అయితే పదిమంది, బయటకెళ్తే వందమంది బట్టలు కూడా తీస్తారు పైన పడుకుంటారు'' అని హీరోయిన్‌తో విలన్‌ అన్న డైలాగ్‌ని కత్తిరించారు.

4. పదిహేనవ రీలులో (సీన్‌ నెం 85) చిత్రీకరించిన ''నీ పెళ్లాం పక్కలో పడుకోమంటావా'' డైలాగ్‌ని తొలగించారు.

5. పదకొండు పన్నెండు రీళ్ళలో మేజర్‌ కుమారునికి ఎ.కె.47 గన్‌ని స్వాధీనం చేసే దృశ్యాలను కత్తిరించారు.

6. అయిదు ఆరు రీళ్ళలో బాత్రూమ్‌ నుంచి మహిళ బయటకి వచ్చాక ఆమె శరీరంపై గల పుట్టుమచ్చల గురించి రోబో చర్చించే డైలాగ్‌ని తొలగించారు.

'పరమ వీర చక్ర' చిత్రాన్ని తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలనే క్లాజ్‌తో యుఎ సర్టిఫికెట్‌ని ఈ కట్స్‌తో 31-12-2010న జారీ చేసారు

ఏది ఉంచిన ఏది తీసినా సినిమా దొబ్బిందంతే
Powered by web analytics software.