"రక్తచరిత్ర సినిమాలా నా సినిమాలో హత్యలు లేవు. కుట్రలు లేవు. ఇతర సినిమాల మాదిరిగా సెక్సీ సీన్లు లేవు. మా సమస్యలపై మేం సినిమా తీస్తే ప్రాంతీయ అభిమానంతో అడ్డుకుంటారా!? ఇదెక్కడి న్యాయం!?'' అంటూ ఎన్ శంకర్ ప్రశ్నిస్తున్నారు. తన తాజా చిత్రం జయబోలో తెలంగాణ గురించి ఆయన రీసెంట్ గా సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటూ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అయితే ఆయన గతంలో తీసిన సినిమాలు...ఎన్ కౌంటర్ ,యమ జాతకుడు, జయం మనదేరా, ఆయుధం, రామ్ చిత్రాలులో హత్యలు ఉన్నాయి..కుట్రలూ ఉన్నాయి...సెక్సీ సీన్స్ ఉన్నాయి అనేది నిజం. ఈ విషయమే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు ఉద్యమం మీద సినిమా తీసాననని గతంలో తాను తీసిన సినిమాలు మర్చిపోయి రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రతోనూ పోలీక తేవటం, మిగతా వాళ్ళ సినిమాలు కుట్రలు కుతంత్రాలు,సెక్స్ తో నిండి ఉంటాయన్నట్లుగా మాట్లాడటం ఎంత వరకూ సబబు అంటున్నారు. ఇక శంకర్ తన చిత్రంలో తెలంగాణ దీన గాథలు, ధర్మ పోరాటాలు మాత్రమే ఉన్నాయన్నారు. సినిమాను అడ్డుకుంటే న్యాయ, ధర్మ పోరాటం చేస్తానని హెచ్చరించారు.