పేరుకే లోకనాయకుడు కానీ ఈ మద్య తన న్యాచురల్ మార్కును కోల్పోతున్న కమల్ హాసన్ మళ్లీ ఓ పాత సినిమాను నెత్తికెత్తుకున్నాడు. సుమారుగా 15ఏళ్ల క్రితం ‘మరుదనాయగం’ అనే భారీ చిత్రాన్ని మొదలు పెట్టి మధ్యలో వదిలేసిన కమల్ ఇప్పడు ఆ కథని బూజు దులిపే పనిలో పడ్డాడట. అప్పటి ఆ సినిమా క్లిప్పింగులు, స్ర్కిప్ట్ లు తెప్పించుకుని మరోసారి కొత్త నిర్మాతను వెతికిపట్టి ఈ మహాయోధుడి కథకు తెర మీద రూపం ఇచ్చే పనిలో మనిగిపోయాడు. మధురై సంస్థానం, పోలిగార్ ఉద్యమ కాలానికి సంబంధించిన ఈ కథలో అమోఘమైన హీరోయిజం ఉన్నప్పటికీ యాభైకోట్లకు పైగా పెట్టుబడి కావాల్సి రావటంతో అప్పుడు సినిమాను నిలిపేశాడు. రజనీకాంత్ రోబో సాధించిన విజయంతో రెండు వందల కోట్ల వరకు రిస్క్ చేసే నిర్మాతలు తమిళంలో తయారవ్వటంతో మళ్లీ ‘మరుదనాయగం’కు కొత్త ఊపిరి పోసేందుకు సిద్దమయ్యాడు.