Free SMS And Earn Part Time Money







1/26/11

పరుచూరి మురళి తో భారీ సెట్ వేయించి ఏమి తెలిదంటున్న అటవి శాఖ [balakrishna hero]


బాలకృష్ణ, పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇప్పుడు కష్టాల్లో పడింది. ఈ చిత్రం నిమిత్తం విశాఖ పరిసర ప్రాంతాల్లోని జలాశయం వద్ద ఓ భారీ సెట్ ని వేసారు. విశాఖపట్నం జిల్లాలోని చమురుగడ్డ రిజర్వాయర్‌ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టి వేసిన ఈ సెట్ ఇప్పుడు ఎందుకూ ఉపయోగపడకుండా పోతోంది. కారణం..అక్కడ స్ధానిక ప్రజానీక ఈ జలాశయం ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆందోళన ప్రారంభించారు. అక్కడ చెట్లు నరకటానికి వీల్లేదని అంటున్నారు. దాంతో అటవీశాఖ అనుమతి తీసుకుని ఈ సెట్ ప్రారంభించినా ఇప్పుడు షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జలాశయంపై అక్రమ నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఇది కేవలం సెట్ అన్నా ఎవరూ వినిపించుకోవటం లేదు.దాంతో తామూ ఏమీ చేయలేమని, పర్మిషన్ దాకా అంటే ఇవ్వగలం కానీ అంతకు మించి ప్రజాభీష్టాన్ని దాటి ముందుకు వెళ్ళలేమని చేతులెత్తేసారు. మరో ప్రక్క యూనిట్ కి అక్కడ రాజకీయంగా కూడా సపోర్టు దొరికేటట్లు కనపడటం లేదు. ఈ స్ధితిలో వేరొక చోట సెట్ వేసి షూటింగ్ ప్రారంభించాలా అంటే దాదాపు కోటి రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆలోచనలో పడుతున్నారు. బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో ఏమీ కలగచేసుకునేది లేదని స్పష్టం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు.పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీకీర్తి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నం.3గా ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌ రాజ్‌, ఎమ్మెస్‌ నారాయణ, వేణుమాధవ్‌, ఆదిత్య మీనన్‌ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: సందీప్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: కల్యాణిమాలిక్‌. ఇక రీసెంట్ గా పరుచూరి మురళి...నితిన్, ఇలియానాల కాంబినేషన్ లో రెచ్చిపో అనే డిజాస్టర్ ఫిలిం ని ఇచ్చారు.
Powered by web analytics software.