Free SMS And Earn Part Time Money







3/5/11

శక్తి లో జూ యన్.టి.ఆర్ కొత్త గెటప్ వివరాలు


బడ్జెట్ లిమిట్ లేకుండా రూపొందుతోన్న చిత్రమని ‘శక్తి’ లాంఛ్ రోజునే అశ్వనీదత్ ఈ చిత్రంపై క్రేజ్ పెంచేశారు. మొహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు తెరపై రూపొందిన అత్యంత కాస్ట్ లీ సినిమాగా చరిత్రకెక్కుతుందని అంటున్నారు. ‘మగధీర’ ఇచ్చిన నమ్మకంతో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘శక్తి’. ఇందులో జూ ఎన్టీఆర్ డ్యూయోల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర ఎన్టీఆర్ ఎప్పుడూ చేసే క్యారెక్టర్స్ కి దగ్గరగానే ఉంటుంది కానీ మరో క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేలా ఉంటుందని తెలిసింది. యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ‘శక్తి’ చిత్రంలో 5 రకాల గెటప్ ల్లో కనబడతాడని ఈ చిత్ర దర్శకుడు మొహర్ రమేష్ తెలిపాడు. ‘శక్తి’, ‘రుద్ర’గా చిత్రంలోని జూ ఎన్టీఆర్ స్టిల్స్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. తాజాగా యంగ్ టైగర్ వేసిన మరో గెటప్ గురించిన వార్తలు బయటకి వచ్చాయి. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ గా జూ ఎన్టీఆర్ ఓ గెటప్ వేసాడట. ఈ గెటప్ గురించి ఈ యూనిట్ చాలా గోప్యంగా ఉంచుతోంది. ఈ గెటప్ లో ఎన్టీఆర్ అదిరిపోయాడని, చాలా పవర్ ఫుల్ గా ఈ పాత్రని మొహర్ రమేష్ తీర్చి దిద్దాడని విశ్వసనీయమైన సమాచారం.
Powered by web analytics software.