ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాల్లో భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘శక్తి’ ఒకటి. జూ ఎన్టీఆర్ ఇలియానా జంటగా మొహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జైట్ గో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘శక్తి’ ఆడియో విడుదలయ్యింది. ఇక..ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? అనే విషయంపై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ నోటా ఈ నోటా వినిపించిన ప్రకారం కథ ఈ విధంగా ఉంటుందని తెలిసింది. మరి ‘శక్తి’ అసలు కథ ఇదో కాదో ఈ సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే...ఇలియానాకి సెక్యురిటిగా శక్తి..ఈ చిత్రంలో ఎన్టీఆర్ నేషనల్ సెక్యురిటీ ఫోర్స్ లో పని చేస్తాడు. అతని పేరు ‘శక్తి’. ఈ సెక్యురిటీ ఫోర్స్ కి తమిళ నటుడు ప్రభు హెడ్ గా వ్యవహరిస్తుంటాడు. అందాల సుందరి ఇలియానా ఈ ప్రభుకి కూతురు. ఈ కూతురిగారికి దైవభక్తి మెండు. అందుకని భారతదేశంలో ఉన్న దేవాలయాలను సందర్శించాలని అనుకుంటుంది. కానీ సెక్యురిటి ప్రాబ్లమ్ ఉంటుందని, వెళ్లొద్దని కూతురికి చెబుతాడు ప్రభు. తండ్రి మాట వినదు ఇలియానా. ఎలాగైనా వెళ్లాల్సిందేనని పట్టుబడుతుంది. వేరే దారి లేక ఆమెకు సెక్యురిటీగా శక్తిని పంపిస్తాడు ప్రభు.
శక్తిపైనే దాడులు...ఈ ఇద్దరూ టింగు రంగా అంటూ ప్రయాణం అవుతారు. కానీ ఇద్దరి పై దాడి జరుగుతుంది. ఆ దాడిని శక్తి శక్తివంతంగా ఎదుర్కొంటాడు. ఆ తర్వాత కూడా ఎటాక్ జరుగుతుంది. సినిమా ఇంటర్వెల్ కి చేరుకునే సమయానికి ఈ ఎటాక్ లు జరుగుతున్నవి ఇలియానాపై కాదు..తనపైనే అని తెలుసుకుంటాడు శక్తి. అక్కడ సినిమా ఇంటర్వెల్ చేరుకుంటుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఆరంభం అవుతుంది. రుద్ర(ఎన్టీఆర్)అనే అతను శక్తి పీఠాలు ఉన్న రాజ్యానికి రాజు. వాటిని దొంగలించి అపారమైన శక్తి సంపాదించాలని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నం చేస్తాయి. వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలనుకుంటాడు రుద్ర. ఈ పోరాటంలో రుద్ర చనిపోతాడు. రుద్ర వంశానికి చెందిన శక్తి ఆ శక్తి పీఠాలను కాపాడటానికి నడుం బిగిస్తాడు. క్లుప్తంగా ‘శక్తి’ కథ అని ఫిలింనగర్ వర్గాల్లో జరిగిన చర్చలు బట్టి తెలిసింది.