ఇటీవల హీరో నందమూరి బాలకృష్ణపై తయారు చేసిన ఐ హేట్ బాలకృష్ణ వెబ్‌సైట్ సంగతి బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం ఇదే తరహాలో ఐ హేట్ చిరంజీవి అంటూ మరో వెబ్‌సైట్ వచ్చింది. దీంతో పోలీసులు ఈ వెబ్‌సైట్‌లపై ఆరా తీస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఈ వెబ్‌సైట్ వివరాలను తెలియజేస్తూ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలకృష్ణ, చిరంజీవిపై తయారు చేసిన వెబ్‌సైట్లను తయారు చేసిన వారిని గుర్తించేందుకు సిసిఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నా మని సిసిఎస్ అధికారి డిసిపి సత్యనారాయణ తెలిపారు. సినీ హీరోల ప్రతిష్టను దిగజార్చేవిధంగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రూపొందిస్తున్న వెబ్‌సైట్లపై పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సైబర్ పోలీసు బృందాలను రంగంలో దించారు.