జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన చిత్రం 'శక్తి'. ఈ చిత్రం కథ గురించి చెబుతూ దర్సకుడు మెహర్ రమేష్..ఈ చిత్రం కథ శక్తి పీఠాల నేపధ్యంలో సాగుతుంది అన్నారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహమణ్యం ఈ చిత్రంలో శక్తి పీఠాల ప్రాశస్త్యం గురించి వివరిస్తారని చెప్పారు. ఇక ఎన్టీఆర్ రోల్ ..ఐదు డైమన్షన్స్ లలో ఉంటుందని అన్నారు. ఇక శక్తి చిత్రం మార్చి 30 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో నిన్న (ఆదివారం) రాత్రి హైదరాబాద్ లో ని హైటెక్స్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, ఇలియానా, మెహర్ రమేష్, అశ్వనీదత్ జాకీ షరీఫ్, సుమ, దయానంద్, మణిశర్మ, నాని, మంజరి, మంజు భార్గవి, మెహర్ రమేష్, బోయపాటి శ్రీను, కే.ఎస్.రామారావు, గణేష్ తదితరులు హాజరయ్యారు.తోలి సీడీని ఎన్టీఆర్ విడుదల చేసి మణిశర్మ కి ఇచ్చాడు. ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి, జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.