12/6/10
నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు:భాస్కర్
నాగబాబు కడుపుమండి కొందరు దర్శకులపై మండిపడ్డారు. నిర్మాత అనేవాడు ఇండస్ట్రీకి ప్రాణం. అటువంటి నిర్మాతను వైరస్‌లా పట్టిపీడిస్తూ పిప్పి చేస్తున్నారు కొందరు దర్శకులు. మన శరీరంలో వైరస్ ఎలా రోగాన్ని తెచ్చి చివరికి చంపేస్తుందో అలాగే చేతకాని దర్శకుడు నిర్మాతను పిండిచేసి ఆ తర్వాత వారూ చచ్చిపోతారు. ఇదంతా కడుపు మండి అంటున్నానని ఆదివారం రాత్రి రవితేజ మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో చెప్పారు.
అప్పటివరకూ సరదాగా సాగుతున్న ఫంక్షన్ కాస్తా ఒక్కసారిగా మిరపకాయ్ అంత ఘాటెక్కింది. దర్శకులు గురించి మాట్లాడుతూ... ఎన్ని రోజులు సినిమా తీస్తామో తెలియని దర్శకులున్నారు. కొత్త నిర్మాత వస్తే పురుగుల్లా దోచేస్తున్నారు. ఇది అందరినీ ఉద్దేశించినది కాదు. రాంగోపాల్ వర్మను చూడండి. ఆయన అమితాబ్ వంటి గొప్ప ఆర్టిస్టును పెట్టుకుని పరిమిత టైమ్‌లో సినిమా తీశారు. ఏం... ఆయనకంటే.. మీరు పోటుగాళ్లా.. అంటూ ప్రశ్నించారు.
ఒకప్పుడు 2సి కెమేపాతో అడవిరాముడు తీశారు. అప్పటి నుంచి టెక్నాలజీ పెరిగినా మేకింగ్‌లో రోజులు మాత్రం ఎక్కువ సాగుతున్నాయి. ఎందుకని...? దర్శకులు చేతకానివారు కాబట్టి. నిర్మాత నమ్మి డబ్బు పెడితే దోచేస్తారా..? అలాగే ఆర్టిస్టులు కూడా రేటు తగ్గించుకోవాలి. రాంగోపాల్ వర్మలా సినిమాలు తీసి తెలుగు ఇండస్ట్రీని బాగు చేయండి అన్నారు.
దీంతో అదంతా ఆరెంజ్ దర్శకుడు భాస్కర్ గురించేనని అక్కడివారందరికీ అర్థమైంది. అర్థంపర్థం లేని కథతో 30 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్‌తో తీసినా ఆరెంజ్ "ఢాం"మని పేలిపోయింది. దీంతో నాగబాబు సందర్భం దొరికినపుడల్లా భాస్కర్‌పై మండిపడుతున్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినాయక్.. ఒక్కసారి తనను తాను బేరీజు వేసుకుని తన సినిమాలు కూడా ఎన్ని రోజులు తీశానో అనే డౌట్ వస్తుందనీ, ఇక నుంచి నిర్మాత చెప్పినట్లే తీస్తానని అన్నారు.
Powered by web analytics software. |